Russia

ప్రపంచంలో అతిపెద్ద ఏరియా ( ప్రదేశం ) కలిగిన దేశం!

Submitted by arun on Thu, 11/29/2018 - 14:53

ప్రపంచంలోని అతి ఎక్కువ జనాభా కలిగిన దేశం ఏది అనగే అందరు చైనా అని చెపుతారు. అయితే ప్రపంచంలో అతిపెద్ద ఏరియా ( ప్రదేశం ) కలిగిన దేశం ఏదో మీకు తెలుసా.... ? ప్రపంచంలో అతిపెద్ద ఏరియా ( ప్రదేశం ) కలిగిన దేశం రష్యా. ఈ రష్యా ఏరియా లో ప్రపంచంలో అతిపెద్ద దేశం (ప్రపంచ భూభాగంలో 10.995%); దాని ఆసియా భాగం ఆసియాలో అతిపెద్ద దేశంగా మారుతుంది మరియు దాని యూరోపియన్ భాగం సుమారుగా 3,960,000 km2 (1,530,000 sq mi) యూరోప్లో అతిపెద్ద దేశంగా వుంది. శ్రీ.కో.

Tags

హెలికాఫ్టర్ కూలి 18 మంది మృతి

Submitted by arun on Sat, 08/04/2018 - 15:11

రష్యాకు చెందిన హెలికాప్టర్‌ సైబీరియా ఉత్తర ప్రాంతంలో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రయాణికులను తీసుకొని వెళ్తున్న హెలికాఫ్టర్ టేక్‌ఆఫ్ అయిన కొద్ది సేపటికే కుప్పకూలింది. దీంతో అందులో ఉన్న 18 మంది మృతి చెందారు. ఇందులో 15 మంది ప్రయాణికులు కాగా, ముగ్గురు హెలికాఫ్టర్ సిబ్బంది ఉన్నారు. రష్యాలోని సైబీరియా ప్రాంతంలో ఈ సంఘటన చోటు చేసుకుంది.
 

లైవ్‌లో రిపోర్టర్‌కు ముద్దిచ్చాడు..

Submitted by arun on Wed, 06/20/2018 - 14:10

ప్రస్తుతం వరల్డ్ కప్ సాకర్ పోటీలు జరుగుతున్న రష్యాకు వెళ్లిన కొలంబియా మహిళా జర్నలిస్టుకు వింతైన అనుభవం ఎదురైంది. ఓ జర్మన్ న్యూస్ చానల్ లో పనిచేస్తున్న జూలియట్ గోంజాలెజ్ థెరాన్ అనే యువతి, సరన్స్ ప్రాంతంలో నిలబడి లైవ్ రిపోర్టు ఇస్తుండగా, గుర్తు తెలియని ఓ యువకుడు వచ్చి, ఆమె బుగ్గపై ముద్దు పెట్టి వెళ్లాడు. ఈ వీడియోను జూలియట్ ట్విటర్‌లో షేర్ చేసుకుంది. తాను ఆ స్పాట్‌లో రెండు గంటలుగా ఉన్నానని, అయితే లైవ్ రిపోర్టింగ్ మొదలు పెట్టే వరకు ఆ వ్యక్తి వేచి చూశాడని ఆమె చెప్పింది. లైవ్‌లో ఇలా చేస్తే తాను వెంటనే రియాక్టయ్యే అవకాశం ఉండదని భావించి అతనిలా చేసినట్లు జూలియట్ తెలిపింది.

ఆవును 110మంది ప్ర‌యాణికులున్న విమానాన్ని కూల్చేయ‌మ‌న్నా

Submitted by lakshman on Mon, 03/12/2018 - 19:25

ర‌ష్యా అధ్య‌క్షుడు వ్లాద‌మీర్ పుతిన్ గురించి ఎంత చెప్పుకున్నాత‌క్కువే. త‌న దైన మార్క్ పాల‌న‌తో దూసుకెళుతున్న పుతిన్ అత్యంత సున్నిత‌మైన స‌మ‌యంలో క‌ఠిన నిర్ణ‌యాలు తీసుకోవ‌డంలో ఆయ‌నకు ఆయ‌నేసాటి. అయితే ఈ నేప‌థ్యంలో  పుతిన్ ప‌రిపాల‌న పై ఓ డాక్యుమెంట‌రీ విడుద‌లైంది. ఆ డాక్యుమెంట‌రీలో పుతిన్ తీసుకున్న సంచ‌ల‌నాత్మ‌క నిర్ణ‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి.

బ్యాగులో 54 నరికిన చేతులు

Submitted by arun on Sat, 03/10/2018 - 15:36

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 54 చేతులు నది ఒడ్డున లభించడంతో ప్రపంచమంతా కలవరానికి గురిచేస్తోంది. ఇది తీవ్రవాదులు చేశారా? వైద్య సంస్థలు చేశాయా?  ఏమైనా పూజలా లేక శిక్షలా?  అని తేల్చే పనిలో రష్యన్‌ పోలీసులు నిమగ్నమయ్యారు. ఫోరెన్సిక్‌ వారికీ అంతు చిక్కకుండా చేతుల వేలిముద్రలను చెరిపేశారు. రష్యాలోని అముర్‌ నది ఒడ్డున ఒక  సంచిలో మణికట్టు వరకు నరికేసిన మనుషుల అరచేతులు 54 కనిపించడం.. అక్కడి వారిని భయభ్రాంతులకు గురిచేసింది. పోలీసులు ఆ చేతులను స్వాధీనం చేసుకొని, ఫోరెన్సిక్‌ విభాగానికి తరలించారు. ఫోరెన్సిక్‌ నివేదిక ఆధారంగా ఈ మిస్టరీనీ ఛేదించడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు.