National

రేపిస్టుకు గ్రామ శిక్ష…దున్నపోతుపై ఊరేగించారు...

Submitted by arun on Tue, 09/18/2018 - 11:18

ఉత్తరప్రదేశ్‌లో అత్యాచారం చేసిన వ్యక్తికి దేహాశుద్ధి చేశారు స్థానికులు. నిందితుడి ముఖానికి నల్ల రంగు పూసి, అతన్ని దున్నపోతుపై ఊరేగించారు. అతని మెడలో షూలతో చేసిన దండను వేసి చాలా హేయంగా శిక్షించారు. ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. అభం శుభం తెలియని 8 ఏళ్ళ బాలుడికి మాయ మాటలు చెప్పి ఓ వ్యక్తి నిర్జన ప్రదేశంలోకి తీసుకువెళ్లి అత్యాచారం చేశాడు. సదరు బాధిత బాలుడు ఇంటికి వచ్చి అమ్మానాన్నలతో జరిగిన ఉదంతం గురించి చెప్పాడు. వారు పోలీస్ స్టేషన్‌కు వెళ్ళకుండా గ్రామ పెద్దల దగ్గరకు వెళ్లి జరిగింది చెప్పారు. అప్పుడు వాళ్ళు పంచాయితీ పెట్టి నిందితుడికి శిక్ష అమలు చేశారు.

35 రూపాయలకే పెట్రోల్‌!

Submitted by arun on Mon, 09/17/2018 - 15:19

పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు ప్రధాని మోదీ కొంప ముంచుతాయని యోగా గురు రాందేవ్ బాబా సున్నితంగా హెచ్చరించారు. ప్రభుత్వం పన్నుల్లో ఉపశమనం కలిగిస్తే తాను లీటర్ పెట్రోల్, డీజిల్‌ను కేవలం రూ.35 నుంచి రూ.40కే దేశానికి అందిస్తానని చెప్పారు. ఎన్‌డీటీవీ యూత్ కాంక్లేవ్ సదస్సులో మాట్లాడిన బాబా రాందేవ్ సమకాలీన అంశాలపై ఆసక్తికరంగా స్పందించారు. పెరుగుతున్న ధరలపై మోదీ ఏదో ఒక చర్య తీసుకోవాలని, లేదంటే ఆయనకు కష్టాలు తప్పవని సూచించారు. పెట్రోలియం ఉత్పత్తులను కూడా జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చి, 28 శాతం శ్లాబ్ కింద ఉంచాలని ఆయన సూచించారు. తాను ఏ పార్టీకి అనుకూలంగా లేనని, రాజకీయాలకు దూరంగా ఉన్నానని తెలిపారు.

ఎంపీ కాళ్లు కడిగి.. ఆ నీటినే తాగి..

Submitted by arun on Mon, 09/17/2018 - 15:09

జార్ఖండ్‌కు చెందిన ఓ బీజేపీ ఎంపీపై నెటిజన్లు మండిపడుతున్నారు. గొడ్డా పార్లమెంట్‌ నియోజక వర్గ ఎంపీ నిశికాంత్‌ దుబే ఆదివారం ఓ ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన ప్రసంగించిన అనంతరం పవన్ అనే బీజేపీ కార్యకర్త ఓ ప్లేటు, లోటాలో నీళ్లు తీసుకుని ఎంపీ కాళ్ల వద్ద కూర్చున్నాడు. ప్లేటులో దూబే కాళ్లు కడిగి, తువాలుతో పాదాలు శుభ్రంగా తుడిచాడు. పాదాలు కడిగిన నీటిని తాగి తలపై చల్లుకున్నాడు. ఈ సందర్భంగా అక్కడున్న వారంతా ‘‘పవన్ భాయ్ జిందాబాద్’’ అని నినాదాలు కూడా చేశారు. దీనికి సంబంధించి వీడియోను నిశికాంత్‌ తన ఫేస్‌బుక్‌ అకౌంట్‌లో పోస్ట్‌ చేశారు.

