gujarat

అట్టుడుకుతున్న గుజరాత్‌ ...అత్యాచారంపై గుజరాతీల్లో కట్టలు తెంచుకున్న ఆవేశం

Submitted by arun on Mon, 10/08/2018 - 11:15

గుజరాత్‌ అట్టుడుకుతోంది. ప్రాంతీయ వాదంతో కొందరు అల్లరిమూకలు రెచ్చిపోతున్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన వలస కుటుంబాలే లక్ష్యంగా దాడులకు తెగబడుతున్నారు. మైనర్ అమ్మాయిపై అత్యాచారం కేసులో ఓ బీహారీని అరెస్ట్ చేయడంతో పాటు సోషల్‌ మీడియాలో విద్వేశపూరితమైన పోస్టులతో ఆందోళనకారులు విరుచుకుపడుతున్నారు. దీంతో నాన్‌ గుజరాతీలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని సొంత రాష్ట్రాలకు పారిపోతున్నారు. 

యజమాని ప్రాణాలకు.. తన ప్రాణాలు అడ్డుపెట్టింది

Submitted by arun on Tue, 07/24/2018 - 13:38

లయన్స్‌తో  పోరాడి యజమాని ప్రాణాలు కాపాడింది ఓ  పెట్ డాగ్.  ఏకంగా సింహాలకే ఎదురు నిలిచి తన యజమానిని రక్షించింది. మృగరాజులను సైతం ముప్పతిప్పలు పెట్టింది.  అది ఎక్కడో కాదు గుజరాత్‌లోని అంబార్ది గ్రామంలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. విశ్వాసానికి మనిషి కన్నా జంతువే మిన్న అని నిరూపించిందని కుక్కను ప్రతి ఒక్కరూ  ప్రశంసిస్తున్నారు. 

సిటీ పోలీస్‌ సక్సెస్‌...చెడ్డిగ్యాంగ్ చిక్కింది

Submitted by arun on Thu, 07/19/2018 - 10:35

ఆరు రాష్ట్రాల పోలీసులకు ముచ్చెమటలు పట్టిస్తున్న చెడ్డీగ్యాంగ్ ఎట్టకేలకు చిక్కింది. ఈ ముఠాలో ముగ్గుర్ని రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి ద్వారా మిగిలిన వారి ఆచూకీ కనిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. రెండేళ్ల క్రితం ముంబై పోలీసులకు చిక్కిన ఈ చెడ్డీగ్యాంగ్ ఇప్పుడు రాచకొండ పోలీసులకు పట్టుబడటం సంచలనంగా మారింది.

భార్యకు గడ్డం పెరుగుతోందని విడాకులు కోరిన భర్త...

Submitted by arun on Tue, 06/19/2018 - 13:23

తన భార్యకు గడ్డం పెరుగుతోందని, గొంతు కూడా మగవారి మాదిరిగా ఉందని, పెళ్లి చూపుల్లో పరదా కట్టి కూర్చోబెట్టి చూడనివ్వలేదని ఆరోపిస్తూ, వివాహమైన తరువాత విడాకులకు దాఖలైన ఓ పిటిషన్ ను అహ్మదాబాద్ ఫ్యామిలీ కోర్టు తోసిపుచ్చింది. కోర్టు పిటిషన్‌లో ఉన్న వివరాల ప్రకారం అహ్మాదాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి పెళ్లికి ముందు తాను తన భార్య మొహాన్ని చూడలేదని కనీసం ఆమె గొంతు కూడా వినలేదన్నాడు. పెళ్లి చూపుల్లో తన భార్యను చూసినప్పుడు ఆమె మొహం మీద పరదా ధరించిందన్నాడు. పరదా తీయమని తన భార్యను కోరితే అది వారి సాంప్రదాయం అని కాబట్టి పరదాను తొలగించకూడదని తన భార్య బంధువులు చెప్పారన్నారు.

కలిసి బతకనివ్వట్లేదు.. ఇక వచ్చే జన్మలోనే...

Submitted by arun on Tue, 06/12/2018 - 14:45

సమాజం తమను దూరంగా పెడుతుందని.. వెలేస్తుందనే భావనతో ఓ లెస్బియన్ జంట ఆత్మహత్య చేసుకుంది. ఓ మూడేళ్ల పాపతో పాటు వారిద్దరూ సబర్మతి నదిలో దూకి సూసైడ్ చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం..అహ్మదాబాద్‌.. బావ్లా పట్టణానికి చెందిన ఆశా(30) తన ఇద్దరు పిల్లలతో, అదే ప్రాంతంలో భావన(28) అనే మరో మహిళ తన ఇద్దరు కుమారులతో నివసిస్తున్నారు. భర్తలు దూరం కావటంతో ఓ ఫ్యాక్టరీలో పని చేస్తూ వీరిద్దరూ జీవనం కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య బంధం బలపడింది. గత ఏడు నెలలుగా ఒకే ఇంట్లో కలిసి ఉంటున్న వీరిద్దరూ... త్వరలో వివాహం చేసుకునేందుకు సిద్ధపడ్డారు. అయితే కుల పెద్దలు మాత్రం వీరి సంబంధాన్ని వ్యతిరేకించారు.

