TPCC

జిల్లా అధ్యక్షులను నియమించిన రాహుల్ గాంధీ

Submitted by arun on Sat, 05/26/2018 - 11:36

తెలంగాణ జిల్లా స్థాయి పద‌వుల భ‌ర్తీకి కాంగ్రెస్ పార్టీ శ్రీ‌కారం చుట్టింది. కొత్త జిల్లాల ప్రాతిప‌దిక‌న కాకుండా పాత ప‌ది జిల్లాల‌ ప్రకారమే హైక‌మాండ్ డీసీసీ అధ్యక్షుల్ని నియమించింది. దాదాపు అంతా పాత వాళ్ళేకే అవ‌కాశం క‌ల్పించ‌గా..హైద‌రాబాద్‌ అధ్యక్షుడిగా దానంను త‌ప్పించి అంజ‌న్ కుమార్ యాద‌వ్‌కు ప‌ద‌విని క‌ట్ట‌బెట్టారు.

Tags

వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న పీసీసీ చీఫ్

Submitted by arun on Thu, 04/26/2018 - 11:35

తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ తాను అనుకున్న దారిలో దూసుకుపోతున్నారు. పార్టీలో వివాదాలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకొంటూనే తన పీఠాన్ని కాపాడుకుంటున్నారు. పాదయాత్రలు చేయాలనుకున్న నేతలకు AICC అధ్యక్షుడు రాహుల్ గాంధీతోనే నో చెప్పించడం సీనియర్లు తనపై ఫిర్యాదు చేసే అవకాశం ఇవ్వకుండా వంటి ఎత్తుగడలు వేస్తున్నారు.

టీపీసీసీ తీరుపై కాంగ్రెస్ సీనియర్లు గుస్సా

Submitted by arun on Wed, 04/04/2018 - 11:39

టీపీసీసీ పని తీరుపై కాంగ్రెస్ సీనియర్ నేతలు ఆగ్రహంగా ఉన్నారు. ప్రభుత్వంపై దాడికి అందివచ్చిన అవకాశాలను పార్టీ సరిగా ఉపయోగించుకోవడం లేదని మండిపడుతున్నారు. అంశాలపై సీరియస్‌గా పోరాడాల్సిన సమయంలో బస్సు యాత్రలు చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. వెంటనే పార్టీ సీనియర్లతో సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

పీసీసీపై యుద్ధానికి సిద్ధమవుతున్న కోమటిరెడ్డి, సంపత్

Submitted by arun on Tue, 03/27/2018 - 12:11

ఆ ఇద్దరు ఏకాకులయ్యారా..? పట్టించుకునే వారు లేక ఒంటరిగా మిగిలారా..? తోడుంటారని అనుకున్న వారంతా.. చేయిచ్చారా..? ఆపదలో ఆపన్న హస్తం ఇవ్వాల్సిన పార్టీ.. పట్టించుకోవడం లేదా..? శాసనసభ్యత్వం రద్దైన తర్వాత కోమటిరెడ్డి, సంపత్ లు ఎందుకు సైలెంట్ అయిపోయారు..? సమస్య తమది కానట్లు.. పార్టీ పెద్దలు వ్యవహరించడంపై వారి వ్యూహం ఏంటి..? 

తెలంగాణ కాంగ్రెస్ దూకుడు పెంచింది

Submitted by arun on Fri, 03/02/2018 - 15:27

కాంగ్రెస్ లో పునరుత్తేజం కనిపిస్తోందా? అందరూ కలిస్తే తప్ప అధికార పార్టీని ఎదుర్కోలేమన్న మానసిక స్థితి నుంచి ఒంటరిగానైనా ఎదిరిస్తామని చెప్పగలిగిన స్థితి ఎక్కడ నుంచి వచ్చింది? టీ-కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అందుకోసం అనుసరిస్తున్న విధానాలేంటి? తాను సక్సెస్ ఫుల్ నేతగా అనిపించుకునేందుకు ఆయన ఏం చేస్తున్నారు? 

టీ-కాంగ్రెస్ కు సోషల్ మీడియాతో తలనొప్పులు..60 సీట్లకు పోటీ పడుతున్న నేతలతో లిస్టు

Submitted by arun on Sun, 02/18/2018 - 10:43

ఇక వరుసగా ప్రభుత్వం మీద ఎదురుదాడి చేస్తూ మాంచి జోష్ మీదున్న ప్రధాన ప్రతిపక్షానికి సోషల్ మీడియా కొత్త తలనొప్పులు తెచ్చి పెడుతోంది. వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ అభ్యర్థుల జాబితా ఇదేనంటూ పెట్టిన పోస్టింగ్ సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. ఆ లిస్టుతో టీ-పీసీసీ అనేక ఇబ్బందులు పడింది. ముందుగా అధికార పార్టీనే ఈ కుట్రకు తెరలేపిందని అనుమానించినా పార్టీలో ఓ వర్గమే కావాలని ఆ లిస్టు విడుదల చేసిందన్న వాదన దుమారం రేపుతోంది.