serena williams

సెరెనాకు భారీ జరిమాన

Submitted by arun on Mon, 09/10/2018 - 16:22

అమెరికన్ బ్లాక్ థండర్, 23 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ విజేత సెరెనా విలియమ్స్ మరోసారి అనుచితంగా ప్రవర్తించి 17వేల డాలర్లు జరిమానా చెల్లించాల్సి వచ్చింది. జపాన్ ప్లేయర్ నవోమీ ఒసాకాతో టైటిల్ కోసం పోరాడుతూ ఓటమి అంచుల్లో కూరుకుపోయిన సెరెనా తీవ్రనిరాశతో చైర్ అంపైర్ తో వాగ్వాదానికి దిగింది. రెండుసార్లు అధికారిక హెచ్చరికలు వచ్చినా క్రీడాస్ఫూర్తిని విస్మరించి అంపైర్ పై దూషణల వర్షం కురిపించింది. అదీ చాలదన్నట్లుగా టెన్నిస్ రాకెట్ ను నేలకోసి కొట్టి తన ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది.  టెన్నిస్ ఆటలో పురుషులకు ఓ న్యాయం, మహిళలకు ఓ న్యాయమా అంటూ మండిపడింది.

మాతృత్వం కోసం మృత్యువుతో పోరాడిన సెరెనా

Submitted by arun on Thu, 02/22/2018 - 15:14

మహిళా టెన్నిస్ ఆల్ టైమ్ గ్రేట్ స్టార్ అమెరికన్ బ్లాక్ థండర్ సెరెనా విలియమ్స్ మాతృత్వం కోసం గొప్ప పోరాటమే చేసింది. చివరకు ప్రాణాలను సైతం పణంగా పెట్టింది. తన పాప ఒలింపియా కోసం తాను మృత్యువుతో పోరాడాల్సి వచ్చిందని దాదాపుగా చనిపోయాననే అనుకొన్నానని వైద్యుల అంకితభావం, ప్రావీణ్యం కారణంగానే తాను బతికానని ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకొంది. ప్రసవసమయంలో తాను ఊపిరితిత్తుల్లో గడ్డలతో బాధపడ్డానని ఊపిరి అందక బీపీ విపరీతంగా పెరిగిపోయిందని వాపోయింది. అత్యవసరంగా సిజేరియన్ చేయటం ద్వారా తాను పాపకు జన్మనివ్వగలిగానని ఆరువారాలపాటు ఎలా బ్రతికానో  ఇప్పటికీ తనకు అంతు పట్టడం లేదని చెప్పింది.