టీటీడీ ఇష్యూ ...స్వామికి సుప్రీంకోర్టులో చుక్కెదురు

Submitted by arun on Mon, 09/17/2018 - 13:24

బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. టీటీడీ వివాదంపై సుబ్రహ్మణ్యస్వామి దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. తన పిటిషన్‌ను హైకోర్టులో దాఖలు చేసుకోవాలని అత్యున్నత న్యాయస్థానం ఆయనకు సూచింది. విరాళాలు, కానుకల రూపంలో కోట్ల రూపాయలు టీటీడీకి వస్తున్నాయని, వీటి నిర్వహణ, ఆడిట్ సరిగా నిర్వహించలేదన్నారు. ఖర్చులు, వివరాలు బయటపెట్టలేదన్న స్వామి, వీటన్నింటిపై విచారణ చేయాలని ఆర్గ్యుమెంట్ చేశారు. ఆయన వాదనను న్యాయస్థానం తోసిపుచ్చింది.

ప్ర‌శాంత్ కిషోర్ రాజ‌కీయ‌రంగ ప్ర‌వేశం....వైసీపీలో కోత్త పంచాయితీ....

Submitted by arun on Mon, 09/17/2018 - 10:07

ఎన్నికల వ్యూహాలు రచించడంలో గొప్ప పేరు దేశ రాజకీయాల్లో చాణిక్యుడిగా కీర్తి అధికారంలోకి వ‌చ్చేది మనమే.. అధికారం తెచ్చేది నేనే.. అంటూ అన్న ఆయనమాటలను సీరియస్ గా తీసుకున్నారు వైసీపీ అధినేత సంవత్సరం తిరిగేలోపలే ఎన్నికలకు ఇంకా ఆరు నెలల సమయం ఉండగా ఆయ‌న వేరే పార్టీలో చేరారు దీంతో ఆపార్టీ నేత‌లు షాక్ కు గుర‌య్యారు ఇంత‌కీ ఆయ‌న్ని ఇక‌పై పార్టీ వ్యూహ‌క‌ర్త‌గా కొన‌సాగిస్తుందా లేదా ప్ర‌స్తుతం ఇదే అంశం హాట్ టాపిక్ గా కొనసాతుతోంది. 

ఆ పార్టీలో చేరుతున్న ప్రశాంత్ కిషోర్.. వైసీపీకి ఇక డౌటే..

Submitted by nanireddy on Sun, 09/16/2018 - 11:54

రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నారు. తన రాజకీయ ప్రస్థానాన్ని బీహార్ నుంచి ఆరంభించనున్నాడు.  ఆదివారం జనతా దళ్ యునైటెడ్ (జేడీయూ)లో చేరుతున్నట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని ప్రశాంత్ కిశోర్ ఓ ట్వీట్‌లో పేర్కొన్నాడు 'బిహార్ నుంచి కొత్త ప్రయాణాన్ని ప్రారంభించడం ఉత్తేజభరితంగా ఉంది' అని  ట్వీట్ చేశాడు. 
 

ఆగని పెట్రో సెగ.. సెంచరీకి చేరువగా..

Submitted by nanireddy on Sun, 09/16/2018 - 11:22

పెట్రో ధరలు ఇంకా మండుతూనే ఉన్నాయి. రోజుకో విధంగా ఆయిల్ కంపెనీలు ఇంధన రేట్లను పెంచుతూ వినియోగదారులకు షాక్ ఇస్తూ ఉన్నాయి. తాజాగా ఆదివారం కూడా పెట్రోల్ రేట్లు పెరిగాయి. దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో పెట్రోల్ రేట్లు రికార్డు స్థాయిలో పెరిగి సెంచరీకి చేరువయ్యాయి. ముంబైలో పెట్రోల్ లీటర్‌ ధర రూ 89.29కి చేరగా డీజిల్‌ ధర లీటర్‌కు రూ 78.26కు పెరిగింది. ఇక హైదరాబాద్‌లో పెట్రోల్‌ లీటర్‌కు రూ 86.25 పలికింది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్‌ ధర లీటర్‌కు రూ 81.91కు పెరగ్గా, డీజిల్‌ ధరలు లీటర్‌కు రూ 73.32కు పెరిగాయి. 

