gujarat

‘బాహుబలి’పై ఐఐఎం-ఎ విద్యార్థుల అధ్యయనం!

Submitted by arun on Mon, 01/29/2018 - 11:11

ఇండియన్‌ ఫిల్మ్‌ హిస్టరీలో చరిత్ర సృష్టించి రికార్డు కలెక్షన్లతో దుమ్మురేపిన  బ్లాక్‌బస్టర్‌ మూవీ ‘బాహుబలి’కి మరో అరుదైన గౌరవం దక్కింది. బాహుబలి సిరీస్‌లో వచ్చిన రెండు సినిమాలు అఖండ విజయం సాధించడంపై సునిశిత అధ్యయానికి ప్రతిష్టాత్మక అహ్మదాబాద్‌ ఐఐఎం సిద్ధమైంది. 

సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన రూపానీ

Submitted by arun on Tue, 12/26/2017 - 12:18

గుజరాత్‌ ముఖ్యమంత్రిగా విజయ్ రూపానీ ప్రమాణం చేసి బాధ్యతలు స్వీకరించారు. ప్రమాణస్వీకారోత్సవానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, సీనియర్‌ నేత అద్వానీ, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు యోగి ఆదిత్యనాథ్, దేవేంద్ర ఫడ్నవీస్‌, మనోహర్‌ పరీకర్, మనోహర్‌లాల్ ఖట్టర్, శర్బానంద్‌ సోనోవాల్, కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు హాజరయ్యారు. గుజరాత్‌ ముఖ్యమంత్రిగా రూపానీ బాధ్యతలు చేపట్టడం ఇది రెండోసారి.

గుజరాత్‌లో నైతిక విజయం మాదే: రాహుల్‌

Submitted by arun on Tue, 12/19/2017 - 14:53

గుజరాత్‌ ఎన్నికలపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పందించారు. గుజరాత్‌లో బీజేపీ గెలిచినా నైతికంగా తామే విజయం సాధించామని స్పష్టం చేశారు.  ‘గుజరాతీయులు నా పట్ల చాలా ప్రేమాభిమానాలు చూపించారు. భాజపా నేతలు గుజరాత్‌ మోడల్‌ అని ప్రచారం చేశారు. మూడు నెలల క్రితం గుజరాత్‌ వెళ్లినపుడు భాజపా ముందు కాంగ్రెస్‌ నిలబడలేదన్నారు. కానీ ఇప్పుడు భాజపాకు గట్టి పోటీ ఇవ్వగలిగాం. ఫలితాలు సంతృప్తికరంగా వచ్చాయి’. ఎన్నికల ప్రచారంలో కులాలు, మతాల గురించి మాట్లాడిన మోడీ అమిత్‌ షా కొడుకు జే షా గురించి ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు.

గుజరాత్ సీఎం రేసులో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ?

Submitted by arun on Tue, 12/19/2017 - 11:55

హోరా హోరీగా సాగిన గుజరాత్‌ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించి వరుసగా ఆరోసారి అధికారం దక్కించుకుంది. అయితే ఇప్పుడు సీఎం అభ్యర్థి విషయంలో బీజేపీ అధిష్టానం మళ్లీ ఆలోచనలో పడ్డట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం విజయ్ రూపానీ గుజరాత్ ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తుండగా.. అతడిని రెండోసారి కంటిన్యూ చేసేందుకు బీజేపీ పెద్దగా ఆసక్తిని చూపడం లేదట. అందుకే అతడి స్థానంలో మంచి జనాధరణ పొందిన నేతను ఎంపిక చేయాలని భావిస్తున్నారట. ఇందుకోసం కేంద్రమంత్రి స్మృతి ఇరానీ పేరును పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. 

గుజరాత్ ఫలితాలపై కమలనాథుల్లో కలవరం

Submitted by arun on Tue, 12/19/2017 - 11:17

గుజరాత్ ఫలితాలు బీజేపీలో కలవరాన్ని పెంచాయా? పైకి నవ్వుతూ, స్వీట్లు పంచుకుంటున్న కమలనాథులు లోలోన కుమిలిపోతున్నారా? సునాయాసంగా గెలవాల్సిన మోడీ సొంత రాష్ట్రంలో పేలవమైన ఫలితాలు రాబట్టడంపై కమలనాధులేమనుకుంటున్నారు?

ఆందోళన కలిగిస్తున్న సౌరాష్ట్ర ఫలితాలు

Submitted by arun on Mon, 12/18/2017 - 12:54

ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్ లో, తిరిగి అధికారాన్ని చేజిక్కించుకోవడంలో బీజేపీ విజయం సాధించినా, అయితే ఇంత ఆనందంలోనూ భాజపాకు కొన్ని జిల్లాల ఓటర్లు ఇచ్చిన తీర్పు షాక్‌కు గురిచేసింది. ఆరు జిల్లాల్లో కనీసం ఒక్క స్థానమైనా గెలవలేని స్థితిలోకి జారిపోవడం ఆ పార్టీ వర్గాల్లో ఆందోళన పెంచుతోంది. అమ్రేలీ, నర్మద, పోర్ బందర్, ఆనంద్, డాంగ్స్, తాపీ జిల్లాల్లో కనీసం ఒక్క స్థానంలోనైనా బీజేపీ అభ్యర్థులు విజయం సాధించే పరిస్థితి కనిపించడం లేదు. మరోవైపు ప్రతిపక్ష కాంగ్రెస్‌ నవ్‌సారి, అర్వలి జిల్లాల్లో ఖాతా తెరవలేదు. ఏడు జిల్లాల్లో భాజపా, కాంగ్రెస్‌ హోరాహోరీగా తలపడుతున్నాయి.

చరిత్రలో మోఢేరా మందిరం

Submitted by lakshman on Sun, 09/17/2017 - 18:12
స్కంద పురాణం మరియు బ్రహ్మపురాణాలన‌నుసరించి ప్రాచీనకాలంలో మోఢేరా చుట్టు ప్రక్కలనున్న ప్రాంతాలను 'ధర్మరన్య' అని పిలిచేవారు. శ్రీరామ చంద్రుడు రావణుడిని సంహరించిన తర్వాత తన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకునేందుకు, బ్రహ్మ హత్యాపాపంనుంచి బయట పడేందుకు...

ఆ పిల్ల‌లకు తల్లి పెట్టిన పేరు జీఎస్‌టీ!

Submitted by lakshman on Mon, 09/11/2017 - 18:55
జీఎస్‌టీ ఏంటి.. పిల్ల‌ల‌కు పేర్లు పెట్ట‌డం ఏంట‌ని జుట్టు పీక్కోకండి. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ చేసిన‌ జీఎస్‌టీ ప్ర‌క‌ట‌న ఆ త‌ల్లిలో స్పూర్తిని ర‌గిలించింది. దేశ ప్ర‌గ‌తి కోసం మోదీ చేసిన ఈ ప్ర‌క‌ట‌న‌పై...