AP special status fight

అవిశ్వాసం; మళ్లీ అడ్డుపడ్డ అన్నాడీఎంకే.. వాయిదా

Submitted by arun on Tue, 03/27/2018 - 13:44

అవిశ్వాస తీర్మానం ఏడో రోజూ లోక్‌సభలో చర్చకు నోచుకోలేదు. ఆరు రోజులుగా జరుగుతున్న తతంగమే ఇవాళ కూడా సాగింది. తొలుత అన్నాడీఎంకే సభ్యుల ఆందోళనల కారణంగా సభ గంట పాటు వాయిదా పడింది. సభ మళ్ళీ సమావేశమైన తర్వాత కూడా సేమ్ సీన్ రిపీటైంది. కావేరి నదీజలాల బోర్డు ఏర్పాటు చేయాలంటూ అన్నాడిఎంకే ఎంపీలు ఆందోళనకు దిగడంతో సభలో తీవ్ర గందరగోళం ఏర్పడింది. 

ఆ మరుక్షణమే రాజీనామాలు: వైఎస్సార్‌సీపీ ఎంపీలు

Submitted by arun on Mon, 03/26/2018 - 13:33

పార్టీ ఎంపీలతో వైసీపీ అధినేత జగన్ సమావేశం అయ్యారు. పార్లమెంటులో వ్యవహరించాల్సిన తీరుపై చర్చించారు. సమావేశం అనంతరం మాట్లాడిన ఎంపీలు.. రాజీనామాల విషయంలో తగ్గేది లేదని అన్నారు. పార్లమెంట్ నిరవధిక వాయిదా పడిన రోజే స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా చేస్తామన్నారు. బీజేపీతో కలిసి వెళ్లే ప్రసక్తే లేదని మేకపాటి తేల్చిచెప్పారు. టీడీపీ ఎంపీలు కూడా తమతో కలిసి రావాలన్నారు. 
 

ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తాం: బీజేపీ

Submitted by arun on Sat, 03/24/2018 - 12:54

తెలుగుదేశం పార్టీపై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం ఉదయం మీడియాతో మాట్లాడిన ఆయన.. ఏపీకి తప్పకుండా ప్రత్యేక హోదా ఇస్తామని అందుకు కొన్ని కండిషన్స్ ఉన్నాయని ఆయన చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో అవినీతికి పట్టిసీమ పరాకాష్ట అని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ అవినీతిని తవ్వడానికి పలుగు సరిపోదని.. ఏకంగా బుల్డోజరే కావాలని వ్యాఖ్యానించారు. పట్టిసీమలో ఒక లారీ మట్టి తీయడానికి రూ. 4 లక్షల ఖర్చా అంటూ ఆయన ఆశ్చర్యపోయారు. పట్టిసీమ ప్రాజెక్టులో తీయడానికి కేంద్రం రూ. 67 కోట్లు ఇచ్చిందన్నారు. రూ. 1120 కోట్లతో మొదలైన పట్టిసీమ రూ.

ఉధృతమవుతున్న ప్రత్యేక హోదా పోరు

Submitted by arun on Thu, 03/22/2018 - 10:23

ప్రత్యేక హోదా పోరు ఉద్యమ పంథాలోకి మారుతోంది. ప్రజలను భాగస్వాములను చేసేందుకు పార్టీలు సిద్ధమయ్యాయి. అందులో భాగంగా ఇవాళ.. జాతీయ రహదారుల దిగ్భంధించాలని నిర్ణయించారు. విపక్షాలన్నీ కలిసి.. ఈ ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు రాష్ట్రంలోని జాతీయ రహదారులన్నింటినీ దిగ్బంధించాలని అన్ని రాజకీయపక్షాలు నిర్ణయం తీసుకున్నాయి. ముఖ్యంగా పదో తరగతి విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా రెండు గంటల లోపు నిరసనను ముగించాలని నిర్ణయం తీసుకున్నాయి. వైసీపీ, జనసేన, కాంగ్రెస్, వామపక్షాలు నిరసనలో పాల్గొననుండగా శాంతియుత నిరసనకు అధికార టీడీపీ కూడా జై కొట్టింది. నిరసనకు నైతిక మద్దతు తప్పకుండా ఉంటుందని ప్రకటించింది. 

బాబుకు పోసాని ఛాలెంజ్!

Submitted by arun on Wed, 03/21/2018 - 12:26

ప్రత్యేక హోదాపై స్పందించకుండా తెలుగు చిత్ర పరిశ్రమ పెద్దలు ఏసీ రూముల్లో కులుకుతున్నారంటూ టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ చేసిన వ్యాఖ్యలపై తెలుగు చిత్ర పరిశ్రమ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సినీ పరిశ్రమను అగౌరవపరిచేలా ఆయన మాట తీరు బాగోలేదని.. వెంటనే బహిరంగంగా క్షమాపణ చెప్పాలంటున్నారు చిత్ర ప్రముఖులు. తెలుగు రాష్ట్రాలకు ఏ సమస్య వచ్చినా చిత్ర పరిశ్రమ సాయానికి ముందు నిలిచిందని.. అలాంటిది కొందరు రాజకీయ నాయకులు పరిశ్రమను టార్గెట్ చేయడం మంచిది కాదన్నారు నిర్మాత తుమ్మలపల్లి రామ సత్యనారాయణ. ప్రత్యేక హోదాపై ఇప్పటికే కొందరు పోరాడుతున్నారని.. ఇప్పుడు కూడా అందరం కలిసికట్టుగా ముందుకెళ్తామని చెప్పారు.

