DK Aruna

సీఎం కేసీఆర్‌పై డీకే అరుణ ఎదురుదాడి

Submitted by arun on Sat, 06/30/2018 - 10:27

పాలమూరు జిల్లా అభివృద్ధికి కాంగ్రెస్ నేతలు అడ్డుపడుతున్నారంటూ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణ తీవ్ర స్ధాయిలో స్పందించారు.   ప్రాజెక్టుల అంచనాలను పెంచి  కమీషన్ల కొల్లగొడుతున్న కేసీఆర్‌,  హరీష్‌రావులకు తమను విమర్శించే అర్హత లేదన్నారు. మంత్రి హరీష్‌‌రావు అవినీతి వల్లే కల్వకుర్తి లిఫ్ట్ పనులు ఆగిపోయాయంటూ అరుణ ఆరోపించారు. 2014 ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీ నెరవేర్చకుండా జిల్లా ప్రజలను మోసం చేసిన సీఎం కేసీఆర్ ప్రజలకు క్షమాపణ చెప్పాలంటూ ఆమె డిమాండ్ చేశారు. ఎన్నికలు వస్తున్నప్పుడే గట్టు ప్రాజెక్టు గుర్తుకు వచ్చిందా ? అంటూ ఆమె ప్రశ్నించారు.

నాగంపై ఘాటు విమర్శలు చేసిన డీకే అరుణ

Submitted by arun on Thu, 06/07/2018 - 16:40

నాగం జనార్దన్‌రెడ్డి టీడీపీలో బలమైన నాయకుడు కావొచ్చేమోగానీ కాంగ్రెస్‌లో కాదని ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి డీకే అరుణ విమర్శించారు. గత ఎన్నికలలో గెలవలేని నాగం బలమైన నాయకుడు ఎలా అవుతారు?.. బలమైన నాయకుడు అంటే లావుగా ఉండడం కాదు. ఒకవేళ బలమైన నాయకుడే అయితే కాంగ్రెస్‌ పార్టీలోకి వచ్చేవారు కాదు. నాగర్‌కర్నూల్‌లో మొదటినుంచి కాంగ్రెస్‌ కి అండగా ఉన్నది దామోదర్‌రెడ్డే అని, అలాంటి నాయకుడితో అధిష్టానం సంప్రదింపులు జరపకుండా నాగం ని పార్టీలోకి తీసుకోవడం సరైన పద్ధతి కాదని అన్నారు. ఇదంతా రాజకీయ కుట్రలో భాగంగానే జరిగిందని తెలిపారు. మనస్తాపంతో దామోదర్‌రెడ్డి పార్టీ మారుతున్నట్లు తెలిసింది.

జేజమ్మ‌కు షాక్ ..కాంగ్రెస్ లో చేర‌నున్న నాగం..?

Submitted by lakshman on Mon, 03/12/2018 - 18:40


  మాజీ ఎమ్మెల్యే నాగం జ‌నార్ధ‌న్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేర‌డం దాదాపు ఖ‌రారైన‌ట్లు తెలుస్తోంది. ఒకప్పుడు ఆయన సైకిల్ పార్టీలో కింగ్ లా ఉండేవారు. కానీ తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో అనుకోని ఘటనల తర్వాత నాగం జనార్దన్ రెడ్డి ఎవరితో కలవకుండా ఉండిపోయారు. కానీ అనుకోకుండా రాజకీయాలకు ఒడిదుడుకులు ఎదుర్కొని చివరకు క‌మ‌లం చెంత‌కు చేరారు.  అక్క‌డ ఇమ‌డ‌లేక కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు పావులు క‌దిపారు. 

గద్వాల జేజమ్మకు చెక్ పెట్టడానికి రాజకీయ వ్యూహాం

Submitted by arun on Sat, 02/24/2018 - 15:18

కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ గద్వాల జేజేమ్మ నాగం జాయినింగ్ ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు..? ఆయన పార్టీలోకి రావడం వల్ల వచ్చే నష్టమేంటి..? ఆమె స్థానానికి ప్రమాదముందని ఆందోళన చెందుతున్నారా..? డికే అరుణ కోపమంతా జైపాల్ రెడ్డి పైనా.. నాగంపైనా..? ప్రస్తుతం రాష్ట్ర కాంగ్రెస్ లో ఇదే చర్చ జరుగుతోంది. 

రేవంతా మ‌జాకా

Submitted by arun on Sat, 02/24/2018 - 11:02

ప్రధాన ప్రతిపక్షం తెలంగాణ కాంగ్రెస్ అధికార పార్టీని ఢికొట్టడానికి తన బలాన్ని పెంచుకోవడానికి ఆపరేషన్ ఆకర్ష్ ను ప్రోత్సహిస్తోంది. ఇందులో బాగంగానే ప్రజాబలం ఉన్న సీనియర్ నేతలకు పార్టీ కండువా కప్పి గాంధిభవన్ కు స్వాగతం పలుకుతున్నారు. రేవంత్ రెడ్డి టీమ్ కాంగ్రెస్ లో చేరిన నాటి నుంచి హస్తం పార్టీ వైపు చూసే వారి సంఖ్య పెరుగుతోంది. అయితే, ఇప్పుడు అదే సమస్యగా మారింది. 

జైపాల్‌రెడ్డి వర్సెస్ డీకే అరుణ

Submitted by arun on Fri, 02/23/2018 - 11:04

తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీలో మరో వివాదం రాజుకుంది. పాలమూరు జిల్లాలో నేతల ఆధిపత్య పోరు తీవ్రం కావడంతో మళ్లీ రచ్చకెక్కుతున్నారు. నాగం జనార్ధన్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరితే పార్టీకి నష్టం కలుగుతుందంటున్నారు. స్థానిక నేతల అభిప్రాయాలను తీసుకోకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని పీసీసీపై మండిపడుతున్నారు. 

టీ.పీసీసీలో కొత్త చేరికలపై నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాలమూరు జిల్లాలో గత నెల రోజుల నుంచి ఇదే వ్యవహారంపై నేతల మధ్య వివాదం ఏర్పడింది. బీజేపీ సీనియర్ నేత నాగం జనార్ధన్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరతారని ప్రచారం జరుగుతుండటంతో అడ్డుకునేందుకు సిద్ధమయ్యారు ఆ పార్టీ నేతలు.