Sridevi

అమ్మా నీ త‌లెత్తుకునేలా చేస్తా

Submitted by lakshman on Sat, 03/03/2018 - 19:02

తొలిసారి త‌న త‌ల్లి శ్రీదేవి మ‌ర‌ణంపై పెద్ద కూతురు జాన్వీక‌పూర్ స్పందించింది. భావోద్వేగంతో కూడిన ఓ లేఖ‌రాసిన జాన్వీ అమ్మానిన్ను త‌లెత్తుకునేలా చేస్తానంటూ పేర్కొంది. ఇప్పుడా లేఖ సోష‌ల్ మీడియాలో తెగ హ‌ల్ చ‌ల్ చేస్తుంది. 

శ్రీదేవిపై వర్మ.. మరోసారి!

Submitted by arun on Sat, 03/03/2018 - 09:30

అందాల తార శ్రీదేవి చనిపోయినప్పటి నుంచి దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. తన అభిమానాన్ని రకరకాలుగా ప్రదర్శించుకుంటూనే ఉన్నాడు. వార్తల్లో నిలుస్తూనే ఉన్నాడు. ఇప్పుడు సోషల్ మీడియాను దాటి.. శ్రీదేవిపై తన అభిమానాన్ని సిల్వర్ స్క్రీన్ పై కూడా చూపించే పనిలో వర్మ పడ్డాడు. ఈ విషయాన్ని ఆయన సన్నిహితులు.. ఓ టీవీ ఇంటర్వ్యూలో చెప్పినట్టుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

శ్రీదేవికి భార‌తర‌త్న ఇవ్వాలి

Submitted by lakshman on Fri, 03/02/2018 - 11:36

బాల‌న‌టిగా తెరంగ్రేటం చేసిన శ్రీదేవి త‌న అందం - అభిన‌యంతో ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న అభిమానుల్ని సొంతం చేసుకుంది. చిన్న వ‌య‌సులోనే వెండితెర‌పై స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న న‌టిగా శ్రీదేవి సొంతం. అంత‌టి లేడి సూప‌ర్ స్టార్ గా ఎదిగిన శ్రీదేవి దుబాయ్ లో మ‌ర‌ణించారు. బోనీ క‌పూర్ మేన‌ళ్లుడి పెళ్లికి వెళ్లిన శ్రీదేవి దుబాయ్ లో జుమేరా ఎమిరేట్స్ హోట‌ల్ బాత్రూంలో ప‌డి క‌న్నుమూశారు.  

మరి కాసేపట్లో అంత్యక్రియలు

Submitted by arun on Wed, 02/28/2018 - 16:50

సినీనటి శ్రీదేవి అంతిమ యాత్ర ముగిసింది. ఆమె అంతిమ యాత్రకు తారాలోకం తరలి వచ్చింది. తన అభిమాన నటిని కడసారి చూసుకునేందుకు అభిమానులు పెద్ద ఎత్తున అంతిమ యాత్రలో పాల్గొన్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమైన శ్రీదేవి అంతిమ యాత్ర ఏడు కిలోమీటర్ల మేర సాగింది. మరోవైపు విల్లేపార్లేలోని సేవా సమాజ్‌ శ్మశాన వాటిక వద్దకు అభిమానులు భారీగా చేరుకున్నారు. శ్రీదేవి పార్థివదేహాన్ని ఆమెకు ఇష్టమైన ఎరుపు రంగు కాంజీవరం చీర, ఎర్రని బొట్టు, పూలతో అలంకరించారు. అంతిమయాత్రలో బోనీ కపూర్‌ కుటుంబీకులందరూ పాల్గొన్నారు.

శ్రీదేవి మృతిపై చంద్రబాబుకూ డౌటా?

Submitted by arun on Wed, 02/28/2018 - 16:35

దిగ్గజ నటి శ్రీదేవి మరణంపై అనేక రకాల అనుమానాలు పొడసూపిన వేళ ఏపీ సీఎం చంద్రబాబు కూడా ఆ ప్రభావంతో కొంత అనుమానాస్పదంగా మాట్లాడారు. తెలుగు తెరపై ఒక వెలుగు వెలిగిన ఆ నటికి నివాళిగా నిన్న టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం చంద్రబాబు చంద్రబాబు సహా టీడీపీ నేతలు సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ... ఆమె ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకోవడం అరుదైన అంశమని కొనియాడారు. అదే సమయంలో శ్రీదేవి మృతి పట్ల రకరకాల వాదనలు వస్తున్నాయని అన్నారు.

శ్రీదేవి ముందు అందం చిన్న‌బోయింది

Submitted by arun on Wed, 02/28/2018 - 15:52

అందం చిన్న బోయింది అందానికి కేరాఫ్ అడ్రస్ అయిన జగదేక సుందరి శాశ్వత నిద్రలోకి జారుకుంటే మరి అందం చిన్న బోక ఏమవుతుంది? ఇక శెలవంటూ ఈ లోకాన్ని వదిలి వెళ్లే చివరి ఘడియల్లోనూ నిండు ముత్తైదువలా కనిపించి ఆ రూపాన్ని  అభిమానుల గుండెల్లో శాశ్వతంగా బందీ అయిపోయింది. దటీజ్ శ్రీదేవి..

