actress sridevi

శ్రీదేవిని చంపింది ఆమె కుటుంబీకులే!

Submitted by arun on Mon, 03/19/2018 - 10:54

ఇండియన్ సెల్యులాయిడ్ ఐకాన్ శ్రీదేవి ‘మరణం’ మళ్ళీ వార్తల్లోకెక్కింది. మిస్టరీ ఏమీ లేదని, ఆమెది సహజ మరణమేనని దుబాయ్ దర్యాప్తు అధికారులు తేల్చిచెప్పడంతో ఆ ‘కథ’ అక్కడితో ముగిసిపోయిందనుకున్నారు. కానీ.. ఆ విషయాన్ని అంత తేలిగ్గా తీసుకోవద్దంటూ ఇప్పుడో కొత్త వాదన బైటికొచ్చింది. ఇది కూడా సాక్షాత్తూ ఉగాది పర్వదినాన.. ఉగాది పంచాంగ శ్రవణంలో వినిపించడం గమనార్హం.

శ్రీదేవి మ‌ర‌ణంపై ఒక‌రోజు వెన‌క్కి వెళ్లిన దుబాయ్ పోలీసులు

Submitted by arun on Tue, 02/27/2018 - 14:38

అతిలోక సుందరి శ్రీదేవి మరణం వెనుక దాగిన మిస్టరీ ఏంటి..? గుండె పోటా..? ప్రమాదమా..? లేక మరేదైనానా..? శ్రీదేవి మరణం తర్వాత దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న విషయం ఇది. పెళ్లి ఫంక్షన్ కోసం దుబాయికి వెళ్లిన శ్రీదేవి..ఆరు రోజులపాటు అక్కడే ఉంది. అసలు ఆ ఆరు రోజులు ఏం జరిగింది..? శ్రీదేవి మరణానికి ముందు ఆ ఆరు రోజులే ఇప్పుడు కీలకంగా మారాయి. వెండితెర జాబిలి మరణరహస్యాన్ని చేధించేందుకు ఒక్కోరోజు వెనక్కి వెళ్తున్నారు దుబాయి పోలీసులు.

శ్రీదేవి మ‌ర‌ణంపై అనుమానాలు

Submitted by arun on Mon, 02/26/2018 - 11:33

అతిలోకసుందరి శ్రీదేవి మరణంతో యావత్ చిత్ర పరిశ్రమలో విషాదఛాయలు అలుముకున్నాయి. అయితే శ్రీదేవి మరణం తర్వాత ఓ విషయం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ముఖ్యంగా శ్రీదేవి హఠాన్మరణంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శ్రీదేవి మరణాన్ని జీర్జించుకోలేకపోతున్న హార్డ్‌కోర్‌ ఫ్యాన్స్‌ అసలు ఈ ఘటన ఎలా జరిగిందంటూ ప్రశ్నలు సంధిస్తున్నారు. దేశంకాని దేశంలో ఇన్సిడెంట్‌ జరగడంతో అసలేం జరిగి ఉంటుందోనంటూ సందేహాలు లేవనెత్తుతున్నారు.  

తెలుగింటి ఆడపడుచు శ్రీదేవి

Submitted by arun on Mon, 02/26/2018 - 11:19

సినిమా రంగాన్ని ఓ ఊపు ఊపిన హీరోయిన్, అతిలోకసుందరి శ్రీదేవి...అచ్చ తెలుగు ఆడపడుచు. శ్రీదేవి తమిళనాడులోని శివకాశిలో జన్మించినప్పటికి...ఆంధ్రప్రదేశ్‌లోనూ మూలాలు ఉన్నాయ్. అమె తల్లి రాజేశ్వరి తిరుపతిలోని తీర్థకట్టవీధిలో జన్మించారు.

మిధున్‌తో శ్రీదేవి వివాహం ఓ మిస్టరీ..?

