Minister Harish Rao

మహాకూటమి టార్గెట్‌గా హరీష్‌రావు విమర్శలు

Submitted by arun on Sat, 11/17/2018 - 16:14

మహాకూటమి టార్గెట్‌గా మంత్రి హరీష్‌రావు విమర్శలు గుప్పించారు. ప్రజలకు ఏ ఒక్క మేలు చేయని కాంగ్రెస్‌, టీడీపీలు ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతారుంటూ ఆయన ప్రశ్నించారు. యాసంగిలో ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోకుండా ఒక్క సారైనా నీరందించారా  అంటూ నిలదీశారు. తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో ఏర్పడిన టీఆర్ఎస్ హాయంలో 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్నామన్నారు. సాగు నీటి ప్రాజెక్టులను అడ్డుకున్న చంద్రబాబు  ఏ అంశంతో ప్రచారం నిర్వహిస్తారో చెప్పాలన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సంక్షోభాలే తప్ప సంక్షేమం ఉండదంటూ హరీష్‌రావు ఎద్దేవా చేశారు. 

కూటమి అధికారంలోకి వస్తే… రాష్ట్రంలో సంక్షోభం తప్పదు

Submitted by arun on Sat, 11/10/2018 - 17:50

తెలంగాణ రాష్ట్రంలో మహాకూటమి అధికారంలోకి వస్తే సంక్షోభమేనని మంత్రి హరీశ్ రావు అన్నారు. ఇబ్రహీంపట్నంలో రైతు సమ్మేళన సభలో పాల్గొన్న ఆయన చంద్రబాబుతో క్షమాపణ చెప్పించాకే మహాకూటమి నేతలు ప్రజల వద్దకు వెళ్లి ఓట్లడగాలన్నారు. సంక్షేమమే ధ్యేయంగా టీఆర్ఎస్ పనిచేస్తోందన్నారు. డిసెంబర్ 11 తర్వాత తెలంగాణలో తెలుగుదేశం ఉండదు. తెలంగాణ ద్రోహితో జతకట్టిన కాంగ్రెస్‌కు గుణపాఠం తప్పదు. ఉద్యమించే వాడినే తెలంగాణ కోరుకుంటుంది. గులాంగిరి చేసేవారికి తెలంగాణ సమాజం ఎన్నడూ అండగా ఉండదు. సంక్షేమం కావాలంటే టీఆర్‌ఎస్‌కు ఓటేయండి అని హరీశ్‌రావు పిలుపునిచ్చారు.

ముందస్తు ఎన్నికలు....ప్రకటించిన మంత్రి హరీష్‌రావు

Submitted by arun on Wed, 09/05/2018 - 13:50

అసెంబ్లీ రద్దు ముహూర్తం ఖాయమంటూ ఊహగానాలు జోరుగా వినిపిస్తున్న సమయంలో ముందస్తు ఎన్నికలు ఖాయమంటూ మంత్రి హరీష్‌ రావు పరోక్షంగా ప్రకటించారు. ఎల్లుండి హుస్నాబాద్ నిర్వహిస్తున్న బహిరంగ సభను సీఎం కేసీఆర్ సెంటి మెంట్‌తోనే చేపట్టారన్నారు. గతంలో కూడా ఇక్కడి నుంచే ప్రచారం చేపట్టి విజయం సాధించామన్న ఆయన ఎన్నికల్లో వంద నియోజకవర్గాల్లో తామే విజయం సాధిస్తామన్నారు. తెలంగాణ ప్రజలు నూటికి నూరు శాతం టీఆర్ఎస్‌ ఆశీర్వదిస్తారని ఆ‍యన అన్నారు. హుస్నాబాద్‌లో బహిరంగ సభ కోసం జరుగుతున్న ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. 

దళితులపై దాడులు బాధాకరం : హరీష్‌రావు

Submitted by arun on Tue, 04/03/2018 - 16:45

భారత్ బంద్‌ సందర్భంగా జరిగిన హింసాత్మక ఘటనల్లో...9మంది మృతి చెందడం బాధాకరమన్నారు మంత్రి హరీశ్‌రావు. దళితులకు బ్రిటీష్ హయాం నుంచే ప్రత్యేక చట్టాలున్నాయన్న ఆయన కాంగ్రెస్‌, బీజేపీలు దశాబ్దాలుగా పాలిస్తున్న దళితులకు న్యాయం జరగడం లేదన్నారు. దళితులు, గిరిజనులకు ప్రత్యేక చట్టాలున్నప్పటికీ కేసులు పెరుగుతూనే ఉన్నాయని తెలిపారు. బీజేపీ, కాంగ్రెస్‌లు ఆత్మపరిశీలన చేసుకోకుండా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం దారుణమన్నారు. న్యాయస్థానాలు క్షేత్రస్థాయిలో వాస్తవాలు తెలుసుకొని వ్యవహరించాలన్న హరీశ్‌రావు పోలీసులు, బలప్రయోగంతో దళితులను అణచివేయాలని చూస్తే ఫలితం ఉండదన్నారు. 

త‌ప్పుడు పోస్టులు పెడితే జైలుకు పంపిస్తా

Submitted by arun on Sat, 03/10/2018 - 11:55

సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న ప్రచారం గురించి మంత్రి హరీష్ రావు సీరియస్ గా స్పందించారు. తాను పార్టీ మారుతున్నానంటూ అసత్య ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. తాను టీఆర్ఎస్ లోనే పుట్టానని చివరి వరకు టీఆర్ఎస్ లోనే ఉంటానని హరీష్ రావు తెలిపారు. 

19 నుంచి ఎర్రజొన్న కొనుగోళ్లు

Submitted by arun on Sat, 02/17/2018 - 12:42

ఎర్రజొన్న రైతులను ఆదుకుంటామని మంత్రి హరీష్ తెలిపారు. రెండు రోజులు నుంచి ఎర్రజొన్న రైతులు మద్దతు ధర కోసం నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. రైతుల ఆందోళనపై స్పందించిన మంత్రి హరీష్ రావు దేశంలో ఎక్కడా ఎర్రజొన్నలను ప్రభుత్వాలు కొనడం లేదని చెప్పారు. తెలంగాణలో రూ.2300తో కొనుగోలు చేస్తున్నామన్న ఆయన కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు వాణిజ్య పంట నుంచి ఎర్రజొన్నలను ఎందుకు తొలగించలేదని ప్రశ్నించారు. ఈ నెల 19 నుంచి 45 రోజులపాటు నిజామాబాద్, జగిత్యాల, నిర్మల్ జిల్లాల్లో కొనుగోళ్లను చేపట్టాలని నిర్ణయించింది.