renudesai

పెళ్లి త‌ర్వాత కూడా ఆయనతో ట‌చ్‌లోనే ఉంటాను: రేణూ దేశాయ్‌

Submitted by arun on Thu, 06/28/2018 - 16:56

త‌న‌కు న‌చ్చిన వ్య‌క్తితో త్వ‌ర‌లోనే ఏడ‌డుగులు వేయ‌బోతున్న న‌టి రేణూదేశాయ్ తాజాగా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానుల‌తో ముచ్చ‌టించారు. అభిమానుల బెదిరింపులు, విమ‌ర్శ‌ల‌కు దూరంగా ఉండాల‌నే ఉద్దేశంతో ఇటీవ‌లె రేణు ట్విటర్ నుంచి నిష్క్ర‌మించిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇన్‌స్టాగ్రామ్ ద్వారా మాత్రం అభిమానుల‌తో ట‌చ్‌లో ఉంటున్నారు. తాజాగా లైవ్‌లోకి వ‌చ్చిన రేణు ప‌లు ఆస‌క్తిక‌ర అంశాల గురించి మాట్లాడారు. అయితే ఓ అభిమాని పెళ్లి తర్వాత కూడా మీరు పవన్ తో టచ్ లో ఉంటారా అని ప్రశ్నించాడు. దీనికి మరో మాట ఆలోచించకూడా తప్పక ఉంటానని చెప్పింది. ఆయన అకీరా, ఆద్య అనే ఇద్దరు పిల్లలకి తండ్రి.

రేణుకు ప‌వ‌న్ విషెస్‌పై బండ్ల గ‌ణేష్ ట్వీట్‌!

Submitted by arun on Tue, 06/26/2018 - 12:45

మరో వివాహానికి సిద్ధమైన తన మాజీ భార్యకు విషెస్ చెప్పిన పవన్ కల్యాణ్ పై పలువురు సెలబ్రిటీలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కాగా, రేణూ దేశాయ్ కి ఇటీవల నిశ్చితార్థం కాగా, తన ట్విట్టర్ ఖాతాలో పవన్ కల్యాణ్ అభినందనలు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ ట్వీట్‌పై ప‌వ‌న్ అభిమానులతోపాటు, ప‌వ‌న్‌ను ఎంత‌గానో అభిమానించే నిర్మాత బండ్ల గ‌ణేష్ కూడా స్పందించారు. ప‌వ‌న్ చేసిన ట్వీట్‌ను రీట్వీట్ చేసిన బండ్ల గ‌ణేష్‌.. `మా బాస్ అంటే ఇది` అంటూ ప్ర‌శంసించారు. ఇక ప‌వ‌న్ ట్వీట్ ప‌ట్ల ఆయ‌న అభిమానులు కూడా ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు.

ప‌వ‌న్ మూడు పెళ్లిళ్ల‌పై మాధ‌విల‌త సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Submitted by lakshman on Sat, 03/24/2018 - 20:25

హీరోయిన్ మాధ‌వి ల‌త జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్  మూడుపెళ్లిళ్ల గురించి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది.

అతడి జ్ఞాపకాలతో ముక్కలైన నా హృదయం

Submitted by lakshman on Fri, 02/23/2018 - 07:30

పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ తాజాగా పోస్టు చేసిన ఓ వీడియో సంచలన అయింది. ఈ వీడియోలో ఆమె మాట్లాడిన మాటలు ఒక కవితలాగా అనిపించాయి. అతడి జ్ఞాపకాలు, ముక్కలైన నా హృదయం లాంటి పదాలు వాడుతూ ఈ కవిత సాగింది. అయితే ఆమె చెప్పిన ఆ కవితలో చాలా అర్థాలు వెతుక్కుంటున్నారు అభిమానులు.