Navi Mumbai

అంద‌రు చూస్తుండ‌గానే ముద్దు పెట్టుకున్న నరేష్

Submitted by arun on Fri, 02/23/2018 - 12:11

ఇదో షాకింగ్ న్యూస్.. అందరూ చూస్తుండగానే యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు ఓ వ్యక్తి. ఈ ఘటన నవీ ముంబైలోని టర్బే రైల్వే‌స్టేషన్‌లో వెలుగుచూసింది. ఓ యువతి(20) గన్‌సోలీ వెళ్లేందుకు లోకల్ రైలు కోసం ప్లాట్‌ఫాంపై వేచి ఉంది. సదరు యువతిని వెంబడిస్తూ వచ్చిన నరేష్ కె జోషి(43) అనే వ్యక్తి యువతిని బలవంతంగా ముద్దుపెట్టుకున్నాడు. ఆ సమయంలో తోటి ప్రయాణికులు సైతం అక్కడే ఉన్నా ఆ వ్యక్తిని అడ్డుకోవడంగానీ యువతికి సహాయంగా వెళ్లడంగానీ చేయలేదు. నరేష్ అప్పటికే అనుమానాస్పద రీతిలో తిరుగుతూ సీసీ కెమెరాలో కనిపించాడు.