National

లాలూ ప్రసాద్ యాదవ్ కు తీవ్ర అస్వస్థత

Submitted by nanireddy on Sun, 11/18/2018 - 07:39

బిహార్ మాజీ సీఎం, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తీవ్ర అస్వస్థతతో ఉన్నారు. దీంతో ఆయనను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.  ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని సమాచారం. ఆయన తనంతట తాను నిలబడలేకపోతున్నారని, కూర్చోలేకపోతున్నారని లాలూను పరామర్శించిన ఆర్జేడీ వర్గాలు తెలిపాయి.

వెయ్యి కిలోల కుక్క మాంసం పట్టుకున్న అధికారులు

Submitted by nanireddy on Sat, 11/17/2018 - 20:12

తమిళనాడులో ఆశ్చర్యకర ఘటన చోటుచేసుకుంది. ఓ పార్శిల్‌ లో దాదాపు 1000 కిలోల కుక్కమాంసం బయటపడింది. ఈ ఘటన ఎగ్మోర్ రైల్వే స్టేషన్ లో వెలుగుచూసింది. రైల్వే స్టేషన్ లోని ఐదో నంబర్‌ ప్లాట్‌ఫాంపై ఓ భారీ అనుమానాస్పద పార్శిల్‌ ను ప్రయాణికులు చూసి పోలీసులకు సమాచారం అందించారు. దాంతో ఫుడ్‌ సెక్యూరిటీ అధికారులతో రైల్వే స్టేషన్ కు వచ్చిన పోలీసులు ఆ పార్సిల్ ను తెరచి చూశారు. అందులో మాంసం కనిపించేసరికి వారు షాక్ కు గురయ్యారు. దాదాపు 1000 కిలోల కుక్క మాంసంగా భావించిన ఫుడ్‌ సెక్యూరిటీ అధికారులు పరీక్షల నిమిత్తం దానిని ల్యాబ్‌కు తీసుకువెళ్లారు.

ఇండో-పాక్ యుద్ధ వీరుడు కుల్దీప్ సింగ్ కన్నుమూత

Submitted by nanireddy on Sat, 11/17/2018 - 19:53

1971లో పాకిస్థాన్‌తో జరిగిన యుద్ధంలో పాక్ సైన్యంపై వీరోచిత పోరాటం చేసిన బ్రిగేడియర్ కుల్దీప్ సింగ్ చంద్రపురి (78) మృతి చెందారు. గత కొంతకాలంగా కేన్సర్‌తో బాధపడుతున్న ఆయన నేడు తుదిశ్వాస విడిచారు. క్యాన్సర్ చికిత్స కోసం కుల్దీప్ సింగ్ పంజాబ్‌ మొహాలీలోని ఫోర్టిస్ ఆసుపత్రిలో చేరారు. అయితే ఆయన ఆరోగ్యం విషమించి మృతిచెందారని వైద్యులు వెల్లడించారు. అయనకు భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. 1971లో పాకిస్థాన్‌తో యుద్ధం జరిగినప్పుడు ఆయన ఇండియన్ ఆర్మీలో మేజర్‌గా పనిచేస్తున్నారు. రాజస్థాన్‌లోని లాంగేవాలా బోర్డర్ పోస్టును పాక్ సైనికుల నుంచి కాపాడారు.

అమ్మాయిలకు స్కూటీలు, 10 లక్షల ఉద్యోగాలు..

Submitted by chandram on Sat, 11/17/2018 - 17:56

ఎన్నికలు వస్తున్నయంటే చాలు హోరాహోరిగా ప్రచారంలో దూసుకుపోతుంటారు నేతలు, ప్రజలకు అరచేతిలోనే ఆకాశాన్ని చూప్తిస్తారు, ఇక హామీలకైతే హద్దే ఉండదు. అవి నేరవేరుస్తారో లేదో తెలియదు కాని హామీల వర్షం కురిపిస్తారు నేతలు. తాము ఎన్నికల్లో గెలిస్తే రాష్ట్రాని హైదరాబాద్ తరహాలో మెట్రోరైలు, పది లక్షల ఉద్యోగాలు, ఆడపిల్లలకు స్కూటీ అందజేస్తామని  మధ్యప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ నేతలు అన్నారు. కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ లు నేడు మేనిఫేస్టో విడుదల చేశారు. ఈ సందర్భంగా కేంద్ర ఆర్ధిక మంత్రి  జైట్లీ మాట్లాడుతూ ప్రజల కనీస జీవన ప్రమాణాలు పెంచడమే తమ అజెండా అని ఆయన వ్యాఖ్యానించారు.

