politics

చంద్రబాబు మగాడిలా ముందుకు రావాలి

Submitted by arun on Sat, 09/15/2018 - 16:05

తెలంగాణలో రాజకీయాలు చేయాలంటే చంద్రబాబు మగాడిలా ముందుకు రావాలి కానీ దొంగలా రావొద్దని టీఆర్‌ఎస్ నాయకుడు గట్టు రామచంద్రరావు సవాల్ చేశారు. చంద్రబాబు బతుకంతా దొంగ రాజకీయాలేనని...బాబు కుట్రలను ఎదుర్కోవడానికి తెలంగాణ సమాజమంతా రెడీగా ఉందన్నారు. చంద్రబాబు తెలివైన దొంగ అని  తెలంగాణను పాడు చేయడానికి బాబు టీడీపీ ఆఫీసులో డెన్‌ను ఏర్పాటు చేశాడని విమర్శించారు. అవినీతితో అడ్డదిడ్డంగా సంపాదించిన ధనంతో తెలంగాణను నాశనం చేయడానికి కుట్ర చేస్తున్నాడు. టీడీపీ కుట్రలను ఎలా విచ్ఛిన్నం చేయాలో టీఆర్‌ఎస్‌కు తెలుసన్నారు.

గడ్డం బాబుల కథ

Submitted by arun on Wed, 07/11/2018 - 16:17

రాజకీయాల్లో సవాలక్ష సవాళ్లుంటాయి. గెలుపు, ఓటములపైనా లేదా ప్రత్యర్ధులపై కక్ష తీర్చుకోడానికీ, ఇలా రకరకాల కారణాలతో  గెడ్డం పెంచుతుంటారు చాలా మంది. తమ లక్ష్యం నెరవేరే దాకా గెడ్డం తీయనని శపథాలు చేసే గడ్డం గ్యాంగులు పెరుగుతున్నాయ్ గెడ్డం బేస్డ్ కహానీలేంటి?

క్రీడలను స్వార్థానికి వాడుకుంటున్న పొలిటిషియన్లు

Submitted by arun on Thu, 04/12/2018 - 12:21

క్రీడలకు, రాజకీయాలతో సంబంధమే లేదు. దశాబ్దాలుగా క్రీడలు, రాజకీయాలు వేర్వేరు రంగాలు. ప్రస్తుతం రాజకీయ నేతలు క్రీడలను పావుగా వాడుకుని జనాన్ని రెచ్చగొడుతున్నారు. క్రీడలకు రాజకీయ రంగు పులిమి పబ్బం గడుపుకుంటున్నారు. రాజకీయ చదరంగం సామాన్యులు బలవుతున్నారు. క్రీడలకు అంతరాయం కలుగుతోంది.

Tags

నాదీ జనసేనే..కానీ..! : అల్లు అర్జున్

Submitted by arun on Mon, 04/09/2018 - 14:23

మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించినప్పడు అల్లు అర్జున్, రామ్ చరణ్ లు ఆ పార్టీ కోసం ప్రచారం నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే, ఆ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసిన తర్వాత నుంచి ఇప్పటి వరకు రాజకీయాల గురించి అల్లు అర్జున్ మాట్లాడలేదు. చిరంజీవిది ఏ పార్టీ అయితే తనదీ అదే పార్టీ అని చెబుతూ ఉన్నాడు. మరోవైపు పవన్ కల్యాణ్ జనసేన పార్టీని ప్రారంభించినప్పటి నుంచి ఇంత వరకు ఆ పార్టీపై బన్నీ స్పందించలేదు. తాజాగా ఓ ఇటర్వ్యూలో బన్నీకి దీనికి సంబంధించిన ప్రశ్న ఎదురైంది.

ఎన్టీఆర్ టీడీపీలోనే ఉండాలి: నటి మాధవీలత సంచలన వ్యాఖ్యలు

Submitted by arun on Sat, 03/31/2018 - 17:34

తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న లోపాలను ఎత్తిచూపుతూ వార్తల్లో నిలిచిన హీరోయిన్ మాధవీలత... మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ఈసారి జూనియర్ ఎన్టీఆర్ గురించి ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. జానాలకు మంచి చేయాలనే ఆలోచన ఎన్టీఆర్ కి తాతగారి నుంచి వచ్చి ఉండవచ్చని చెప్పింది. అతను తెలుగుదేశం పార్టీలోనే ఉండాలని తెలిపింది. ఎన్టీఆర్ చాలా మంచి వ్యక్తని, మంచి మాటకారి అని పేర్కొన్న మాధవి అతడిని ఎందుకు పక్కన పెట్టారో తనకు అర్థం కావడం లేదన్నారు. రాజకీయాల్లో యువత అవసరం చాలా ఉందని పేర్కొన్నారు. ఎన్టీఆర్ ఒకసారి మాట్లాడడం మొదలుపెడితే ఇక ఆపడని, ధారాళంగా మాట్లాడుతూనే ఉంటాడని మాధవి కితాబిచ్చారు.

రజనీకాంత్ రాజకీయాల్లో.. కుటుంబసభ్యులు!!

