grey list

పాకిస్థాన్‌కు మరో పరాభవం

Submitted by arun on Sat, 02/24/2018 - 16:27

పాకిస్థాన్‌కు మరో పరాభవం ఎదురయింది. తమ దేశంలో పెరుగుతోన్న ఉగ్రవాదాన్ని అణచడంలో సరైన చర్యలు  తీసుకోని కారణంగా అంతర్జాతీయ సమాజం నుండి ఆంక్షలను ఎదుర్కోవలసి వస్తోంది. తాజాగా గ్లోబల్ మనీ లాండరింగ్ వాచ్ డాగ్..  ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్,  పాక్ ను గ్రే లిస్ట్ నేషన్ గా ప్రకటించనుండటంతో ఆ దేశంలో ఆర్థిక వ్యవస్థ మరింత కుదేలయ్యే అవకాశం వుందని నిపుణులు భావిస్తున్నారు.