పరువు హత్య...ప్రాణం ఉండగానే కాళ్లు చేతులు కట్టేసి నదిలో పడేశారు

Submitted by arun on Sat, 11/17/2018 - 16:41

కులాంతర వివాహం చేసుకున్న కుమార్తెపై కక్ష పెంచుకున్న తల్లిదండ్రులు ఆమెతోపాటు అల్లుణ్ని కూడా అత్యంత పాశవికంగా హత్య చేశారు. తక్కువ కులం అబ్బాయిని పెళ్లిచేసుకుని తమ పరువు తీసిందని భావించిన అమ్మాయి కుటుంబసభ్యులు ఇద్దర్నీ కావేరీ నదిలో తోసేసి హత్య చేశారు. అత్యంత కిరాతమైన ఈ ఘటన గతవారం కర్ణాటక- తమిళనాడు సరిహద్దుల్లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... తమిళనాడు కృష్ణగిరి జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన నందీష్(26), స్వాతి(19) గత కొంతకాలం నుంచి ప్రేమించుకుంటున్నారు. వీరి కులాలు వేరు కావడంతో నందీష్, స్వాతి పెళ్లికి అమ్మాయి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు.

మహాకూటమికి గ్లామర్ బూస్ట్...ప్రచార పర్వంలోకి టాలీవుడ్ స్టార్

Submitted by arun on Sat, 11/17/2018 - 10:55

తెలంగాణ ఎన్నికల ప్రచార బరిలోకి సింహా దిగుతున్నాడు. మహాకూటమి తరుపున టీడీపీ ఎమ్మెల్యే, నటరత్న బాలకృష్ణ ప్రచారం చేయనున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ప్రకటించారు. ఇప్పటికే కాంగ్రెస్ స్టార్ క్యాంపెనర్ విజయశాంతి ఉన్నారు. ఇప్పుడు బాలకృష్ణ రంగంలోకి దిగనుండడంతో మహాకూటమికి గ్లామర్ తోడు కాగా టీఆర్ ఎస్ లో కలవరం పుట్టిస్తోంది. తెలంగాణలో చావు లోతు కష్టాల్లో ఉన్న టీడీపీకి కాంగ్రెస్ పొత్తు కొత్త జోష్ ఇస్తుంది. మహాకూటమిలో కోరిన సీట్లను టీడీపీ దక్కించుకుంది. మహాకూటమి తరపున ప్రచారం చేస్తానని హిందూపురం ఎమ్మెల్యే, నటరత్న బాలకృష్ణ ప్రకటించడంతో తెలుగు తమ్ముళ్లు ఆనందోత్సాహల్లో మునిగితేలుతున్నారు. 

తెరుకుచున్న 'శబరిమల' తలుపులు

Submitted by chandram on Fri, 11/16/2018 - 19:54

మండల పూజల కోసం శబరిమల ఆలయం మరోసారి తెరుచుకుంది. భక్తుల శరణుఘోష మధ్య ప్రధాన అర్చకుడు కందరవు రాజీవరు ఆలయం ద్వారాలను తెరిచారు. ఈ సారి రెండు నెలలకు పైగా స్వామివారు దర్శనమివ్వనున్నారు. మరోవైపు సుప్రీం ఆదేశాలు ఆ తర్వాత జరిగిన పరిణామాలను దృష్టిలో పెట్టుకుని ఆలయం పరిసరాల్లో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఇటు అయ్యప్పను దర్శించుకునేందుకు భూమాత బ్రిగేడ్‌ సంస్థ అధ్యక్షురాలు తృప్తిదేశాయ్‌ స్వామివారిని దర్శించుకోకుండానే వెనుదిరిగి చూశారు. 

