Dubai

బైటపడిన దావూద్ ఫోన్ సంభాషణ

Submitted by arun on Tue, 04/10/2018 - 16:12

పాకిస్తాన్‌లో తలదాచుకుంటూ ప్రపంచవ్యాప్తంగా మోస్ట్‌వాంటెడ్‌ నేరగాడు దావూద్‌ ఇబ్రహీం నిర్వహిస్తున్న అక్రమ ఆర్ధిక వ్యవహారాలు మరోసారి బైటపడ్డాయి. పాకిస్తాన్ పాలకులు, అధికారుల రక్షణలో దావూద్ ఇబ్రహీం నిర్వహిస్తున్న వ్యాపారాలకు సంబంధించిన ఫోన్ సంభాషణ వ్యవహారం ఓ ఆంగ్ల చానెల్ బహిర్గతం చేసింది. 

దుబాయ్ హోట‌ల్లో శ్రీదేవి ఎందుకు మ‌ర‌ణించిందంటే

Submitted by lakshman on Mon, 03/12/2018 - 00:23

అతిలోక సుందరి శ్రీదేవి హఠాన్మరణానికి కారణం ఏంటి.? కనిపించడానికి అత్యంత అందంగా.. అత్యంత ఆరోగ్యంగా ఉన్న శ్రీదేవి ఎలా చనిపోయింది..? ఎందుకు చనిపోవాల్సి వచ్చింది..? ఇలాంటి ప్ర‌శ్న‌ల‌న్నీ ఆమె మ‌ర‌ణించిన త‌రువాత ఉత్ప‌న్న‌మ‌య్యాయి. అంతేకాదు ఆమె అందం కోసం తీసుకున్న అతి జాగ్ర‌త్త‌ల వ‌ల్ల ప్రాణాలు పోయాయ‌ని వార్త‌లు వ‌చ్చాయి. 

శ్రీదేవి మరణం వెనుక దావూద్..

Submitted by arun on Tue, 02/27/2018 - 14:48

శ్రీదేవి మరణంపై సంచలన ఆరోపణలు చేశారు బీజేపీ ఎంపీ సుబ్రమణ్య స్వామి. ఆమెది సహజ మరణం కాదని, హత్యేనని అనుమానాలు వ్యక్తం చేశారు. అంతేకాదు డెత్ మిస్టరీ వెనక మాఫియా డాన్‌ దావూద్ ఇబ్రహీం ఉండొచ్చన్నారు స్వామి. బాలీవుడ్‌ తారలతో దావూద్‌కు సంబంధాలున్నాయని గుర్తు చేసిన సుబ్రమణ్య స్వామి, ఈ కోణంలో తప్పకుండా విచారణ చేయాలని కోరారు.

దుబాయ్‌లో కేసుల ప్రాసిక్యూషన్‌ ఎలా ఉంటుందంటే

Submitted by arun on Tue, 02/27/2018 - 12:28

దుబాయ్‌లో కేసుల ప్రాసిక్యూషన్‌ ఎలా ఉంటుంది ? ఏదైనా కేసును పబ్లిక్‌ ప్రాసిక్యూషన్‌‌కు బదిలీ చేస్తే అక్కడ విచారణ ప్రత్యేకంగా ఉంటుందా ? శ్రీదేవి మృతితో అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయ్. పోలీసుల ఇన్వెస్టిగేషన్‌ పూర్తయినా పబ్లిక్‌ ప్రాసిక్యూటర్ల విచారణ విభిన్నంగా ఉంటుందా ?

శ్రీదేవి మ‌ర‌ణంలో కొత్త‌కోణం

Submitted by lakshman on Tue, 02/27/2018 - 07:49

శ్రీదేవి భౌతికకాయం ఈరోజు కూడా ఇండియాకు రావ‌డం క‌ష్ట‌మేన‌ని ప్రాసిక్యూష‌న్ చెబుతోంది. శ్రీదేవి మ‌ర‌ణంపై విచార‌ణ చేప‌ట్టిన ప్రాసిక్యూష‌న్ బోనీక‌పూర్ తో స‌హా ముగ్గురు వాంగ్మూలం తీసుకుంది. ఆ వాంగ్మూలలో బోనీ క‌పూర్, అత‌ని కుటుంబ‌స‌భ్యులు , హోట‌ల్ సిబ్బంది  చెప్పిన స‌మాధానాలకు పొంత‌న‌లేక‌పోవ‌డంతో కేసును లోతుగా విచారించాల‌ని స్ప‌ష్టం చేసింది. దీంతో బోనీ పాస్ పోర్టును , ఫోన్ కాల్ డేటా ను స్వాధీనం చేసుకున్న పోలీసులు ప‌లు అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు. శ్రీదేవి మ‌ర‌ణానికి ముందు ఆమె ఎవ‌రికో ఎక్కువ సార్లు ఫోన్ చేసిన‌ట్లు తేలింది.

శ్రీదేవి మృతిలో మిస్టరీ..బాత్‌టబ్‌లో పడిందా? తోసేశారా?

Submitted by arun on Mon, 02/26/2018 - 18:54

ప్రమాదవశాత్తు బాత్‌ టబ్‌లో మునిగి శ్రీదేవి చనిపోయిందని దుబాయ్‌ వైద్యులు ఫోరెన్సిక్‌ రిపోర్ట్‌ ఇచ్చారు. అయితే ఈ నివేదికపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాత్‌ టబ్‌లో శ్రీదేవి ప్రమాదవశాత్తు మునిగిపోయిందా...లేదంటే ఎవరైనా ముంచేశారా?