Tags

అదే అందంతో వీడ్కోలు ప‌లుకుతున్న శ్రీదేవి

Submitted by arun on Wed, 02/28/2018 - 14:48

శ్రీదేవి నిద్రపోతోంది.. అలు పెరుగని జీవనప్రయాణంలో అలసిపోయి సొలసిపోయి ఎట్టకేలకు శాశ్వతంగా విశ్రాంతి తీసుకుంటోంది.. ముత్తైదువలా పెద్ద బొట్టు, మెడలో నల్ల పూసలు, బంగారు గొలుసు పెదాలకు లిప్ స్టిక్ .. శ్రీదేవి ఎప్పటిలాగే ఉంది.. ఎంతో అందంగా ఉంది.. అదే అందంతో మనకు చివరి వీడ్కోలు చెబుతూ శాశ్వత నిద్రలోకి జారిపోయింది.. ఎర్రని పట్టుచీర కప్పుకుని నిద్రిస్తున్న శ్రీదేవి ముఖంలో అదే అమాయకత్వం.. అదే స్వచ్ఛత.. అదే అందం.. ఈ ముఖం అందరికీ ఎప్పటికీ ఇలాగే గుర్తుండిపోయేలా మనకు చివరి వీడ్కోలు పలికింది.

అతిలోక సుందరి చివరి మజిలీ ప్రారంభం

Submitted by arun on Wed, 02/28/2018 - 14:37

అతిలోక సుందరి చివరి మజిలీ ప్రారంభం అయింది.. జీవించినన్నాళ్లూ నటనకే జీవితాన్ని అంకితం చేసిన అందాల సుందరి ఇక శెలవంటూ మనల్ని విడిచి వెళ్లిపోతోంది.. జాము రాతిరి జాబిలమ్మ తిరిగి రాని లోకాలకు మరలిపోతోంది.. పూల రెక్కలు, కొన్ని తేనెచుక్కలు కలగలిపిన ఈ అపురూప సౌందర్య రాశి..పూల పాన్పుపై నిద్రిస్తున్నట్లుగా కనిపిస్తోందని శ్రీదేవి పార్ధివ దేహాన్ని చూసిన వారు చెబుతున్న మాట.. శ్రీదేవి బౌతిక కాయాన్ని సందర్శించిన వారు బయటకొచ్చి చెప్పిన దాని ప్రకారం శ్రీదేవిని ఎర్రని పట్టుచీరలో అలంకరించారని.. లిల్లీపూల పందిరి కింద లిల్లీ పూల పాన్పుపై పడుకోబెట్టారని చెబుతున్నారు..

Tags

శ్రీదేవి కోరిక మేరకు తెల్లపూలతోనే..

Submitted by arun on Wed, 02/28/2018 - 14:24

దేవకన్య చివరి మజిలీ మొదలైంది. తెల్లని స్వచ్చమైన పూలను ఇష్టపడే శ్రీదేవికి చివరి సారి సాగనంపేందుకు తెల్లని పూలతో అలంకరించిన వాహనాన్ని సిద్ధం చేశారు.. ఆవాహనంలోనే శ్రీదేవి భౌతిక కాయాన్ని ఉంచారు. భౌతిక కాయం వెంట బోనీ కపూ్ర్, ఇద్దరు కుమార్తెలు, ఇతర కుటుంబ సభ్యులు ఉన్నారు.

Tags

శ్రీదేవి మృతికి సంతాపంగా హోలీ సంబ‌రాలు ర‌ద్దు

Submitted by arun on Wed, 02/28/2018 - 13:04

ప్రముఖ నటి శ్రీదేవిని కడసారి చూసేందుకు అభిమానులు ముంబయికి భారీగా తరలివస్తున్నారు. సినీ ప్రముఖులు, నేతలు ఆమె పార్థివదేహానికి నివాళులు అర్పిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఆమె అభిమానులు కన్నీటిసంద్రంలో మునిగారు. పలుచోట్ల అభిమానులు సంతాప సూచకంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. శ్రీదేవి మరణంతో ఆమె నివాసముంటున్న గ్రీన్ ఎకర్స్ సొసైటీ ప్రాంగణంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. శ్రీదేవి మృతి తీవ్రంగా కలచి వేసిందంటూ అక్కడి నివాసితులు కన్నీరు మున్నీరవుతున్నారు. తాజాగా ఆమె పార్దీవ దేహానికి గౌరవ సూచకంగా తామంతా రాబోయే హోలీ వేడుకలను రద్దు చేసుకుంటున్నామని గ్రీన్ ఎకర్స్ సొసైటీ సభ్యులు ప్రకటించారు.