pawan kalyan press meet

జగ‌న్ నువ్వు భ‌య‌ప‌డితే నీకు నేను అండ‌గా ఉంటా

Submitted by lakshman on Tue, 02/20/2018 - 00:13

ముసుగులో గుద్దులాట లేదు. ఇక డైరెక్ట్ ఫైట్. వైసీపీ అధినేత జగన్ విసిరిన సవాలుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్  అన్నారు. పనిలోపనిగా తాను కూడా బహిరంగ సవాలు విసిరారు. ఇప్పటి వరకు నేరుగా వైసీపీ, జగన్ ని టార్గెట్ చేసి మాట్లాడని పవన్ కళ్యాణ్ సోమవారం రాత్రి మీడియా ముందుకు వచ్చారు. ప్రెస్ మీట్  పెట్టి మరీ జగన్ మీద మాట్లాడారు. ఇటీవల జేఎఫ్సీ సమావేశం సందర్భంగా కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టాలని టీడీపీ, వైసీపీలు పవన్ సూచించిన సంగతి తెలిసిందే.