rangareddy

అక్కినేని నాగార్జున వ్యవసాయ క్షేత్రంలో విషాదం

Submitted by arun on Mon, 06/25/2018 - 12:40

సినీ హీరో అక్కినేని నాగార్జున కు చెందిన వ్యవసాయ క్షేత్రంలో విషాదం చోటుచేసుకుంది. అక్కడ పనిచేసే ఇద్దరు దంపతులు కరెంట్ షాక్ కొట్టి మృత్యువాత పడ్డారు.  పూర్తి వివరాల్లోకి వెళితే.. తూర్పుగోదావరి జిల్లా బొబ్బిడవరం మండలం కొత్తలంకకు చెందిన వెంకటరాజు (36), దుర్గ (32) దంపతులు. వారు కేశంపేట మండలంలోని పాపిరెడ్డిగూడ శివారులో గల సినీహీరో నాగార్జునకు చెందిన వ్యవసాయం క్షేత్రంలో పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. రాత్రి ఇంట్లో కరెంట్ పోవడంతో పొలంలోనే ఉన్న ట్రాన్స్ ఫార్మర్ ను పరిశీలించడానికి వెంకటరాజు వెళ్లాడు. విద్యుత్ ప్రవహిస్తున్న తెగిపడిన వైర్ ను గమనించక దాన్ని తాకాడు.

పాఠశాల బస్సు కిందపడి చిన్నారి మృతి

Submitted by arun on Mon, 06/25/2018 - 12:01

రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం గోపిగడ్డలో విషాదం చోటు చేసుకుంది. స్కూల్ బస్సు కింద పడి రెండేళ్ల చిన్నారి అవ్య మృతి చెందింది. స్థానికంగా ఉంటున్న శంకర్‌రెడ్డికి ఐదేళ్ల కుమారుడు, రెండేళ్ల పాప ఉంది. శంకర్‌రెడ్డి బాబును స్కూల్‌కు పంపించే నిమిత్తం ఇంటి ముందు ఉన్న స్కూల్ బస్సు ఎక్కించాడు. అదే సమయంలో ఇంట్లో నుంచి తండ్రి వెనకాలే పరిగెత్తుకుంటూ రెండేళ్ల చిన్నారి రోడ్డుపై నిల్చుంది. అయితే చిన్నారిని గుర్తించని డ్రైవర్ బస్సును ముందుకు పోనిచ్చాడు. దీంతో చిన్నారిపై నుంచి బస్సు చక్రాలు వెళ్లడంతో పాప అక్కడికక్కడే మృతి చెందింది. 

బ్యాంకుల్ని దోచేస్తున్న దొంగ‌లు

Submitted by arun on Fri, 02/23/2018 - 10:56

విజయ్ మాల్యా, నీరవ్ మోడీ స్థాయిలో కాకపోయినా బ్యాంకులను ముంచడంలో రకరకాల పద్ధతులు అవలంభించేవారు దేశమంతా నిండిఉన్నారు. కాకుంటే దొరకనంతవరకు దొరలే. అలాంటి ఒక వ్యక్తి హెచ్.డి.ఎఫ్.సి, స్టేట్ బ్యాంక్ వంటి బ్యాంకులకే క్రెడిట్ కన్నంపెట్టి చివరికి పోలీసులకు దొరికిపోయాడు.

క్రెడిట్ కార్డు వాడుకొని డబ్బులు కట్టకపోవడం కామన్. కానీ క్రెడిట్ కార్డుల కోసమే లేని ఒక కంపెనీ సృష్టించి, అందులో 41 మంది పేరుతో ఒక్కడే క్రెడిట్ కార్డులు వాడుకొని కోటి రూపాయలకు పైగా బ్యాంకులకు కుచ్చుటోపీ పెట్టడం నయా దందా. పోలీసులకే ఒక కొత్త అనుభూతినిచ్చిన ఈ దోపిడీకి వేదిక భాగ్యనగరమే.