ప్రమాదవశాత్తూ బాత్‌టబ్‌లో పడి చనిపోయిందని రిపోర్ట్‌
ఫోరెన్సిక్‌ నివేదికపై అనేక అనుమానాలు
కేసును పునర్విచారణ చేస్తున్నట్టు ప్రకటించిన పోలీసులు
బోనీకపూర్‌ను మూడు గంటలపాటు ప్రశ్నించిన పోలీసులు
శ్రీదేవి, బోనీకపూర్‌ల కాల్‌ డేలా పరిశీలన
శ్రీదేవి మృతి కేసు పబ్లిక్‌ ప్రాసిక్యూషన్‌కు అప్పగింత

దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు శ్రీదేవి కేసు ట్రాన్స్‌ఫర్

Submitted by arun on Mon, 02/26/2018 - 18:21

అతిలోక సుందరి శ్రీదేవి ప్రమాదవశాత్తూ బాత్‌రూమ్‌లో చనిపోయిందనేది దుబాయ్‌ ఫోరెన్సిక్‌ రిపోర్ట్‌లో తేలింది. అయితే ఇప్పటి వరకూ తను ఏ కారణంతో మరణించిందన్న సందేహం అందరిలో వ్యక్తమయ్యింది. శ్రీ‌దేవి మృత‌దేహం రాక మ‌రింత జాప్యం జ‌రిగే అవ‌కాశం క‌నిపిస్తున్న‌ది. ఈ కేసును లోతుగా ద‌ర్యాప్తు చేయ‌నున్న‌ట్లు స‌మాచారం. పోస్టుమార్ట‌మ్ ఆల‌స్యం, ఫోరెన్సిక్ రిపోర్టుపై ప‌లు అనుమానాలు త‌లెత్తిన నేప‌థ్యంలో దుబాయ్ పోలీసులు ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. శ్రీదేవి మృతి కేసును దుబాయ్ పోలీసులు ఆ దేశ పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు ట్రాన్స్‌ఫర్ చేశారు. కాసేపటి క్రితమే శ్రీదేవికి నిర్వహించిన ఫోరెన్సిక్ రిపోర్ట్‌ను రిలీజ్ చేశారు.

హోటల్‌లో మరణించడంతోనే ప్రక్రియ ఆలస్యం

Submitted by arun on Mon, 02/26/2018 - 08:51

అందాలతార శ్రీదేవి పార్థివదేహం ఈరోజు మధ్యాహ్నంలోపు ముంబై చేరుకోనుంది. అయితే శ్రీదేవి భౌతికకాయాన్ని ముంబైలో తరలించడంలో తీవ్ర జాప్యం జరిగింది. దుబాయ్‌లో నిబంధనలు అత్యంత కఠినతరంగా ఉండటమే కారణంగా తెలుస్తోంది. శ్రీదేవి ఆస్పత్రిలో కాకుండా హోటల్‌లో మరణించడంతో శవపరీక్షలతోపాటు ఫోరెన్సిక్‌ టెస్టులు నిర్వహించి వైద్యుల రిపోర్ట్‌ వచ్చాకే మృతదేహాన్ని అప్పగించారు. దాంతో నిన్నే ముంబై చేరుకోవాల్సిన శ్రీదేవి భౌతికకాయం ఆలస్యంగా ఈరోజు మధ్యాహ్నంలోపు ముంబై చేరుకోనుంది.
  

అందాల తార శ్రీదేవి కన్నుమూత

Submitted by lakshman on Sun, 02/25/2018 - 08:12

ప్రేక్ష‌క లోకాన్ని విషాదంలో నీ నటి శ్రీదేవి దుర్మరణం భారతీయ ప్రేక్షకలోకాన్ని విషాదంలో నింపింది. ఆమె మరణ వార్త ప్రత్యేకించి దక్షిణాది వారిని దిగ్బ్రాంతికి గురి చేసింది. కేవలం 54 ఏళ్ల వయస్సులోనే ఆమె హఠాన్మరణం చెందడాన్ని ప్రేక్షకులు, అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. అసలు శ్రీదేవి ఇంత హఠాత్తుగా ఎలా చనిపోయారు.. ఇప్పుడీ ప్రశ్న అభిమానులను వేధిస్తోంది. కేవలం 54 ఏళ్లకే ఆమె గుండెపోటుకు గురికావడం ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. అందులోనూ ఆమె దేశం కాని దేశంలో కన్నుమూయడం కూడా అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. గతంలోనూ శ్రీదేవి ఎన్నడూ తీవ్ర అనారోగ్యానికి గురైన దాఖలాలు లేవు.

నీరవ్‌ మోడీ దుబాయ్‌లో ఉన్నట్టు గుర్తించిన అధికారులు

Submitted by arun on Tue, 02/20/2018 - 17:39

పంజాబ్ నేషనల్ బ్యాంకుని నిండా ముంచేసి విదేశాలకు చెక్కేసిన నీరవ్ మోడీ దుబాయ్‌లో ఉన్నట్టు దర్యాప్తు అధికారులు గుర్తించినట్టు సమాచారం. దీంతో ఇప్పుడు ఆయనను వెనక్కి తీసుకురావడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. అయితే, అదంత సులువైన పని కాదని నిపుణులు చెబుతున్నారు. దేశం విడిచి పారిపోయి విదేశాల్లో తలదాచుకుంటున్న నిందితులను వెనక్కి రప్పించేందుకు భారత ప్రభుత్వం మొత్తం 47 దేశాలతో ఒప్పందాలు చేసుకోగా, 9 దేశాలతో సర్దుబాట్లు చేసుకుంది. ప్రస్తుతం నీరవ్‌ మోడీకి చెందిన ఆస్తులు ఎక్కడెక్కడున్నాయో గుర్తించి, జప్తు చేసుకునే పనిలో ఉంది ఈడీ.