koratala siva

ఇక క్లాప్ కొట్టడమే

Submitted by arun on Mon, 10/29/2018 - 14:41

‘సైరా నరసింహారెడ్డి’ సినిమా తర్వాత మెగస్టార్ చిరంజీవి చేయబోయ్యే సినిమా పై అప్పుడే మెగా అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో చర్చ మొదలైంది. ఠాగూర్, స్టాలిన్, శంకర్ దాదా, ఇంద్ర లాంటి కమర్సియల్ సందేశత్మాక చిత్రాల్లో నటించి మెగా అభిమానులనే కాదు టాలీవుడ్ బాక్సాఫీస్ ను షేక్ చేసారు చిరు. ఇప్పుడు మరో  సందేశత్మాక చిత్రాల్లో నటించబోతున్నారు.. దర్శకుడు కొరటాల శివ కూడా చిరంజీవి కోసం అటువంటి కథను సిద్ధం చేసారు. ‘మిర్చి’, ‘శ్రీమంతుడు’, ‘జనతా గ్యారేజ్‌’, ‘భరత్‌ అనే నేను’... కొరటాల దర్శకత్వం వహించిన చిత్రాలు నాలుగంటే నాలుగే. కానీ, ఇటు సందేశం, అటు కమర్షియల్ జోడించి ప్రేక్షకులు మెచ్చే విధంగా  తీసారు కొరటాల.

టాలీవుడ్‌ టాప్‌ సెలబ్రిటీలకు ఎన్టీఆర్‌ ఛాలెంజ్‌!

Submitted by arun on Fri, 06/01/2018 - 14:44

సోషల్ మీడియాలో ఇపుడు 'హమ్ ఫిట్ తో ఇండియా ఫిట్' ఛాలెంజ్ ట్రెండ్ వైరల్ అవుతోంది. సినీ సెలబ్రిటీలు, స్పోర్ట్స్ సెలబ్రిటీలు ఈ ఛాలెంజ్ స్వీకరిస్తూ ఇతరలకు ఛాలెంజ్ విసురుతుండటం అభిమానుల్లోనూ ఫిట్‌నెస్ మీద ఆసక్తి పెంచుతోంది. అలా సినీ నటుడు మోహన్ లాల్ నుండి ఫిట్‌నెస్ ఛాలెంజ్ స్వీకరించిన యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్...మహేష్ బాబు, రామ్ చరణ్, నందమూరి కళ్యాణ్‌ రామ్‌, రామ్‌ చరణ్‌, రాజమౌళి, కొరటాల శివకు ఈ ఛాలెంజ్ విసిరారు.
 

శ్రీరెడ్డి ఆరోపణలపై కొరటాల క్లారిటీ!

Submitted by arun on Wed, 04/18/2018 - 11:42

టాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్ పై నటి శ్రీరెడ్డి కొద్దిరోజులుగా సంచలన ఆరోపణలు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శ్రీరెడ్డి పలువురు సెలబ్రిటీల పేర్లను బయటపెట్టింది. వారిలో కొందరు ...శ్రీరెడ్డి వ్యాఖ్యలపై స్పందించగా...మరి కొందరు ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. ప్రముఖ దర్శకుడు కొరటాల శివపై కూడా శ్రీరెడ్డి ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ వ్యాఖ్యలపై కొరటాల శివ స్పందించారు. తనపై వచ్చిన ఆరోపణలను ఖండిస్తూ కొరటాల శివ ఓ వీడియోను విడుదల చేశారు. తనపై సోషల్ మీడియాలో ఏవో ఆరోపణలు వచ్చాయని అవన్నీ అవాస్తవాలని చెప్పారు.

భ‌ర‌త్ అనే నేను' ఫ‌స్ట్ సాంగ్ రిలీజ్

Submitted by arun on Sun, 03/25/2018 - 11:18

సూపర్ స్టార్  మహేష్ బాబు, కొరటాల శివ కాంబినేషన్ లో వస్తోన్న  భరత్ అనే నేను సినిమాలో తొలిపాట విడుదలైంది.  ఏప్రిల్ 20న విడుదలవుతున్న ఈ మూవీ  ప్రమోషన్ పై చిత్ర యూనిట్ ప్రత్యేక దృష్టి పెట్టింది. టైటిల్ తోనే ఫుల్ క్రేజ్ సంపాదించుకున్న ఫస్ట్ ఓథ్ పేరుతో ఓ వీడియో, టీజర్ ని విడుదల చేసి ప్రేకక్షల్ని ఆట్రాక్ట్ చేశారు. ఇఫ్పుడు  దేవి శ్రీ స‌మ‌కూర్చిన తొలి బాణీ విడుద‌లైంది. ఈ సాంగ్ మ‌హేష్ ఫ్యాన్స్‌ని అల‌రిస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న ఒక ఫిక్షనల్ పొలిటికల్ డ్రామాగా ‘భరత్ అనే నేను’ రూపొందుతుంది. ఇందులో మహేష్ స్టైలిష్ ముఖ్యమంత్రిగా కనిపిస్తున్నాడు. ప్రస్తుత విద్యా విధానం..

రాజ‌మౌళికి పోటీగా కొర‌టాల శివ‌

Submitted by arun on Thu, 01/11/2018 - 16:00

కొరటాల శివ కూడా త్రివిక్రమ్ లానే సింగిల్ ఎజెండాతో పనిచేస్తున్నాడు. కొడితే ఏనుగు కుంభస్థలమే కొట్టాలనుకునే ,తను, ఇప్పుడా పనిలోనే ఉన్నాడు రాజమౌలికే పోటీగా తయారయ్యేలా ఉన్నాడు. వందల కోట్ల వసూళ్ల కి కేరాఫ్ అడ్రస్ అయిన, తనకు, ఒకే ఒక మిషన్ తో ముందుకుపోతున్నాడు. కాకపోతే, అదే జరిగే పనేనా అనే అనుమానాలు పెరిగాయ్ ఓ స్థాయి మూవీల వరకు ఓకే కాని, రాజమౌళిలా నెక్ట్స్ లెవల్ కి వెళ్లే సత్తా ఉందా అనే ప్రశ్నలే వస్తున్నాయ్. 

మ‌హేష్‌, రాజ‌మౌళి సినిమా ఎప్పుడంటే..

Submitted by nanireddy on Sun, 09/24/2017 - 14:10

సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు, ద‌ర్శ‌క‌మౌళి రాజ‌మౌళి కాంబినేష‌న్‌లో ఓ సినిమా రూపొంద‌నున్న‌ట్లు గ‌తంలో వార్త‌లు వినిపించాయి. 'బాహుబ‌లి2' త‌రువాత ఈ సినిమా తెర‌కెక్క‌నుంద‌ని అప్ప‌ట్లో క‌థ‌నాలు కూడా వ‌చ్చాయి. అయితే ఇప్పుడు ఈ వార్త నిజ‌మ‌య్యే అవ‌కాశం క‌నిపిస్తోంది. 2018 చివ‌ర‌లో రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో చేసే చిత్రం ప్రారంభ‌మ‌వుతుంద‌ని తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పుకొచ్చాడు మ‌హేష్‌.

అసెంబ్లీ లో మ‌హేష్‌బాబు

Submitted by nanireddy on Sun, 09/17/2017 - 18:13

అసెంబ్లీలో మ‌హేష్‌బాబుకి ఏం ప‌నా? అనుకుంటున్నారా? అయితే ఇక్క‌డ అసెంబ్లీ అంటే నిజ‌మైన అసెంబ్లీ కాదులెండి. సెట్టింగ్ అన్న‌మాట‌. 'శ్రీ‌మంతుడు' వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ త‌రువాత కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో మ‌హేష్ న‌టిస్తున్న కొత్త చిత్రం  షూటింగ్.. ప్ర‌స్తుతం అన్న‌పూర్ణ స్టూడియోస్‌లో భారీగా నిర్మించిన అసెంబ్లీ సెట్‌లో జ‌రుగుతోంది. డి.వి.వి.దాన‌య్య ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో కైరా అద్వాని హీరోయిన్‌గా న‌టిస్తోంది.