Sumitra Mahajan

కంటతడి పెట్టిన సుమిత్రా మహాజన్

Submitted by arun on Mon, 08/13/2018 - 13:35

లోక్‌సభ మాజీ స్పీకర్ సోమ్‌నాథ్ ఛటర్జీ(89) మృతిపట్ల లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఛటర్జీ తనకు పెద్దన్న లాంటి వ్యక్తి అని చెబుతూ సుమిత్రా మహాజన్ కన్నీరు పెట్టుకున్నారు. 1989లో తాను పార్లమెంటులో అడుగుపెట్టినప్పటి నుంచి ఆయన ఎంతగానో గుర్తుండిపోయారని అన్నారు. సభలో నిబంధనలు పాటించడం దగ్గర నుంచి, ఆయన లెవనెత్తే ప్రశ్నలు వరకూ తాను నిశితంగా పరిశీలించే దానిననీ, స్పీకర్‌గా ఆయన హయాం తనకు మార్గదర్శకమైందని సుమిత్రా మహాజన్ అన్నారు. తమ ఇద్దరి భావజాలాలు వేరు అయినప్పటికీ.. తాను ఛటర్జీని అన్నగా భావించే దానిని స్పీకర్ తెలిపారు. 
 

వైసీపీ ఫిరాయింపు ఎంపీలకు ఝలక్ .. వేటు వేసేందుకు సిద్ధమైన లోక్‌సభ స్పీకర్ ?

Submitted by arun on Wed, 06/06/2018 - 12:43

వైసీపీ నుంచి గెలిచి టీడీపీ, టీఆర్ఎస్‌లలోకి ఫిరాయించిన ఎంపీలపై చర్యలకు స్పీకర్ సుమిత్రా మహాజన్ సిద్ధమైనట్టు వార్తలు వినిపిస్తున్నాయి. స్పీకర్‌తో సమావేశమయిన వైసీపీ ఐదుగురు ఎంపీలు ఫిరాయింపుదార్ల అంశాన్ని లేవనెత్తారు. దీనిపై స్పందించిన స్పీకర్‌ 24 గంటల్లో నిర్ణయం తీసుకుంటానంటూ హామి ఇచ్చారు. 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచిన కొత్తపల్లి గీత, ఎస్పీవై రెడ్డి, బుట్టారేణుక టీడీపీలో చేరగా .. ఖమ్మం పార్లమెంట్ సభ్యుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి టీఆర్ఎస్‌లో చేరారు. స్పీకర్‌ నిర్ణయంతో ఈ నలుగురిపై అనర్హత వేటు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.  

బ్రేకింగ్ న్యూస్ః వైఎస్సార్‌సీపీ ఎంపీల రాజీనామాల ఆమోదం!

Submitted by arun on Wed, 06/06/2018 - 12:34

వైసీపీ ఎంపీలు చేసిన రాజీనామాల‌ను స్పీక‌ర్ సుమిత్రా మ‌హాజ‌న్ ఆమోదించారు. బుధ‌వారం ఉద‌యం 11 గంట‌ల‌కు స్పీక‌ర్ తో ఎంపీలు భేటీ అయ్యారు. రాజీనామాలు ఆమోదించాంటూ ఎంపీలు ప‌ట్టుబ‌ట్ట‌టంతో స్పీక‌ర్ రాజీనామాల‌ను ఆమోదించారు. స‌మావేశం త‌ర్వాత లోక్ స‌భ ఉన్న‌తాధికారుల‌తో స‌మావేశ‌మైన స్పీక‌ర్ త‌ర్వాత ఎంపీల రాజీనామాలు ఆమోదించాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు. అదే విష‌యాన్ని ఐదుగురు ఎంపీల‌కు స‌మాచారం అందించిన‌ట్లు స‌మాచారం. మొత్తానికి వైసీపీ ఎంపిలు ప‌ట్టుబ‌ట్టి త‌మ రాజీనామాల‌ను స్పీక‌ర్ ద‌గ్గ‌ర ఆమోదింప‌చేసుకున్నారు. ఇందుకు అవ‌స‌ర‌మైన నోటిఫికేష‌న్ ను ఈరోజు సాయంత్రం పార్ల‌మెంటు ఉన్న‌తాధికారులు ప్ర‌క‌టించ‌నున్నారు.

వైసీపీ ఎంపీల రాజీనామాలపై నిర్ణయం తీసుకోనున్న స్పీకర్

Submitted by arun on Wed, 06/06/2018 - 11:26

ఏపీలో మరోసారి రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఇవాళ వైసీపీ ఎంపీల రాజీనామాలపై లోక్‌సభ స్పీకర్ కీలక నిర్ణయం తీసుకోనున్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల చివరి రోజున.. వైసీపీకి చెందిన ఐదుగురు ఎంపీలు తమ రాజీనామా లేఖలను.. స్పీకర్‌కు అందజేశారు. అప్పటి నుంచి పెండింగ్ లో ఉన్న ఈ అంశంపై ఇవాళ స్పీకర్ సుమిత్రా మహాజన్  తన నిర్ణయాన్ని వెల్లడించనున్నారు. 

ఆగని ఆందోళనలు.. లోక్‌సభ వాయిదా

Submitted by arun on Tue, 03/20/2018 - 11:43

సేమ్ సీన్. నిన్నటికి ఇవాల్టికి తేడా ఏమీ లేదు. లోక్‌సభలో పరిస్థితి ఏమాత్రం మారలేదు. సభ ప్రారంభం కావడం అవి‌శ్వాస తీర్మానంపై చర్చ చేపట్టాలని టీడీపీ, వైసీపీ పట్టు పట్టడం పోడియంలో అన్నాడీఎంకే, టీఆర్ఎస్ ఎంపీలు ఆందోళనకు దిగడం సభ గంట పాటు వాయిదా పడడం ఇవాళ కూడా యాధావిధిగా జరిగిపోయింది.

లోక్‌సభ మార్చి 5కు వాయిదా

Submitted by arun on Fri, 02/09/2018 - 14:58

రాష్ట్రానికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ లోక్‌సభలో ఏపీ ఎంపీల ఆందోళన కొనసాగింది. విభజన చట్టంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలంటూ టీడీపీ, వైసీపీ ఎంపీలు స్పీకర్‌ పోడియం చుట్టుముట్టి నిరసన చేపట్టారు. పార్లమెంట్‌లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని నినాదాలు చేశారు. సభ్యులు శాంతించకపోవడంతో స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ సభను మార్చి 5కు వాయిదా వేశారు. విభజన హామీలు అమలు చేయాలంటూ ఐదో రోజున కూడా లోక్‌సభలో ఆంధ్రప్రదేశ్ ఎంపీలు తమ ఆందోళన కొనసాగించారు. సమావేశాలు ప్రారంభంకాగానే రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై టీడీపీ, వైసీపీ సభ్యులు ఆందోళనకు దిగి నినాదాలు చేశారు.  ఏపీకి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు.