Vijay Mallya

విజయ్ మాల్యా సంచలన వ్యాఖ్యలు...ఇంగ్లండ్ వెళ్లే ముందు అరుణ్ జైట్లీని...

Submitted by arun on Thu, 09/13/2018 - 11:54

బ్యాంకు రుణాల ఎగవేతదారు విజయ్ మాల్యా సంచలన రాజకీయ ఆరోపణ చేశారు. తాను భారతదేశం నుంచి బ్రిటన్ వెళ్ళే ముందు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని కలిశానని చెప్పారు. వెస్ట్ మినిస్టర్ కోర్టు బయట విలేకర్లతో మాట్లాడుతూ మాల్యా పలు సంచలన విషయాలు వెల్లడించారు. తాను భారతదేశం నుంచి బ్రిటన్ రావడానికి ముందు ఆర్థిక మంత్రి జైట్లీని చాలాసార్లు కలిశానని, బ్యాంకు రుణాల చెల్లింపుకు సంబంధించిన అనేక ఆఫర్లు ఇచ్చానని తెలిపారు. అయితే మరిన్ని వివరాలను వెల్లడించేందుకు ఆయన నిరాకరించారు. ఆ వివరాలను తాను ఎందుకు చెప్పాలని ఎదురు ప్రశ్నించారు.

అప్పు తీర్చడానికి నేను రెడీ...మోడీకి రాసిన లేఖను బయటపెట్టిన మాల్యా

Submitted by arun on Wed, 06/27/2018 - 15:05

బ్యాంకులకు వేల కోట్లు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన విజయ్ మాల్యా ఎట్టకేలకు స్పందించాడు. సెటిల్మెంట్‌కు అన్ని ప్రయత్నాలు చేస్తున్నానని చెప్పాడు. భారత ప్రభుత్వం తనపై కనికరం లేకుండా వ్యవహరిస్తోందని ఆరోపించాడు. ఇదే విషయమై మాల్యా రెండేళ్ల క్రితం ప్రధాని మోడీకి లేఖ రాశాడు. ఆ లేఖను ట్విట్టర్ ద్వారా ప్రస్తుతం బయటపెట్టాడు. 

ఆర్ధిక నేరగాళ్లంతా బ్రిటన్‌లోనే ఎందుకు తలదాచుకుంటున్నారు?

Submitted by arun on Mon, 06/18/2018 - 14:32

లలిత్‌మోడీ, విజయ్‌ మాల్యా, నీరవ్‌మోడీ... ఇలా ఆర్ధిక నేరగాళ్లంతా బ్రిటన్‌లోనే ఎందుకు తలదాచుకుంటున్నారు? వీళ్లంతా బ్రిటన్‌నే ఎందుకు ఎంచుకున్నారు? భారత్‌లో నేరాభియోగాలు ఎదుర్కొంటున్న వారంతా... బ్రిటన్‌‌కే ఎందుకు చెక్కేస్తున్నారు? నేరగాళ్లకు బ్రిటన్‌ స్వర్గధామమా? అసలు రీజనేంటి?
 

చంద్ర‌బాబును చార్లెస్ శోభరాజ్ తో పోల్చిన విజ‌య‌సాయి

Submitted by lakshman on Tue, 03/27/2018 - 17:04

వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి సీఎం చంద్ర‌బాబు, టీడీపీ నేత‌ల‌పై నిప్పులు చెరిగారు. న‌న్ను మాల్యాతో పోల్చాతారా అని ప్ర‌శ్నించిన విజ‌య‌సాయి ..ప్ర‌త్యేక‌హోదాపై చంద్ర‌బాబుకు చిత్త‌శుద్దిలేద‌ని క‌డిగిపారేశారు. టీడీపీ నేతలు దొంగలు , చంద్రబాబు గజ నేరగాడు , నిజం చెప్పాలంటే బ్యాంకులను టీడీపీ నేతలే దోచుకున్నారని, ప్రపంచంలోనే అతిపెద్ద నేరగాడు చార్లెస్ శోభరాజుకు చంద్రబాబు సమానం అని  మండిపడ్డారు. ఇక ప‌దే ప‌దే పీఎంవోలో విజ‌య్ సాయిరెడ్డి ప్ర‌త్య‌క్ష‌మ‌వ్వ‌డంపై స్పందించిన ఆయ‌న ఎన్టీఏపై అవిశ్వాస తీర్మానం ప్ర‌క‌టించిన త‌రువాత తాను క‌ల‌వ‌లేద‌ని చెప్పుకొచ్చారు.  

ఒకటి కాదు, రెండు కాదు పది లక్షల కోట్ల లూటీ

Submitted by arun on Sat, 02/24/2018 - 12:01

జన్‌ధన్‌ ఖాతాలు తెరవండి...డబ్బులతో నింపండి....అంటూ ప్రధాని నరేంద్ర మోడీ ఘనంగానే పిలుపునిచ్చారు. పాపం జనం కూడా ప్రధాని మాట విని, బ్యాంకుల్లో డబ్బు జమ చేసుకున్నారు. పెద్ద నోట్ల రద్దు ఎఫెక్ట్‌తో పెద్ద మొత్తంలో అకౌంట్లలో వేశారు. ఇప్పుడు ఆ అకౌంట్లే లక్ష్యంగా బడాబడా పారిశ్రామిక దొంగలు దోచుకెళ్తున్నారు. నిన్న విజయ్ మాల్యా, నేడు నీరవ్‌ మోడీ, రేపు ఇంకెందరో...ఇలా లెక్కేసుకుపోతే, పారిశ్రామికవేత్తలు బ్యాంకులను దోచేసింది ఎంతో తెలుసా...

దేశంలో దొంగలు పడ్డారు..

Submitted by arun on Sat, 02/17/2018 - 12:06

దేశంలో దొంగలుపడ్డారు. కోట్లకు కోట్లు కొల్లగొడుతున్నారు. కానీ వీళ్లు దొంగలా చోరీ చేయరు. దొరలా జనం సొమ్మును కాజేస్తారు. దర్జాగా విదేశాలకు పారిపోతారు. బ్యాంకులు, అధికారులు, పాలకులు అందరూ నిద్రలేవకముందే, డబ్బుల మూటలు సర్దుకుని ఎగిరిపోతారు. దొంగలు బాబోయ్ దొంగలు. టక్కు టమార టక్కరి దొంగలు.