T Congress Leaders

కారు దూకుడుకు బ్రేకులు వేసేందుకు కాంగ్రెస్ నేతల వ్యూహాలు

Submitted by arun on Fri, 09/07/2018 - 11:02

ముందస్తు అసెంబ్లీ రద్దు, అభ్యర్ధుల ఎంపికతో రయ్‌మని దూసుకెళుతున్న కారుకు బ్రేకులు వేసేందుకు కాంగ్రెస్ నేతలు వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. కేసీఆర్‌కు ధీటుగా తాము కూడా అభ్యర్ధుల జాబితా విడుదల చేస్తామన్న కాంగ్రెస్ అగ్ర నేతలు అసెంబ్లీ రద్దు, ముందస్తు ఎన్నికలపై దృష్టి సారించారు. సీనియర్ నేత జానారెడ్డి ఇంట్లో తాజా మాజీలు, ఎమ్మెల్సీలు, ఇతర సీనియర్‌లు కాసేపట్లో భేటి కానున్నారు. రాష్ట్రంలో సోనియా, రాహుల్ గాంధీ పర్యటనలు, టీఆర్ఎస్‌ను క్షేత్ర స్ధాయి నుంచి ఎదుర్కొనే వ్యూహాలపై చర్చించనున్నారు. ఇదే సమయంలో పీసీసీ కార్యవర్గం అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది.

టీ.కాంగ్రెస్‌కు భారీ షాకివ్వనున్న టీఆర్ఎస్‌...ఓ మాజీ డిప్యూటీ సీఎంతో పాటు పది మంది మాజీ ఎమ్మెల్యేలు

Submitted by arun on Sat, 06/23/2018 - 11:40

ఎన్నికల ఏడాది కారు స్పీడ్‌ పెంచింది. టీఆర్ఎస్‌లోకి వలస జోరు పెరిగింది. మొన్నటి వరకు తెలంగాణ టీడీపీని టార్గెట్‌ చేసిన టీఆర్ఎస్‌... ఈసారి కాంగ్రెస్‌ పార్టీ నేతలకు గాలం వేస్తోంది. కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఓ మాజీ డిప్యూటీ సీఎంతో పాటు పది మంది మాజీ ఎమ్మెల్యేలను త్వరలోనే కారెక్కేందుకు సిద్ధమవుతున్నారు. ఆపరేషన్‌ ఆకర్స్‌ మొదటి ఫేజ్‌లో ప్రధానంగా గ్రేటర్‌ హైదరాబాద్‌‌నే టీఆర్ఎస్‌ టార్గెట్‌ చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసిన దానం నాగేందర్‌తోపాటు మాజీ మంత్రి ముఖేష్‌ గౌడ్‌, ఆయన కుమారుడు కూడా త్వరలోనే టీఆర్ఎస్‌ తీర్థం పుచ్చుకోనున్నట్టు తెలుస్తోంది.

పాదయాత్రకు మహూర్తం ఖారారు చేసిన డీకే అరుణ

Submitted by arun on Sat, 04/14/2018 - 11:36

ఏపీలో కొనసాగుతున్న  పాదయాత్రల హాడావుడి తెలంగాణను తాకింది. కాంగ్రెస్ నేతలు పోటాపోటీగా పాదయాత్రలకు సిద్ధం అవుతున్నారు. అధిష్టానం అనుమతినివ్వక ముందే నడక మార్గానికి రూట్ మ్యాప్ ఖరారు చేసుకుంటున్నారు. ఇటీవల ముగ్గురు  నేతలకు అధిష్టానం అనుమతి ఇవ్వడంతో సీనియర్లు తాము కూడ పాదయాత్ర చేస్తామంటూ విజ్ణప్తులు చేస్తున్నారు. తాజాగా మాజీ మంత్రి డికే అరుణ పాదయాత్రకు ముహూర్తం సిద్ధం కావడం హాట్ టాపిక్ గా మారింది.   

జైపాల్‌రెడ్డి వర్సెస్ డీకే అరుణ

Submitted by arun on Fri, 02/23/2018 - 11:04

తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీలో మరో వివాదం రాజుకుంది. పాలమూరు జిల్లాలో నేతల ఆధిపత్య పోరు తీవ్రం కావడంతో మళ్లీ రచ్చకెక్కుతున్నారు. నాగం జనార్ధన్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరితే పార్టీకి నష్టం కలుగుతుందంటున్నారు. స్థానిక నేతల అభిప్రాయాలను తీసుకోకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని పీసీసీపై మండిపడుతున్నారు. 

టీ.పీసీసీలో కొత్త చేరికలపై నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాలమూరు జిల్లాలో గత నెల రోజుల నుంచి ఇదే వ్యవహారంపై నేతల మధ్య వివాదం ఏర్పడింది. బీజేపీ సీనియర్ నేత నాగం జనార్ధన్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరతారని ప్రచారం జరుగుతుండటంతో అడ్డుకునేందుకు సిద్ధమయ్యారు ఆ పార్టీ నేతలు.