Priya Prakash Varrier

ప్రియా వారియర్ కు సుప్రీంకోర్టులో ఊరట

Submitted by arun on Fri, 08/31/2018 - 13:40

ఒరు అదార్ లవ్ సినిమాలోని ‘మాణిక్య మలరాయ పూవి’ పాటలో కన్నుగీటే సన్నివేశంతో నటి ప్రియా వారియర్ రాత్రికి రాత్రే సోషల్ మీడియా స్టార్ గా మారిపోయిన సంగతి తెలిసిందే. ఈ సీన్ తో ప్రియకు ఎంత స్టార్ డమ్ వచ్చిందో ఇబ్బందులు కూడా అలాగే ఎదురయ్యాయి. ఆమెపై పలుచోట్ల కేసులు దాఖలయ్యాయి. తాజాగా హైదరాబాద్ లో  ప్రియా వారియర్ పై నమోదైన ఎఫ్ఐఆర్ ను ఈ రోజు సుప్రీంకోర్టు కొట్టివేసింది. దాదాపు నాలుగు నెలల పాటు విచారణలో ఉన్న ఈ కేసులో ప్రియా ప్రకాశ్‌కు ఊరటనిస్తూ శుక్రవారం దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పు వెలువరించింది. సుప్రీంకోర్టు ప్రియా ప్రకాష్‌పై కేసును కొట్టివేయడమే కాక..

హైద‌రాబాద్‌కి ప్రియావారియ‌ర్‌..

Submitted by arun on Fri, 08/24/2018 - 11:35

కేవలం ఒకే ఒక కన్నుగీటుతో దేశమంతా కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న కేరళ భామ ప్రియా వారియర్  హైదరాబాద్‌కు వచ్చేస్తోంది. ఈ నెల 26న నగరంలో జరిగే 16వ సంతోషం సౌత్ ఇండియన్ ఫిల్మ్ అవార్డ్స్ వేడుకకు ఆమె హాజరు కానుంది. ‘బెస్ట్ ఫేస్ ఆఫ్ ది ఇయర్’ అవార్డును ఆమె అందుకునేందుకు ప్రియా హైద‌రాబాద్‌కి వ‌స్తున్న‌ట్టు సంతోషం సినీ మ్యాగజైన్ అధినేత సురేష్ కొండేటి తెలిపారు. ఈ విషయమై ప్రియా వారియర్ అధికారికంగా మాట్లాడిన వీడియోను విడుదల చేశారు. ప‌లువురు సెల‌బ్రిటీల స‌మ‌క్షంలో అంగ‌రంగ వైభవంగా జ‌ర‌గ‌నున్న ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్యఅతిథిగా హాజరుకానున్నట్టు సమాచారం.

కన్నుగీటిన రాహుల్‌గాంధీ...స్పందించిన ప్రియావారియర్

Submitted by arun on Sat, 07/21/2018 - 11:20

లోక్‌సభలో కన్నుగీటిన రాహుల్‌గాంధీని ప్రియా ప్రకాశ్‌ వారియర్‌తో పోల్చుతూ నెటిజన్లు జోకులు పేల్చిన నేపథ్యంలో ఆమె దీనిపై స్పందించారు. దీనిపై ప్రియా మాట్లాడుతూ.. కాలేజ్ నుండి తిరిగి రాగానే అమ్మ ఈ విష‌యాన్ని చెప్పింది. టీవీలో చూసి షాక్ అయ్యాను. రాహుల్ స‌ర్‌తో న‌న్ను పోల్చి చూడ‌డం సంతోషంగా అనిపిస్తుంది అని బ‌దులిచ్చింది. ఈ రోజు (జులై 20) తనకు మర్చిపోలేని రోజుగా మిగిలిపోతుందని కూడా ప్రియా వారియర్ అంది.


 

మళ్లీ కష్టాల్లో ప్రియా ప్రకాష్ వారియర్‌

Submitted by arun on Tue, 04/10/2018 - 16:58

ప్రియా వారియర్‌కు మళ్ళీ కోర్టు కేసుల కష్టాలు మొదలయ్యాయి. ఇస్లాం ప్రకారం కన్ను కొట్టడం దైవాన్ని నిందించడమే అంటూ హైదరాబాద్‌లో మరో పిటిషన్ దాఖలైంది. ప్రియావారియర్ నటించిన పాట మహ్మద్ ప్రవక్త మరియు ఆయన భార్య ఖదీజా లని ప్రశంసిస్తూరాసినది. పవిత్రమైన ఆ పాటలో ప్రియా వారియర్ కొట్టడం దైవ దూషణ చేయడమే అంటూ మరో ఇద్దరు వ్యక్తులు కోర్టు తలుపు తట్టడం ఇప్పుడు మళ్లీ చర్చనీయాంశమైంది

ఒక్క పోస్ట్ చేస్తే.. 8 లక్షల రూపాయలా?

Submitted by arun on Fri, 03/09/2018 - 15:43

అలా కన్ను కొట్టి.. ఇలా అందరినీ తన బుట్టలో పడేసుకున్న ప్రియా ప్రకాశ్ వారియర్.. సోషల్ మీడియా సంపాదన ఎంతో తెలిస్తే.. మనం కళ్లు తేలేయడం ఖాయం. ఒరు అడర్ లవ్ సినిమా టీజర్ తో చిన్నా పెద్దా తేడా లేకుండా అందరినీ మాయ చేసి పారేసిన ప్రియా.. ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా హాట్ కేక్ అయిపోయింది. ఇన్ స్టా గ్రామ్ లో ఆమె సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది.

