Bride

వరునికి దండ వేసేందుకు వధువును పైకి ఎత్తిన బంధువు...లాగి పీకిన వధువు

Submitted by arun on Tue, 07/03/2018 - 13:27

ఎవరైనా చెంప దెబ్బకొడితే, ఎంత అవమానంగా ఉంటుంది? అది కూడా ఓ పెళ్లి మండపంలో నలుగురి ముందూ వధువు కొడితే... అంతకన్నా అవమానం ఇంకోటి ఉంటుందా? ఎక్కడ జరిగిందో తెలియదుగానీ, నిన్న సోషల్ మీడియాలో పోస్టు చేయబడిన ఓ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఓ వీడియోలో పెళ్లి వేడుక జరుగుతుంది.. ముహూర్తం దగ్గర పడే సమయంలో వధువు, వరుడు దండలు మార్చుకునేందుకు నిలబడ్డారు. వారి సాంప్రదాయం ప్రకారం వరుడిని, వధువుని వారి బంధువులు ఎత్తుకుని దండలు మార్పించాలి.. దీనిలో భాగంగా వరుడి తరపు బంధువు అతన్ని ఎత్తుకుని వధువు మెడలో దండ వేయించాడు.. ఇప్పుడు వధువు వంతు వచ్చింది.

Tags

పెళ్లైన 20 రోజులకే భర్తపై హత్యాయత్నం..!

Submitted by arun on Tue, 05/29/2018 - 11:50

పెళ్లైన పది రోజులకే ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన సరస్వతి గురించి మర్చిపోకముందే అటువంటిదే మరో ఘటన శ్రీకాకుళం జిల్లాలో జరిగింది. వివాహమైన 20 రోజులకే భర్త మెడను దారుణంగా కోసిన నవ వధువు అతడిని చంపేందుకు ప్రయత్నించింది. బైక్‌పై వెళ్తున్న సమయంలో వెనక కూర్చున్న భార్య.. కత్తితో అతడి గొంతు కోసి చంపేందుకు యత్నించిన ఘటన సంతబొమ్మాళి మండలం కోటబొమ్మాళిలో జరిగింది. 

డీజే చప్పుడు.. నవ వధువును చంపేసింది!

Submitted by arun on Mon, 03/12/2018 - 12:33

ఒక్కోసారి ఆలోచన లేకుండా చేసే సంబరాలు.. జనాల ప్రాణం మీదికి వస్తుంటాయి. అది నిజమే అని.. ఇప్పుడు మరోసారి నిజమైంది. ఈ అనాలోచిత సంబరమే.. ఇప్పుడు ఓ పెళ్లి ఇంట్లో విషాదం మిగిల్చింది. తెలంగాణలోని సూర్యాపేటలో మొన్న రాత్రి ఓ వివాహం జరిగింది. అంతా బానే అయ్యింది. వధువు ప్రవేశం కోసం.. అమ్మాయిని తీసుకుని ఇంటికి అబ్బాయి వాళ్లు బయల్దేరారు.

వివాహ వేడుకల్లో కాల్పులు...వధువు మృతి

Submitted by arun on Mon, 02/12/2018 - 10:53

పంజాబ్‌ రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. పెళ్లి సంబరాల్లో ఒకరి అత్యుత్సాహం పెళ్లికూతురు ప్రాణాలను తీసింది. ఈ ఘటన హోషియార్ పూర్‌లో గత శనివారం చోటుచేసుకుంది.హోషియార్ పూర్ పట్టణానికి చెందిన సాక్షి అరోరా జలంధర్ కళాశాలలో ఎంబీఏ చదువుతోంది. సాక్షి అరోరా తండ్రి చరణ్ జిత్ అరోరా ఆమె పెళ్లి వైభవంగా చేసేందుకు డీజేతోపాటు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. పెళ్లి ఉత్సవంలో భాగంగా డీజేపార్టీ సాగుతుండగా వధువు భవనం పైన నిలబడి వేడుకను తిలకిస్తోంది. అంతలో పెళ్లికి వచ్చిన అతిధులు వేడుకల్లో భాగంగా అత్యుత్సాహంతో అశోఖ్ సేథి, ఖోస్లాలు తాము తెచ్చిన డబుల్ బ్యారెల్ రైఫిల్ తో గాల్లోకి కాల్పులు జరిపారు.