లోక్‌సభలో మళ్లీ అదే సీన్‌.. నిమిషం లోపే వాయిదా

Submitted by arun on Wed, 03/21/2018 - 11:52

లోక్‌‌సభ ప్రారంభమైన సరిగ్గా 30 సెకన్లకే లోక్‌సభ వాయిదా పడింది. లోక్‌సభలో నాల్గోసారి అవిశ్వాసంపై టీడీపీ, వైసీపీ నోటీసులిచ్చింది. సభ సజావుగా లేదంటూ ఇప్పటికే 3సార్లు అవిశ్వాసంపై స్పీకర్ చర్చ చేపట్లేదు. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన ఏపీ ఎంపీలు ఆందోళనకు దిగారు. ఇదిలా ఉంటే ఇవాళ టీఆర్ఎస్, అన్నాడీఎంకే ఎంపీల ఆందోళనలు కొనసాగించారు. పదే పదే సభ్యులకు స్పీకర్ చెప్పినప్పటికీ వారు మాత్రం మరింత ఆందోళన ఉదృతం చేయడంతో చేసేదేమీలేక సుమిత్రా మహాజన్ మధ్యాహ్నం 12గంటలకు సభ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

‘అవిశ్వాసం’పై టీఆర్ఎస్ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

Submitted by arun on Tue, 03/20/2018 - 12:15

అవిశ్వాస తీర్మానంపై టీఆర్ఎస్ పార్టీకి చెందిన భువనగిరి పార్లమెంటు సభ్యుడు బూర నర్సయ్యగౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ ఆవరణలో మీడియాతో మాట్లాడిన ఆయన, గత నాలుగేళ్లుగా కాపురం చేసిన పార్టీపై ఇప్పుడు అవిశ్వాసం పెడితే తామెందుకు సహకరించాలని ప్రశ్నించారు. తమ పార్టీ అధినేతతో సంప్రదింపులు జరిపి వారేమైనా అవిశ్వాసాన్ని పెట్టారా? అని ప్రశ్నించారు. అవిశ్వాస తీర్మానం పిల్లలాట కాదన్నారు. పక్కింట్లో పెళ్లి అయితే మా ఇంట్లో రంగులు వేసుకోవాల్సిన అవసరంలేదు... అని నర్సయ్య గౌడ్ పేర్కొన్నారు.

ఆగని ఆందోళనలు.. లోక్‌సభ వాయిదా

Submitted by arun on Tue, 03/20/2018 - 11:43

సేమ్ సీన్. నిన్నటికి ఇవాల్టికి తేడా ఏమీ లేదు. లోక్‌సభలో పరిస్థితి ఏమాత్రం మారలేదు. సభ ప్రారంభం కావడం అవి‌శ్వాస తీర్మానంపై చర్చ చేపట్టాలని టీడీపీ, వైసీపీ పట్టు పట్టడం పోడియంలో అన్నాడీఎంకే, టీఆర్ఎస్ ఎంపీలు ఆందోళనకు దిగడం సభ గంట పాటు వాయిదా పడడం ఇవాళ కూడా యాధావిధిగా జరిగిపోయింది.

లోక్‌‌సభలో మండే టెన్షన్..కాకపుట్టిస్తున్న అవిశ్వాస అస్త్రం

Submitted by arun on Sat, 03/17/2018 - 15:40

కేంద్రంపై ఏపీలోని అధికార , టీడీపీ, విపక్ష వైసీపీ సంధించిన అవి‌‌శ్వాస అస్త్రం దేశ రాజకీయాల్లో సెగలు రేపుతోంది. సోమవారం మరోసారి లోక్‌సభ ముందుకు అవి‌శ్వాస తీర్మానం రానుండడంతో కాకపుట్టిస్తోంది. దీంతో సోమవారం సభలో ఏం జరుగుతుందనే టెన్షన్ మొదలైంది. అవిశ్వాసాన్ని స్పీకర్ పరిగణనలోకి తీసుకుంటారా..? ఆ రోజైనా సభ ఆర్డర్‌లో ఉంటుందా..? అదే రోజు ప్రత్యేక హోదా, విభజన హామీలపై చర్చ జరుగుతుందా..? మోడీ సర్కారుపై పెట్టిన అవిశ్వాసంపై ఓటింగ్ జరుగుతుందా..? అవిశ్వాసానికి కలిసొచ్చే కొత్త పార్టీలు ఏవనే చర్చ వాడివేడిగా జరుగుతోంది. 

చంద్రబాబు నేరగాడే అయినా.. రాష్ట్రం కోసం సహకరిస్తాం

Submitted by arun on Fri, 03/16/2018 - 16:28

రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏ పార్టీతో అయినా కలిసి పోరాడుతామన్నారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. హోదా అంశంపై ఎవరు అవిశ్వాసం పెట్టినా మద్దతిస్తామని, రేపటి టీడీపీ తీర్మానానికి కూడా అనుకూలంగా ఓటేస్తామని ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. వైసీపీ అవిశ్వాస తీర్మానం చర్చకు వచ్చేదాకా ఎన్డీఏలో కొనసాగిన చంద్రబాబు.. చివరికి బయటికొచ్చి, అవిశ్వాసం పెడతాననడం సంతోషమన్నారు. ఏపీకి మేలు జరిగే ఏ తీర్మానానికైనా మద్దతిస్తామని వివరించారు.