Submitted by arun on Sun, 02/25/2018 - 13:44

నాలుగేళ్ల వయసులో బాలనటిగా ఎంట్రీ ఇచ్చిన శ్రీదేవి ఇంతలా సినిమాల్లో రాణిస్తుందని బహుశా ఆమె తల్లిదండ్రులు కూడా కలలో ఊహించి ఉండరేమో?. అలా బాలనటి నుంచి అతిలోక సుందరి వరకూ తన అందచెందాలతో నటించి మెప్పించి ఇండియా స్టార్ హీరోయిన్‌‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. శ్రీదేవి హఠాన్మరణం అందర్నీ విషాదంలో ముంచెత్తింది. తన భర్త బోనీకపూర్ బంధువు వివాహానికి కుటుంబ సభ్యులతో కలిసి దుబాయ్ వెళ్లిన శ్రీదేవి ఆదివారం తెల్లవారు జామున (ఫిబ్రవరి-24న) గుండెపోటుతో మరణించారు.

శ్రీదేవి జీవితంలో మరపురాని ఘట్టాలు...

Submitted by arun on Sun, 02/25/2018 - 13:30

లైట్స్, కెమెరా, యాక్షన్.. జీవితాంతం ఈ మూడు పదాల వెంట నడిచిన శ్రీదేవి ఆకస్మిక మరణం సినీ ప్రియులను కలచివేస్తోంది. తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలో రారాణిగా వెలుగొందిన శ్రీదేవి హిందీలో 1983లో చేసిన రెండో చిత్రం ‘హిమ్మత్‌వాలా’తో బాలీవుడ్‌లోనూ సత్తా చాటింది. ఆ తర్వాత ‘లమ్హే’ సినిమాతో ఆమె ప్రభ వెలిగిపోయింది. అనతికాలంలో లేడీ సూపర్‌స్టార్‌గా ఎదిగి బాలీవుడ్‌లో ఆ ఘనత సాధించిన తొలి నటిగా రికార్డు సృష్టించింది. దశాబ్దాల ప్రస్థానంలో తిరుగులేని నటిగా అవతరించింది. శ్రీదేవికి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు..

శ్రీదేవి ఆఖరి ట్వీట్‌ ఇదే

Submitted by arun on Sun, 02/25/2018 - 11:25

అతిలోక సుందరి శ్రీదేవి దివంగతులయ్యారు. భర్త, చిన్న కుమార్తెతో కలిసి ఓ వివాహ నిమిత్తం దుబాయి వెళ్లిన శ్రీదేవి.. అక్కడే గుండెపోటుతో మృత్యు ఒడికి చేరిపోయారు. ఆమె మృతితో ఇండియన్ సినిమా శోకసంద్రంలో మునిగిపోయింది. బోనీ కపూర్‌తో వివాహమయ్యాక ఆమె సినిమాలకు దూరమవడంతో అభిమానులు నిరాశ చెందారు. ఆ తరువాత 2012లో వచ్చిన ‘ఇంగ్లిష్‌ వింగ్లిష్’ చిత్రంతో సెకండ్‌ ఇన్నింగ్స్‌ మొదలుపెట్టారు. 2017లో వచ్చిన ‘మామ్‌’ చిత్రం ఆమె నటించిన అద్భుత చిత్రాల్లో ఒకటి అని చెప్పాలి. ఈ సినిమాలో అమ్మ అంటే శ్రీదేవిలా ఉండాలి అన్నంతగా ఆ పాత్రలో లీనమై నటించారు.

శ్రీదేవి మ‌ర‌ణాన్ని బిగ్ బీ ముందే ఊహించారా ?

Submitted by arun on Sun, 02/25/2018 - 10:41

బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ చేసిన ఓ ట్వీట్‌ సోషల్‌ మీడియాలో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సీనియర్‌ నటి శ్రీదేవి మరణవార్త మీడియాలో రావటం కంటే ముందే ఆయన ఓ ట్వీట్‌ చేశారు. అయితే ఆ ట్వీట్‌ ఆమె మృతికి సంబంధించిందేనంటూ ఇప్పుడు ఆసక్తికర చర్చ మొదలైంది. 'ఎందుకో తెలియదు. ఎన్నడూ లేనంత ఆందోళనకు గురవుతున్నా' అంటూ బిగ్ బీట్వీట్ చేశారు. అంటే త‌న‌ సిక్త్ సెన్స్‌తో శ్రీదేవి మ‌ర‌ణాన్ని బిగ్ బీ ముందుగానే ఊహించాడా అంటూ చ‌ర్చించుకుంటున్నారు.