అలోక్ వర్మ 19 లోగా స్పందించాలి..: సుప్రీం

Submitted by chandram on Fri, 11/16/2018 - 18:13

సీబీఐ డైర‌క్ట‌ర్ అలోక్ వ‌ర్మ‌పై సెంట్ర‌ల్ విజిలెన్స్ క‌మిష‌న్  ఇచ్చిన రిపోర్ట్‌పై  సుప్రీంకోర్టు స్పందించింది. ఆ నివేదిక అసంబ‌ద్ధంగా ఉంద‌ని ఉన్నత న్యాయస్థానం అభిప్రాయ‌ప‌డింది. సీవీసీ ఇచ్చిన నివేదిక‌ను అలోక్ వ‌ర్మ‌కు ఇవ్వాల‌ని సుప్రీం తెలిపింది. ఆ త‌ర్వాత ఆ నివేదిక‌లో ఉన్న అంశాల‌పై అలోక్ వ‌ర్మ‌ మ‌ళ్లీ కోర్టును ఆశ్ర‌యించాల‌ని సుప్రీం త‌న తీర్పులో పేర్కొంది. సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ, ప్రత్యేక డైరెక్టర్ రాకేశ్ ఆస్థానాలు ఒకరిపై ఒకరు అవినీతి ఆరోపణలు చేసుకోవడంతో కేంద్ర విజిలెన్స్ కమిషన్  దర్యాప్తు చేపట్టింది.

అగ్రిగోల్డ్‌ కేసులో కీలక మలుపు

Submitted by chandram on Fri, 11/16/2018 - 17:02

అగ్రిగోల్డ్ కేసు కొత్త మలుపు తిరిగింది. హాయ్‌ల్యాండ్ ఆస్తి తమది కాదని అగ్రిగోల్డ్ ఎండీ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. విచారణలో ఈ విషయాన్ని ఇన్నాళ్లు ఎందుకు చెప్పలేదని అగ్రిగోల్డ్‌పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సీఐడీపై దర్యాప్తు అసంతృప్తి వ్యక్తం చేసిన హైకోర్టు సిట్ ఏర్పాటు చేసే, విచారణను తాము పర్యవేక్షిస్తామని తెలిపింది. హాయ్‌లాండ్‌ ప్రాపర్టీ తనేదని అలూరి వెంకటేశ్వర్లు హైకోర్టు తెలపడంతో కొత్త మలుపు తిరిగింది. కేసుపై సీఐడీ దర్యాప్తు సరిగ్గా లేదని మందలిస్తూ తదుపరి విచారణ ఈనెల 23కు వాయిదా వేసింది. 
 

రేపే ఇంజిన్‌లెస్ ట్రైన్ 18 ట్రయల్ రన్

Submitted by chandram on Fri, 11/16/2018 - 15:14

భారతీయ రైల్వే పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో దేశీయంగా రూపొందించిన సెమీ హైస్పీడు రైలు "ట్రైన్ 18"కు  రేపు పెద్దఎత్తున అధికారులు ట్రయల్  రన్ నిర్వహిస్తున్నారు. మొదటగా బరేలీ నుండి మొరాదాబాద్ రైల్వే లైన్లో  ట్రైన్ 18ను ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. ఇప్పటికే ఈ ట్రయిల్ రన్ కోసం ఆర్‌డీఎస్‌ఓ సిబ్బంది మొరాదాబాద్ కు చేరారు. కాగా ఈ రైలు రూ. 100 కోట్లతో రూపొందించారు. ఇది గంటకు 160 కి.మీల వేగంతో దూసుకుపోతుంది. ట్రైన్ 18 ప్రారంభమైతే దీన్ని శతాబ్ది ఎక్స్‌ప్రెస్ స్థానంలో నడిపాలని భావిస్తున్నట్టు రైల్వే మంత్రిత్వ శాఖ అధికారులు చెప్పారు.