Jaipal Reddy

‘కేసీఆర్.. టీఆర్ఎస్‌ పార్టీని అమ్మొద్దు’

Submitted by arun on Sat, 04/07/2018 - 17:10

టీఆర్‌ఎస్‌, బీజేపీ నేతలపై దుమ్మెత్తిపోశారు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైపాల్‌ రెడ్డి. కోదండరామ్‌ వెనుక తాను ఉన్నది అవాస్తవమని అన్నారు. మోడీ అర్థ వయస్కుడైతే, అమిత్‌ షా అల్ప వయస్కుడని... అమిత్‌ షాకి కొనడం, అమ్మడం మాత్రమే తెలుసని, రాజకీయాల గురించి తెలీదన్నారు. టీఆర్‌ఎస్‌ బీజేపీకి తోక పార్టీ అని, మోడీతో కలిసి కేసీఆర్‌ చీకటి ఒప్పందం చేసుకున్నారని మండిపడ్డారు... మాజీ కేంద్ర మంత్రి జైపాల్‌ రెడ్డి మండిపడ్డారు. పెట్రోల్ ధరలు పెంచుతున్నా మోదీకి సీఎం కేసీఆర్ సహకరించడాన్ని తప్పుపట్టారు.

కేసీఆర్‌‌ది ఫ్రంట్‌ కాదు టెంట్‌

Submitted by arun on Wed, 04/04/2018 - 10:34

కేంద్రంలో మళ్లీ కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందన్నారు జైపాల్‌రెడ్డి. వచ్చే ఎన్నికల్లో మోడీ ఓటమి ఖాయమని జోస్యం చెప్పారు. కేసీఆర్‌‌ ఫ్రంట్‌పై సెటైర్లు పేల్చిన జైపాల్‌... అది ఫ్రంట్‌ కాదు టెంట్‌ అన్నారు. కేసీఆర్‌... మోడీ ఏజెంట్‌ అన్నారు. 2019లో టీఆర్‌ఎస్‌ ఓటమి ఖాయమన్న జైపాల్‌రెడ్డి...  కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి తీరుతుందన్నారు. ఎస్సీ, ఎస్టీల రక్షణ కోసం తీసుకువచ్చిన అత్యాచారాల నిరోధక చట్టాన్ని నిర్వీర్యం చేసే ఆలోచన బీజేపీ మనసులో ఉందని జైపాల్‌రెడ్డి అన్నారు. అయితే నేరుగా ధైర్యం చేయలేక.. సుప్రీంకోర్టు ద్వారా చేసేలా పథకం ప్రకారం వ్యవహరించిందని కరీంనగర్‌లో ఆరోపించారు.

రేవంతా మ‌జాకా

Submitted by arun on Sat, 02/24/2018 - 11:02

ప్రధాన ప్రతిపక్షం తెలంగాణ కాంగ్రెస్ అధికార పార్టీని ఢికొట్టడానికి తన బలాన్ని పెంచుకోవడానికి ఆపరేషన్ ఆకర్ష్ ను ప్రోత్సహిస్తోంది. ఇందులో బాగంగానే ప్రజాబలం ఉన్న సీనియర్ నేతలకు పార్టీ కండువా కప్పి గాంధిభవన్ కు స్వాగతం పలుకుతున్నారు. రేవంత్ రెడ్డి టీమ్ కాంగ్రెస్ లో చేరిన నాటి నుంచి హస్తం పార్టీ వైపు చూసే వారి సంఖ్య పెరుగుతోంది. అయితే, ఇప్పుడు అదే సమస్యగా మారింది. 

జైపాల్‌రెడ్డి వర్సెస్ డీకే అరుణ

Submitted by arun on Fri, 02/23/2018 - 11:04

తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీలో మరో వివాదం రాజుకుంది. పాలమూరు జిల్లాలో నేతల ఆధిపత్య పోరు తీవ్రం కావడంతో మళ్లీ రచ్చకెక్కుతున్నారు. నాగం జనార్ధన్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరితే పార్టీకి నష్టం కలుగుతుందంటున్నారు. స్థానిక నేతల అభిప్రాయాలను తీసుకోకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని పీసీసీపై మండిపడుతున్నారు. 

టీ.పీసీసీలో కొత్త చేరికలపై నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాలమూరు జిల్లాలో గత నెల రోజుల నుంచి ఇదే వ్యవహారంపై నేతల మధ్య వివాదం ఏర్పడింది. బీజేపీ సీనియర్ నేత నాగం జనార్ధన్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరతారని ప్రచారం జరుగుతుండటంతో అడ్డుకునేందుకు సిద్ధమయ్యారు ఆ పార్టీ నేతలు.