Banjara Hills

భార్యను రెడ్‌హ్యాండెడ్‌గాపట్టుకున్న భర్త...కేసు నమోదు

Submitted by arun on Mon, 03/26/2018 - 12:36

ప్రేమించుకున్నారు.. పెద్దలను ఎదిరించి మరీ పెళ్లి చేసుకున్నారు.. హైదరాబాద్‌లో కాపురం పెట్టారు. వీరి దాంపత్య జీవితానికి ముగ్గురు పిల్లలు. యూసుఫ్‌గూడ సమీపంలోని జవహర్‌నగర్‌లో ఈ కుటుంబం నివాసం ఉంటోంది. భర్త డ్రైవర్ పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుండే వాడు. భార్య ఇంటి వద్దే ఉండి పిల్లల బాగోగులు చూసుకునేది. అయితే యువతికి ఇంటి పక్కనే ఉన్న భీమయ్య అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త అక్రమ సంబంధానికి దారి తీసింది. ఈ విషయం తెలుసుకున్న భర్త పలుమార్లు హెచ్చరించాడు. అయితే భర్త మాటలను భార్య లెక్కచేయనేలేదు.. నేను చేసేది.. చేసేదే అన్నట్లుగా ఆమె విర్రవీగి ప్రవర్తించింది.

డ్రంకెన్ డ్రైవ్ లో రెచ్చిపోయిన హిజ్రా

Submitted by arun on Sun, 02/18/2018 - 09:47

హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ లో నిర్వహించిన డ్రంకన్ డ్రైవ్ లో ఓ హిజ్రా హల్ చల్ చేశారు. మద్యం తాగి వాహనం నడుపుతున్న హిజ్రాను పోలీసులు అడ్డుకున్నారు. ఆగ్రహించిన హిజ్రా...పోలీసులు, మీడియాపై దాడి చేశారు. హిజ్రాతో పాటు 102 మంది మందు బాబులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 39 కార్లు, 78 బైక్ లు, 2 ఆటోలు సీజ్ చేశారు.