IPL 2018

ప్రతిభకు వయసు అడ్డుకాదు..!

Submitted by arun on Mon, 05/28/2018 - 17:08

ఇరవై ఓవర్లో అరవై థ్రిల్స్ గా సాగిపోయే ఐపీఎల్ ను...ఉరకలేసే కుర్రాళ్ల ఆట అనుకొంటే అంతకు మించిన పొరపాటు మరొకటి లేదని....మహేంద్రసింగ్ ధోనీ నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ నిరూపించింది. హైదరాబాద్ సన్ రైజర్స్ తో ముగిసిన ఫైనల్లో పాల్గొన్న సూపర్ కింగ్స్ జట్టులోని మొత్తం 12 మందిలో తొమ్మిది మంది ఆటగాళ్లు 30 ఏళ్లకు పైబడినవారే. కెప్టెన్ ధోనీ, ఓపెనర్లు వాట్సన్, డూప్లెసిస్, అంబటి రాయుడు, డ్వయన్ బ్రావో, హర్భజన్ సింగ్, సురేశ్ రైనాతో సహా ప్రధాన ఆటగాళ్లంతా మూడుపదులు పైబడినవారే.

జియో మరో బంపర్‌ ఆఫర్‌...వారికి పండగే

Submitted by arun on Sat, 05/26/2018 - 15:58

తమ వినియోగదారులను ఆకట్టుకునేందుకు రిలయన్స్ జియో మరో సరికొత్త ఆఫర్ ప్రకటించింది. ఐపీఎల్-11, 2018 ఫైనల్ మ్యాచ్‌ కోసం ఈ కొత్త ఆఫర్ అందిస్తున్నట్లు సంస్థ పేర్కొంది. రూ. 101 రీచార్జి చేసుకుంటే 4జీ స్మార్ట్‌ఫోన్లకు 4 రోజులపాటు ప్రతి రోజు 2జీబీ డేటాను వాడుకోవచ్చని జియో ప్రకటించింది.  ఈ కాంప్లిమెంటరీ ఆఫర్‌ ఎంపిక చేసిన జియో యూజర్లకు మాత్రమే అందుబాటులోకి తీసుకొచ్చింది.

నా సెంచరీ ఆమెకు అంకితం: గేల్‌

Submitted by arun on Fri, 04/20/2018 - 17:23

ఐపీఎల్ 11వ సీజన్లో తాను సాధించిన సెంచరీని ఈరోజు పుట్టినరోజు జరుపుకొంటున్న తన కుమార్తెకు అంకితమిస్తున్నట్లు కింగ్స్ పంజాప్ సునామీ ఓపెనర్ క్రిస్ గేల్ ప్రకటించాడు. తనకు వయసైపోయిందీ తన పనైపోయిందంటూ వేలంలో తనను ఏమాత్రం పట్టించుకోని ఫ్రాంచైజీలు, విమర్శకులకు తన ఈ సెంచరీనే సమాధానమని ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకొంటూ గేల్ చెప్పాడు. వేలంలో తనను ఫ్రాంచైజీలు
పక్కనపెట్టినా కింగ్స్ పంజాబ్ మెంటార్ వీరేంద్ర సెహ్వాగ్ తనను ఎంపిక చేయడం ద్వారా ఐపీఎల్ ను కాపాడాడని గుర్తు చేశాడు. కనీసం రెండుమ్యాచ్ ల్లో విజయాలు అందించమని తనను సెహ్వాగ్ కోరాడని

విరాట్ కళ కళ...బెంగళూరు వెల వెల

Submitted by arun on Wed, 04/18/2018 - 17:14

ఐపీఎల్ 11వ సీజన్ మొదటి 14 మ్యాచ్ లు ముగిసే సమయానికి...బెంగళూరు రాయల్ చాలెంజర్స్ కెప్టెన్ విరాట్ కొహ్లీ అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్ మన్ గా నిలిచాడు. ముంబై వాంఖెడీ స్టేడియం

ఐపీఎల్ లో క్రిస్ గేల్ హవా షురూ

Submitted by arun on Mon, 04/16/2018 - 16:40

ఓడలు బళ్లు...బళ్లు ఓడలు అన్నమాట ఐపీఎల్ లో కింగ్స్ పంజాబ్ సునామీ ఓపెనర్ క్రిస్ గేల్ కు అతికినట్లు సరిపోతుంది. ఐపీఎల్ గత సీజన్ వరకూ బెంగలూరు రాయల్ చాలెంజర్స్ ప్రధాన ఆటగాడిగా ఏడాదికి 10 కోట్ల రూపాయల వరకూ అందుకొన్న గేల్ 11వ సీజన్ వేలంలో ఎవరికీ అవసరం లేని ఆటగాడిగా మిగిలాడు. అయితే కింగ్స్ పంజాబ్ మెంటార్ కమ్ కోచ్ వీరేంద్ర సెహ్వాగ్ చొరవతో కనీసధర 2 కోట్ల రూపాయలకే క్రిస్ గేల్ ను తమజట్టులో చేర్చుకొంది. అంతేకాదు ప్రస్తుత సీజన్లో తన తొలిమ్యాచ్ ను చెన్నై సూపర్ కింగ్స్ ప్రత్యర్థిగా ఆడిన గేల్ కేవలం 33 బాల్స్ లోనే 7 బౌండ్రీలు, 4 సిక్సర్లతో 63 పరుగులతో మ్యాచ్ విన్నర్ గా నిలిచాడు.

ఐపీఎల్-11 షెడ్యూల్ ఇదే

Submitted by arun on Thu, 02/15/2018 - 11:38

ఐపీఎల్-11వ సీజన్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను బీసీసీఐ ప్రకటించింది. ఏప్రిల్ 7తో మొదలుకానున్న ఈ యేడాది ఐపీఎల్ సంబరాలు మే 27తో ముగియనున్నాయి. ఈ సీజన్‌లో అన్ని ఫ్రాంచైజీలు 60 మ్యాచ్‌లు ఆడనుండగా.. ఇందుకోసం వివిధ రాష్ట్రాల్లోని 9 స్టేడియాలను బీసీసీఐ ఎంపిక చేసింది. అలాగే మొదటి చివరి మ్యాచ్‌కు వాంఖడే స్టేడియం వేదిక కానుండటం మరో విశేషం. 11వ సీజన్‌లో భాగంగా మొదటి రోజున ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నాయి. ఇక ఈ సీజన్‌లో హైదరాబాద్‌లో మొత్తం 7 మ్యాచ్‌లు జరగనున్నాయి.

Tags