మరో ప్రయోగానికి ఇస్రో శ్రీకారం

Submitted by nanireddy on Sun, 09/16/2018 - 11:06

ఇస్రో మరో ప్రయోగానికి సిద్ధమైంది. PSLV C-42 రాకెట్ ద్వారా ఇవాళ(ఆదివారం) రాత్రి ప్రయోగాన్ని చేపట్టనుంది. దీని కోసం సతీష్ ధావన్ స్పేస్ సెంటర్‌లో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. PSLV C-42 రాకెట్ ద్వారా బ్రిటన్ కు చెందిన నోవా S.A.R-S, S.S.T.L- S1 ఉపగ్రహాలను నింగిలోకి తీసుకెళ్లనుంది. దీనికి సంబంధించిన శాటిలైట్ అమరిక పనులు పూర్తయ్యాయి. ఇప్పటికే కౌంట్‌ డౌన్‌ కూడా కొనసాగుతోంది. కాగా PSLV రాకెట్ల ద్వారా విదేశాలకు చెందిన ఉపగ్రహాలను పంపుతోంది. ఇప్పటి వరకు ఇస్రో 43 PSLV రాకెట్లను నిర్ణీత కక్షలోకి పంపించగా అందులో 41 రాకెట్లు దిగ్విజయంగా కక్షలోకి చేరుకున్నాయి. కేవలం రెండు మాత్రమే ఫెయిల్ అయ్యాయి.

జమ్మూ కాశ్మీర్‌ లో ఎన్ కౌంటర్.. ఐదుగురు ఉగ్రవాదుల హతం

Submitted by nanireddy on Sun, 09/16/2018 - 09:19

జమ్మూ కాశ్మీర్‌ కుల్గామ్‌లో ముష్కర వేట కొనసాగుతోంది. కజిగూండ్‌లోని చౌగమ్ ప్రాంతంలో ఉగ్రవాదులు తలదాచుకున్నారన్న సమాచారంతో పోలీసులు సెర్చ్‌ నిర్వహించారు.ఈ క్రమంలో తీవ్రవాదులు కాల్పులు జరిపారు. భద్రతా దళం కూడా వారిపై ఎదురు కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో  మొదట ముగ్గురు తీవ్రవాదులు హతమవ్వగా. తరువాత మరో ఇద్దరి కోసం జల్లెడ పట్టి వారిని కూడా గుర్తించి హతమార్చారు. ఎన్‌కౌంటర్‌ కారణంగా బారాముల్లా, క్వాజీగండ్‌, మధ్య రైళ్ల రాకపోకలను నిలిచిపోయాయి. భద్రతా దళాలు నిరంతరం అప్రమత్తంగా ఉన్నప్పటికీ ఉగ్రమూకలు రెచ్చిపోతున్నారు. దీంతో అధికారులు గాలింపును ముమ్మరం చేశారు. 

మళ్ళీ పెరిగిన పెట్రోల్‌, డీజిల్ ధరలు

Submitted by nanireddy on Sat, 09/15/2018 - 11:06

పెట్రోల్‌, డీజిల్ ధరలు రోజురోజుకు పెరుగుతుండడంతో సామాన్యులకు ఏమి చెయ్యాలో అర్ధం కాక వాహనాలు బయటికి తీయకూండా బస్సుల్లో , ఆటోల్లో వెళుతున్నారు. అయినా ఆయిల్ కంపీనీలు దిగిరావడం లేదు.. రోజుకో విధంగా రేట్లను పెంచుతూ సామాన్యుల నడ్డి విరుస్తున్నాయి. శనివారం కూడా పెట్రోల్, డీజిల్ ధరలు స్వల్పంగా పెరిగాయి.దేశ రాజధాని ఢిల్లీలో 35 పైసలు పెరిగిన పెట్రోలు ధర రూ.81.63కి చేరింది. మరోవైపు డీజిల్ ధర 24 పైసలు పెరిగి రూ. 73.54కి చేరింది. అలాగే దేశ ఆర్ధిక రాజధాని ముంబయిలో 34 పైసలు పెరిగిన పెట్రోలు ధర రూ.90కి 99 పైసల దూరంలో నిలిచింది ఇక డీజిల్ ధర 25 పైసలు పెరిగి రూ.78.07కు చేరింది.