Election Campaign

నేటి నుంచి కేసీఆర్ తుది ప్రచారం..

Submitted by arun on Mon, 11/19/2018 - 12:03

అభ్యర్థుల ఎంపిక పూర్తైంది. ఇక మిగిలింది ప్రచారమే. ఇవాళ్టి నుంచి గులాబీ బాస్‌ కేసీఆర్‌ ప్రచార పర్వం షురూ కానుంది. ఇన్నాళ్లూ అభ్యర్థుల ఎంపిక, యాగ నిర్వహణలో బిజీగా ఉన్న కేసీఆర్‌ ఇక నుంచి ఎన్నికల కధన రంగంలోకి దూకనున్నారు. ఈ రోజు మధ్యాహ్నం ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం నుంచే ప్రత్యేక హెలికాప్టర్‌లో ఖమ్మంలో జరిగే ప్రచార సభకు హాజరుకానున్నారు. ఖమ్మం మొదలు ఇవాళ్టి నుంచి పూర్తిస్థాయి ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. 

ప్రచార జోరు పెంచుతున్న గులాబీ దళం

Submitted by arun on Sat, 11/17/2018 - 10:42

టీఆర్ఎస్ పార్టీ ప్ర‌చార జోరు పెంచబోతోంది. కేసీఆర్ ప్ర‌చార షెడ్యూల్ ఖరారు కారు జెట్ స్పీడులో దూసుకుపోబోతోంది. ఇంతకాలం మహాకూటని సీట్లు ఫైనల్ కాలేదని ప్రచారానికి విరామం ఇచ్చిన కేసీఆర్ వ‌రుసగా బహిరంగ సబల్లో పాల్గొనబోతున్నారు. బాస్ వస్తే క్షేత్ర స్థాయిలో సీన్ మారిపోతుందని టీఆర్ఎస్ అభ్యర్థులు భరోసాగా ఉన్నారు. 

పద్మాదేవేందర్ రెడ్డిని అడ్డుకున్న ప్రజలు

Submitted by arun on Fri, 11/16/2018 - 14:28

గ్రామాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులకు నిరసన సెగలు ఆగడం లేదు. తాజాగా మెదక్ జిల్లాలో టీఆర్ఎస్ అభ్యర్థి పద్మాదేవేందర్ రెడ్డికి నిరసన సెగ తగిలింది. పాపన్న పేటలో ప్రజలు ప్రశ్నల వర్షం కురిపించారు. నిన్న, మొన్న మెదక్, గణపూర్, రామాయంపేట మండలాల్లో పద్మకు నిరసన ఎదురైనా  ప్రచారం కొనసాగించారు.  అబ్లాపూర్ గ్రామంలో హామీలేవి అమలు చేయలేదని గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. దీంతో ఆమె ప్రచారాన్ని అర్ధాంతరంగా ఆపేసి వెను దిరిగారు. 

కాంగ్రెస్ గెలుపు ఖాయమంటున్న తెలంగాణ మంత్రి

Submitted by arun on Wed, 11/14/2018 - 13:33

మంత్రి మహేందర్  రెడ్డి నోరు జారారు.  రంగారెడ్డిజిల్లా  తాండూర్  మండలం ఉద్దండాపూర్ లో విస్తృత  ప్రచారం చేస్తున్న టైంలో టంగ్  స్లిప్  అయ్యారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్  పార్టే గెలుస్తుందన్న ఆయన వెంటనే తప్పును తెలుసుకుని నాలుక కరుచుకోవడం వైరల్ గా మారింది. 

ప్రచారంలో పేలుతున్న మాటల తూటాలు...అదుపు తప్పితే చర్యలు తప్పవంటున్న ఈసీ

Submitted by arun on Fri, 11/09/2018 - 11:44

మాటల తూటాలు పేలుతున్నాయి... ప్రచార పరిధి మర్చిపోయి హద్దులు దాటుతున్నారు.. అభివృధ్దిపై పోటీ పడాల్సిన వారు స్థాయి మరిచి విమర్శలకు దిగుతున్నారు ఎన్నికల ప్రచారంలో వివిధ పార్టీల నేతలు విమర్శ, ప్రతివిమర్శలు చేస్తూ ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటున్నారు ప్ర‌జాస్వామ్యం‌లో ఇలాంటి పద్ధతి సరైనది కాదంటున్న ఈసీ అదుపు తప్పితే చర్యలు తప్పదంటోంది. 

టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కు చేదు అనుభవం

Submitted by arun on Sun, 11/04/2018 - 15:58

మానకొండూరు టిఆర్ఎస్ తాజా మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ను ఎన్నికల ప్రచారంలో గ్రామస్థులు నిలదీశారు. ఇల్లంతకుంట మండలంలో  రసమయి బాలకిషన్ ప్రచారంలో భాగంగా నేరేడుపల్లి, కందీకట్కూర్ వంతడుపుల గ్రామాలలో ప్రచారం నిర్వహించారు దీనిలో భాగంగా వంతడుపుల గ్రామంలో దళితులు నువ్వు మాకు ఏం చేయలేదని రసమయి బాలకిషన్ ను నిలదీశారు అలాగే కందీకట్కూర్ గ్రామంలో ప్రజలు మాకు  ముంపు గ్రామం కింద పునరావాసం కల్పిస్తామని ఇంతవరకు కూడా పట్టించుకోలేదని నిలదీశారు అక్కడ ఉన్న టిఆర్ఎస్ కార్యకర్తలు ఒక్కసారిగా మహిళలపై మూకుమ్మడి దాడి చేశారు దీంతో ఒక్కసారి పరిస్థితి ఉధృతమైంది.

టీఆర్ఎస్ అభ్యర్థులకు చుక్కలు

Submitted by arun on Mon, 10/29/2018 - 11:25

టీఆర్ఎస్ కు ప్రచారంలో ఎదురు దెబ్బలు తప్పటం లేదు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు గ్రామాల బాట పట్టిన అభ్యర్థులకు ప్రజలు చుక్కలు చూపిస్తున్నారు ఏం అభివృద్ధి చేశారని ఏం మొహం పెట్టుకుని వస్తున్నారని నిలదీస్తున్నారు. అడుగడుగునా నిరసనలు తెలుపుతున్నారు. 

నిజామాబాద్ జిల్లాలో రసవత్తరంగా రాజకీయం...ప్రచారం ఆ మూడు చోట్లే

Submitted by arun on Wed, 10/24/2018 - 13:30

అధికార పార్టీకి ధీటుగా ఆ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్ధులు ప్రచార పర్వం కొనసాగిస్తున్నారు. ప్రచారానికి ఆ పార్టీ అగ్రనేతలు సైతం ఓ దఫా తమ పార్టీ అభ్యర్ధుల విజయం కోసం సుడిగాలి పర్యటన చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎన్నికల వేడి కొనసాగుతుండగా ఆ మూడు నియోజవర్గాల్లోనే సందడి ఉంది. మిగతా నియోజకవర్గాల్లోని కాంగ్రెస్ శ్రేణుల్లో మహా కలవరం మొదలైంది. సీట్ల పీటముడి వీడక అభ్యర్ధుల్లో టెన్షన్ ఉంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ ప్రచారం సరళిపై ప్రత్యేక కథనం.

యువతే లక్ష్యంగా టీఆర్ఎస్‌ ఎన్నికల ప్రచారం ...రంగంలో దిగిన...

Submitted by arun on Mon, 10/15/2018 - 10:29

పెట్టుబడి సాయంతో రైతులను, బతుకమ్మ చీరలతో మహిళల్లో ఆదరణ పొందిన టీఆర్ఎస్ యూత్‌ను ఆకట్టుకునేందుకు కొత్త మార్గాలు అన్వేషిస్తోంది. కోడ్ అమల్లో ఉండటంతో  తాము గతంలో చేపట్టిన పథకాలను వివరిస్తూ కొత్త పంథాలో ముందుకు వెళుతోంది. ఏక కాలంలో బహుళ ప్రయోజనాలు పొందేలా అటు యూత్ ఇటు వీరి తల్లిదండ్రులను ఆకట్టుకునేలా క్షేత్రస్ధాయి ప్రచారం ప్రారంభించింది.   

జోగుళాంబ నుంచి కాంగ్రెస్ ఎన్నికల శంఖారావం

Submitted by arun on Thu, 10/04/2018 - 11:24

ప్రచార రథం ఎక్కేందుకు కాంగ్రెస్‌ నాయకులు సిద్ధమవుతున్నారు. మైకులు పట్టుకుని ప్రజల ముందుకు వెళ్లేందుకు అడుగులు వేస్తున్నారు. ఇన్నాళ్లూ మహాకూటమి ఏర్పాటులో బిజీగా గడిపిన తెలంగాణ కాంగ్రెస్‌ నాయకులు ఇవాళ ప్రచారశంఖం పూరించనున్నారు. జోగులాంబ అమ్మవారి ఆశీర్వాదంతో ప్రచారయాత్రను ప్రారంభించనున్నారు.