పొలాల్లో కూలిపోయిన ఐఏఎఫ్ విమానం... పైలట్ దుర్మరణం...

Submitted by arun on Tue, 06/05/2018 - 13:08

ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కి చెందిన ఫైటర్ జెట్ గుజరాత్‌లో ముంద్రా ప్రాంతంలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో పైలట్ సంజయ్ చౌహాన్ మృతి చెందారు.  ఫైటర్ జెట్ కూలిన ప్రాంతంలో  పొలాల్లో మేత మేస్తున్న ఆవులు కూడా చనిపోయాయి.  ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. అధికారులు ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. 
 

గబ్బిలాల బామ్మ...400 గబ్బిలాలను ఇంట్లో పెంచుకుంటున్న శాంతాబెన్

Submitted by arun on Sat, 05/26/2018 - 11:54

నిఫా వైరస్.. యావత్ దేశాన్ని వణికిస్తుంది. ఎటువైపు నుంచి దాడి చేస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. ప్రాణాలు తీస్తున్న నిఫా వైరస్ అంటేనే భయపడుతున్న వేళ.. గుజరాత్‌లో ఓ మహిళ ఏకంగా 400 గబ్బిలాలను పెంచుకుంటోంది. వినడానికి ఆశ్చర్యంగా అనిపిస్తున్నా.. గుజరాత్‌ గబ్బిలాల బామ్మ గురించి హెచ్ ఎం టీవీ ప్రత్యేక కథనం.. 

Image result for gujarat bat colony

దారుణం : అఫైర్ లేదని మరిగే నూనెలో చేతులు పెట్టి నిరూపించుకోమంది..

Submitted by arun on Fri, 05/25/2018 - 17:48

భర్త మీద అనుమానంతో ఓ మహిళ దారుణానికి పాల్పడింది. పక్కింటి అమ్మాయితో తన భర్త వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే అనుమానంతో ఓ మహిళ మరిగే నూనెలో వారిద్దరి చేతులు పెట్టించింది. ఈ భయానకమైన ఘటన గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రాహుల్‌ పర్మార్‌, సుమన అనే దంపతులు రాజ్‌కోట్‌లోని భగవతిపారా ప్రాంతంలో నివశిస్తున్నారు. అయితే సుమనకు తమ పక్కిట్లో ఉండే ఓ యువతి(17)తో రాహుల్‌ వివాహేతర సంబంధం నడుపుతున్నారనే అనుమానం వచ్చింది. దీంతో వారిద్దరి మధ్య అటువంటి సంబంధం ఏమీ లేదని నిరూపించుకోవడానికి బాగా మరుగుతున్న నూనెలో చేతులు పెట్టాలని కోరింది.

హైదరాబాద్‌లో భారీ హవాలా రాకెట్‌ గుట్టు రట్టు

Submitted by arun on Mon, 02/12/2018 - 11:57

హైదరాబాద్‌లో మరోసారి భారీ హవాలా రాకెట్‌ గుట్టు రట్టయ్యింది. బడా వ్యాపారులకు.. హవాలా రూపంలో డబ్బు సమకూరుస్తున్న హవాలా వ్యాపారి పటేల్‌ నుంచి పోలీసులు కోటి 40 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఈ వాహలా రాకెట్‌కు సంబంధించి అబిడ్స్‌, బంజారాహిల్స్‌ ప్రాంతాల్లో ఐటీ అధికారుల సాయంతో పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. గుజరాత్‌కు చెందిన పటేల్‌ తన వాహలా రాకెట్‌ ద్వారా బడా వ్యాపారులకు పెద్దమొత్తంలో డబ్బు సమకూరుస్తున్నట్టు పోలీసులు భావిస్తున్నారు. అతన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ హవాలా బిజినెస్ వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారన్న విషయాలను బయటకు లాగుతున్నారు.

‘బాహుబలి’పై ఐఐఎం-ఎ విద్యార్థుల అధ్యయనం!

Submitted by arun on Mon, 01/29/2018 - 11:11

ఇండియన్‌ ఫిల్మ్‌ హిస్టరీలో చరిత్ర సృష్టించి రికార్డు కలెక్షన్లతో దుమ్మురేపిన  బ్లాక్‌బస్టర్‌ మూవీ ‘బాహుబలి’కి మరో అరుదైన గౌరవం దక్కింది. బాహుబలి సిరీస్‌లో వచ్చిన రెండు సినిమాలు అఖండ విజయం సాధించడంపై సునిశిత అధ్యయానికి ప్రతిష్టాత్మక అహ్మదాబాద్‌ ఐఐఎం సిద్ధమైంది.