Submitted by arun on Fri, 03/16/2018 - 15:29

రాజకీయ పార్టీ పెడతా.. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని సీట్లలో పోటీ చేస్తా అని ప్రకటించి సంచలనానికి తెర తీసిన తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్.. అందుకు అవసరమైన కసరత్తును పూర్తి చేసేస్తున్నారు. మానసిక స్థైర్యం అందుకునేందుకు ప్రస్తుతం ఆధ్యాత్మిక పర్యటన చేస్తున్న రజనీ.. త్వరలోనే పూర్తి స్థాయి రాజకీయ నాయకుడిగా అవతరించేందుకు అడుగులు వేస్తున్నారు.

దిన‌క‌ర‌న్ కీల‌క నిర్ణ‌యం

Submitted by lakshman on Sun, 03/11/2018 - 12:48

అన్నాడీఎంకే పార్టీ నుంచి బహిష్కృత నేత టీటీవీ దినకరన్ కొత్త పార్టీ లాంఛ్‌ తేదీని ప్రకటించాడు. గ‌త కొంత కాలంగా దినకరన్‌ కొత్త పార్టీ దిశగా అడుగులు వేస్తున్నాడంటూ తమిళ రాజకీయాల్లో చ‌ర్చ‌లు చ‌ర్చ‌లుగా న‌డుస్తున్న విష‌యం తెలిసిందే.. ఈ క్ర‌మంలోనే ఈ నెల 15వ తేదీన కొత్త పార్టీని ప్ర‌క‌టించ‌నున్నారు.  ప్రకటనతోపాటు పార్టీ గుర్తును కూడా ప్రకటించబోతున్నారు. మధురైలో బహిరంగ సభ ఏర్పాటు ద్వారా తన పార్టీ సిద్ధాంతాలను దినకరన్‌ వెల్లడించనున్నారు. 

రాజ‌కీయాల్లోకి మ‌రోస్టార్ హీరో

Submitted by lakshman on Tue, 01/23/2018 - 08:38

దేశంలో వార‌స‌త్వ రాజ‌కీయాలు కొన‌సాగుతున్నాయి. తండ్రి రాజ‌కీయాల్లో క్రీయాశీల‌క పాత్ర‌పోషిస్తే ..కొడుకు కూడా తండ్రి వార‌స‌త్వంగా వ‌స్తున్న రాజ‌కీయాన్నే శాసించాలి. ప్ర‌స్తుతం మ‌న‌దేశం లో జ‌రుగుతున్న రాజ‌కీయా తంతు ఇదే. ఇదిలా ఉంచితే తమిళరాజకీయాల్లో కురువృద్దుడు డీఎంకే అధినేత కరుణానిధి చెరగని ముద్ర వేశారు అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒకటి కాదు రెండు కాదు  దాదాపు 60 ఏళ్లుగా రాజకీయ జీవితంలో ప్రయాణించారు కరుణానిధి. అలాంటి కరుడుగట్టిన రాజకీయ నేత అయిన కరుణానిధి ప్ర‌స్తుతం వార‌స‌త్వ రాజ‌కీయాల్నీ ప్రోత్స‌హించే ప‌నిలో బిజీగా ఉన్నారు. 

రెండు రాష్ట్రాల్లో కచ్చితంగా పోటీ చేస్తాం: పవన్

Submitted by arun on Mon, 01/22/2018 - 17:56

కరీంనగర్‌లో నిర్వ‌హించిన‌ ప్రెస్ మీట్ లో ప‌వ‌న్ మాట్లాడుతూ.... తెలంగాణ‌లో ఎటువంటి స‌మ‌స్య‌లు ఉన్నాయో తెలుసుకుంటానని చెప్పారు. తాను ఇరు రాష్ట్రాల్లో ఏదో ఒక సమస్యపై పోరాడుతూనే ఉంటాన‌ని చెప్పారు. అయితే, తెలంగాణకు సంబంధించినంత వరకు ఈ రాష్ట్రంలో ఆలోచించి అవగాహన తెచ్చుకున్న తరువాత ముందడుగు వేయాల్సి ఉంటుంద‌ని తెలిపారు. తెలంగాణ‌లోని స‌మ‌స్య‌ల‌పై త‌మ‌ బృందం అధ్య‌య‌నం చేస్తోందని చెప్పారు. రెండు రాష్ట్రాల్లో పోటీ చేస్తామని మరోసారి ప్రకటించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఎన్నికలకు ముందు ఎన్ని సీట్లలో పోటీ చేస్తామనేది స్పష్టత వస్తుందని చెప్పారు. కార్యకర్తల సూచన మేరకు.. ఎక్కడ బలం ఉంది..

చిరూ దెబ్బ‌ ర‌జ‌నీకి త‌గ‌ల‌కుండా ఉంటుందా

Submitted by arun on Fri, 01/05/2018 - 14:37

ర‌జ‌నీ రాజ‌కీయం పై భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. గ‌తంలో పార్టీ పెట్టిన మెగ‌స్టార్ చిరంజీవికి రాజ‌కీయం ఎలాంటి చేదు అనుభ‌వాల్ని మిగిల్చిందో అంద‌రికి తెలిసిన విష‌య‌మే. చిరంజీవికి  త‌గిలిన ఎదురు దెబ్బ‌లు ర‌జ‌నీకాంత్ కు త‌గ‌ల‌కుండా ఉంటాయా అనేది ప్ర‌శ్నార్ధ‌కంగా మారింది. ఎందుకంటే త‌మిళ‌నాట రాజ‌కీయం అంటే క‌త్తిమీద సామేన‌ని చెప్పుకోవాలి.