oru adaar love

ప్రియా వారియర్ కు సుప్రీంకోర్టులో ఊరట

Submitted by arun on Fri, 08/31/2018 - 13:40

ఒరు అదార్ లవ్ సినిమాలోని ‘మాణిక్య మలరాయ పూవి’ పాటలో కన్నుగీటే సన్నివేశంతో నటి ప్రియా వారియర్ రాత్రికి రాత్రే సోషల్ మీడియా స్టార్ గా మారిపోయిన సంగతి తెలిసిందే. ఈ సీన్ తో ప్రియకు ఎంత స్టార్ డమ్ వచ్చిందో ఇబ్బందులు కూడా అలాగే ఎదురయ్యాయి. ఆమెపై పలుచోట్ల కేసులు దాఖలయ్యాయి. తాజాగా హైదరాబాద్ లో  ప్రియా వారియర్ పై నమోదైన ఎఫ్ఐఆర్ ను ఈ రోజు సుప్రీంకోర్టు కొట్టివేసింది. దాదాపు నాలుగు నెలల పాటు విచారణలో ఉన్న ఈ కేసులో ప్రియా ప్రకాశ్‌కు ఊరటనిస్తూ శుక్రవారం దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పు వెలువరించింది. సుప్రీంకోర్టు ప్రియా ప్రకాష్‌పై కేసును కొట్టివేయడమే కాక..

ఆ వార్త‌ల్లో నిజం లేదు

Submitted by lakshman on Fri, 02/16/2018 - 00:58

అమ్మాయి కళ్లతో నవ్వితే ఎంత మంది ఫిదా అవుతారో ఇటీవల ప్రియా వారియర్ ఒక్క వీడియో క్లిప్ తో చెప్పేసింది. త‌న క‌నుసైగ‌తో ప్ర‌పంచ వ్యాప్తంగా అభిమానుల్ని సొంతం చేసుకున్న  ఈ ముద్దుగుమ్ము ఓవ‌ర్ నైట్ స్టార్ డం సంపాదించుకుంది. ప్రియా వారియ‌ర్ ..! యువ‌కుల క‌ల‌ల రాకుమారి. ఓరు ఆధార్ ల‌వ్ అనే సినిమాలోని ఓ పాట‌లో క‌న్ను గీటుతూ  ప్ర‌పంచ వ్యాప్తంగా పాపుల‌రిటీని సంపాదించుకుంది. ఎంత‌లా అంటే ట్రెండింగ్ లో శృంగార తార స‌న్నిలియోన్ ను క్రాస్ చేసేంత‌లా. మ‌రి అంత‌క్రేజ్ సంపాదించుకున్న ఈ భామ్మ గురించి రోజుకో వార్త పిల్మింన‌గ‌ర్ లో చ‌క్కెర్లు కొడుతుంది.

ఆ పాటను మార్చే ప్రసక్తే లేదు

Submitted by arun on Thu, 02/15/2018 - 11:16

సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న మలయాళ చిత్రం 'ఒరు ఆధార్ లవ్' సినిమాలోని 'మాణిక్య మలయార పూవీ' పాట సాహిత్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో మార్చే ప్రసక్తే లేదని దర్శకుడు ఒమర్ లులూ తెలిపారు. ఈ పాటను సీఎమ్‌జే జప్పర్ రాశారని.. అందులో ఏ మతాన్ని కించపరిచే అభ్యంతర వ్యాఖ్యలు లేవని ఆయన అన్నారు. ఉత్తర కేరళలో జరిగే ప్రతి పెళ్లిలోనూ ఈ పాటను పాడుకుంటారని.. ఆ ప్రాంతంలోని ముస్లింలు కూడా 1978 నుంచి ఈ పాటను పాడుతూ వస్తున్నారని చెప్పారు. అప్పటి నుంచి అక్కడి ముస్లింలకు లేని అభ్యంతరం.. ఇప్పుడెందుకంటూ ఆయన ప్రశ్నించారు.