Action Plan

ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టీ కాంగ్రెస్ స్కెచ్

Submitted by arun on Sun, 03/25/2018 - 13:35

తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ బహుముఖ వ్యూహాలు రచిస్తోంది. ఓ వైపు ప్రజాసమస్యలపై పోరాడుతూనే ఎన్నికల మేనిఫెస్టో తయారీలో పడినట్టు తెలుస్తోంది. అధికార TRS విస్మరించిన సంక్షేమ పథకాలను చేర్చి ప్రజలను ఆకట్టుకోవాలని భావిస్తోంది. ముఖ్యంగా పెన్షన్స్, హౌసింగ్  స్కీంల సాధ్యాసాధ్యాలు, అమలు రూట్ మ్యాప్ కోసం అడ్వైజరి కమిటీని నియమించింది.

ప్రత్యేక హోదా ఉద్యమంలో జనసేన మరో కార్యాచరణ

Submitted by arun on Thu, 02/22/2018 - 13:32

విభజన సమస్యలు, పరిష్కారాలపై జేఎఫ్ సీ పేరుతో రంగంలోకి దిగిన జనసేన ఈ అంశంలో యువతను ఉత్తేజపరచడానికి వినూత్న ప్రయత్నం చేస్తోంది. ప్రత్యేక హోదా, ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ముద్రించిన టీ షర్ట్స్ ను సిద్ధం చేస్తోంది. ఈ టీ షర్ట్స్, క్యాప్స్ ను రాష్ట్రంలోని పలు కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులకు అందజేయనుంది. అంతేకాకుండా.. భగత్ సింగ్  స్టూడెంట్స్ యూనియన్  ఆధ్వర్యంలో ప్రత్యేక ఉద్యమానికి ప్రణాళికలు కూడా రచిస్తోంది. ఇటు శతఘ్ని టీమ్ తో డిజిటల్ ఉద్యమానికి శ్రీకారం చుట్టింది.