ప్రియా ప్రకాశ్ వారియర్.. సీపీఎంలో చేరిందా?

Submitted by arun on Mon, 03/05/2018 - 11:45

ఒరు అడర్ లవ్ అనే మలయాళ సినిమా టీజర్ తో యువత మనసు దోచేసిన అందం ప్రియా ప్రకాశ్ వారియర్ ది. ఈ అమ్మాయి గురించే ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చ నడుస్తోంది. ఆమె హావభాబాలు అంతగా ప్రభావం చూపించడంతో.. రాజకీయ నాయకులు కూడా ప్రియా పేరును.. ఫొటోలను తమ అవసరాల కోసం వాడేసుకుంటున్నారు. ముఖ్యంగా.. ప్రియా సొంత రాష్ట్రం కేరళలో ఈ తీరు బాగా కనిపిస్తోంది.

ప్రియా వారియర్‌‌కు సుప్రీంకోర్టులో ఊరట

Submitted by arun on Wed, 02/21/2018 - 12:02

సోషల్ మీడియా సంచలనం,  మలయాళ నటి ప్రియా వారియర్‌‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఒరు ఆదార్ లవ్‌ పాటలో నటించిన ప్రియా వారియర్‌పై దాఖలైన కేసులపై అత్యున్నత న్యాయస్థానం స్టే విధించింది. ప్రియా వారియర్‌పైనా, చిత్ర దర్శకుడిపైనా .ఎలాంటి క్రిమినల్ చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. ఈ మేరకు తెలంగాణ, మహారాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. మలయాళ సినిమా ఒరు ఆదార్ లవ్‌ పాటలో నటించిన ప్రియపైనా దర్శకుడిపైనా..తెలంగాణ, మహారాష్ట్రలో కేసులు నమోదయ్యాయి. ఓ వర్గం మనోభావాలను కించపరచేలా పాట ఉందనే ఫిర్యాదుతో పోలీసులు కేసులు పెట్టి ప్రియకు నోటీసులు జారీ చేశారు.

సుప్రీంను ఆశ్రయించిన ప్రియా వారియర్

Submitted by arun on Tue, 02/20/2018 - 16:15

ఇంటర్నెట్ సెన్సేషన్ ప్రియా వారియర్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఒరు ఆదార్ లవ్ మూవీలోని.. పాటపై వచ్చిన ఫిర్యాదు మేరకు డైరెక్టర్‌ ఒమర్ లులూతో కలిసి సుప్రీంను ఆశ్రయించింది. హైదరాబాద్, మహారాష్ట్రలో నమోదైన కంప్లైంట్లపై.. స్టే ఇవ్వాలని పిటిషన్ వేసింది.

అభిమానులను లైవ్‌లో ఫిదా చేసిన ప్రియ

Submitted by arun on Sat, 02/17/2018 - 15:01

కన్నుకొట్టి యావత్ ప్రపంచాన్ని తనవైపు తిప్పుకున్న మలయాళీ ముద్దుగుమ్మ ప్రియా ప్రకాష్ వారియర్.. ఓవర్‌నైట్‌లో ఫుల్ స్టార్ డమ్ సంపాదించేసింది. యూత్ నుంచి ఒకప్పటి హీరోల వరకూ అందరికీ ఆరాధ్య దేవత అయింది. తాజాగా బాలీవుడ్ సీనియర్ నటుడు కూడా ప్రియా నువ్వు నా టైమ్‌లో ఎందుకు రాలేదంటూ బాధను వ్యక్తం చేశారు. తాజాగా అమ్మడు లైవ్‌లో మరోసారి ‘ఒరు ఆదార్ లవ్’ చిత్రంలో తనతో పాటు నటించిన రోషన్‌కు గన్ ఎక్కుపెట్టడమే కాకుండా.. ప్రేక్షకుల హృదయాలను కూడా పేల్చేసింది.

సీఎం బాస‌ట‌..వెన‌కంజ‌లో శృంగార తార

Submitted by lakshman on Fri, 02/16/2018 - 04:58

ఒరు ఆడార్ లవ్ సినిమా పాటకు ఆ రాష్ట్ర సీఎం బాస‌ట‌గా నిలిచారు.  మపిల్ల పట్టు అనే ముస్లిం సంప్రదాయ పాటను మ‌ళ‌యాళంలో  ‘ఒరు ఆదార్ లవ్’ అనే సినిమాలో ఉప‌యోగించారు. ఆ సాంగ్ లో ప్రియా ప్రకాశ్ వారియర్ క‌నుసైగ‌ల‌తో ప్ర‌పంచాన్ని ఆక‌ర్షించింది. అయితే  ముస్లిం మ‌నోబావాలు దెబ్బ‌తిన్నాయ‌ని , త‌క్ష‌ణ‌మే ఆ వీడియోల్ని డిలీట్ చేయాలనే డిమాండ్లు వినిపించాయి. ఈ వివాదం పై స్పందించిన కేర‌ళ సీఎం  పినరాయి విజయన్ కేర‌ళ‌లో భావ‌న ప్ర‌క‌ట‌న స్వేచ్ఛ‌పై అస‌హ‌నాన్ని ఆమెదించ‌బోమ‌ని సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. వారియ‌ర్ యాక్ట్ చేసిన పాటను 1978లో ఆకాశ వాణిలో ప్ర‌సారం చేసార‌ని అన్నారు.