surrogate twins

చ‌నిపోయిన కొడుకు వీర్యంతో ఆ త‌ల్లి ఏం చేసిందంటే

Submitted by arun on Thu, 02/15/2018 - 14:01

అమ్మ ప్రేమకు అవధులు లేవనే విషయాన్ని ఈ సంఘటన మరోసారి నిజం చేసింది.  చనిపోయిన కొడుకు వీర్యంతో పండంటి మనుమలను పొందింది ఆ తల్లి. కొడుకు మీదున్న ప్రేమ.. తన కళ్ల ముందు లేడన్న బాధతో ఆమె ఈ నిర్ణయం తీసుకుంది. రెండేళ్ల క్రితం బ్రెయిన్ ట్యూమర్‌తో చనిపోయిన తన కొడుకు మధుర స్మృతులను ఎలాగైనా గుర్తుంచుకోవాలన్న ఆశతో.. పెళ్లి కాని తన కొడుకు వీర్యాన్ని తీయించి భద్రపరిచి.. ఇప్పుడిలా అతడి వారసులను తన చేతుల్లోకి తీసుకుంది. ఈ ఆసక్తికర పరిణామం పుణెలో జరిగింది. ప్రథమేశ్ (27) ఉద్యోగ రీత్యా జర్మనీలో ఉండేవాడు. అయితే, 2013లో అతడికి ప్రాణాంతక బ్రెయిన్ ట్యూమర్ ఉన్నట్టు పరీక్షల్లో తేలింది.