ganta srinivasa rao

టీ కప్పులో తుపాను

Submitted by arun on Thu, 06/21/2018 - 17:55

మంత్రి గంటా శ్రీనివాసరావు అలక ఎపిసోడ్  టీ కప్పులో తుపానులా ముగిసింది. హోమ్ మినిస్టర్ చినరాజప్ప, వియ్యంకుడు మంత్రి నారాయణల  ప్రయత్నాలు ఫలించాయి. ముఖ్యమంత్రితో ఫోన్ లో మాట్లాడిన తరువాత గంటా ఎట్టకేలకు మెత్తబడ్డారు.  మూడు రోజుల నుంచి విధులకు దూరంగా ఉణ్న ఆయన సీఎం పర్యటనలో పాల్గొన్నారు.  

మంత్రి గంటా ఎపిసోడ్ మరో మలుపు

Submitted by arun on Thu, 06/21/2018 - 14:08

మంత్రి గంటా ఎపిసోడ్ మరో మలుపు తిరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోన్ సంభాషణ తర్వాత మంత్రి గంటా శ్రీనివాసరావు అలకవీడారు. ఎయిర్ పోర్ట్ లో సీఎం చంద్రబాబును రిసీవ్ చేసుకున్నారు. ఆయనతో పాటు పలు కార్యక్రమాలలో పాల్గొనున్నారు. విశాఖ టూర్ అనంతరం మరోమారు సీఎంతో భేటి కానున్నారు. 

అలకవీడని మంత్రి గంటా...ఫలించని చినరాజప్ప రాయబారం

Submitted by arun on Thu, 06/21/2018 - 11:18

అసంతృప్తితో రగిలిపోతున్న మంత్రి గంటాను బుజ్జగించేందుకు హోం మంత్రి  చిన్న రాజప్ప రాయబారం జరిపినా దిగిరాలేదు.  మంత్రితో సమావేశం సందర్భంగా  పార్టీలో తనకు ఎదురవుతున్న అనుభవాలను ఏకరువు పెట్టారు.  తనపై కొందరు కావాలనే కుట్రలు చేస్తున్నారని ఆరోపించిన గంటా ...  విశా‍ఖ భూముల విషయంలో తన ప్రమేయం లేదంటూ ఇచ్చిన నివేదికను ఎందుకు బయటపెట్టడం లేదని చినరాజప్పను ప్రశ్నించారు.  ఈ విషయంలో ఎలాంటి దురుద్దేశాలు లేవన్న చినరాజప్ప ... మీడియాలో వస్తున్న సర్వేలను పట్టించుకోవాల్సిన పని లేదంటూ బుజ్జగించారు. జరుగుతున్న పరిణామాలపై త్వరలోనే మీడయా సమావేశం నిర్వహిస్తానంటూ గంటా చెప్పడంతో ...

టీడీపీకి గంటా గుడ్‌బై ?

Submitted by arun on Thu, 06/21/2018 - 10:45

మంత్రి గంటా దారెటు? టీడీపీకి గండి కొట్టి... కొత్త పార్టీకి గంట మోగించేందుకు సిద్ధమవుతున్నారా? సీఎం విశాఖ పర్యటనకు వస్తున్నా... గంటా మాత్రం తన నివాసం నుంచి బయటకు రావడం లేదు. కేబినెట్‌ భేటీకి కూడా డుమ్మా కొట్టిన గంటా... మౌనానికి కారణమేంటి?

గంటాకు బుజ్జగింపులు.. రంగంలోకి చినరాజప్ప

Submitted by arun on Thu, 06/21/2018 - 10:06

పత్రికల్లో సర్వేలు రకరకాలు వస్తుంటాయి... అవి పట్టించుకోవాల్సిన అవసరం లేదని, మన పని మనం చేసుకుపోవాలని మంత్రి గంటా శ్రీనివాసరావుకు సూచించారు సీఎం చంద్రబాబు. ఇటీవల పత్రికల్లో వచ్చిన వార్తలతో తీవ్ర అసంతృప్తికి లోనైన గంటాకు సీఎం చంద్రబాబు ఫోన్ చేశారు. రాజకీయాల్లో ఉంటే, ఎన్నో విషయాలు చుట్టూ తిరుగుతూ ఉంటాయని, ఏవేవో సర్వేలు చేస్తుంటారని, అవన్నీ పట్టించుకుంటే, తాను సైతం ఒక్క పని కూడా చేయలేనని చెప్పారు. వీటిని ఫీడ్ బ్యాక్ గా తీసుకుని ముందడుగు వేయాలని గంటాకు సూచించిన చంద్రబాబు, అలా ముభావంగా ఉంటే ఎలాగని ప్రశ్నించారు.

కేబినెట్ సమావేశానికి మంత్రి గంటా గైర్హాజర్

Submitted by arun on Tue, 06/19/2018 - 16:03

కేబినెట్ సమావేశానికి మంత్రి గంటా శ్రీనివాసరావు డుమ్మా కొట్టారు. భీమిలిలో ఈ సారి ఓడిపోవడం ఖాయమంటూ వార్తలు వస్తుండటంతో కినుక వహించిన గంటా విశాఖలో ఇంటికే పరిమితమయ్యారు. జ్వరం కారణంగానే ఆయన కేబినెట్ సమావేశానికి హాజరుకాలేదని ఆయన వర్గీయులు చెబుతున్నారు. సీఎంకు కూడా ముందుగానే సమాచారం అందించినట్టు పేర్కొంటున్నారు. 

మంత్రి గంటా మాతో టచ్‌లో ఉన్నారు: విజయసాయి రెడ్డి

Submitted by arun on Wed, 05/23/2018 - 15:40

ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గంటాను గోడ మీద పిల్లిలా పోల్చారు. గంటాకు డబ్బే ప్రధానమని, ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనుకుంటే ఆ పార్టీలోకి జంప్ అయిపోతారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయనకు డబ్బే ప్రధానమని, నీతి నియమాలు లేని గంటా కనీసం విమర్శించేందుకు కూడా అర్హుడు కారని అన్నారు. గతంలో ఎన్నో పార్టీలు మారిన గంటా ఇప్పుడు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి మారడానికి సంప్రదింపులు జరుపుతున్నట్లు వెల్లడించారు. నీతి లేని గంటాకు తమను విమర్శించే అర్హత లేదని అన్నారు.

మంత్రి గంటా రూట్ మారుతుందా...వచ్చే ఎన్నికల్లో అక్కడి నుంచే పోటీ చేస్తారా ?

Submitted by arun on Sat, 04/14/2018 - 17:23

ఏపీ పాలిటిక్స్‌లో గంటా శ్రీనివాసరావు రూటే సెపరేటు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా మంత్రిగా ఉండటం ఆయనకే చెల్లింది. ఇప్పటికే విశాఖలో 4 నియోజకవర్గాలు మారిన గంటా ఇప్పుడు పక్క జిల్లాపై ఫోకస్ పెంచారట. ఇక్కడి నుంచి ఫోకస్ అక్కడికి ఎందుకు మార్చినట్టు.?

ఏపీలో భారతీయ జగన్‌సేన పార్టీ

Submitted by lakshman on Sun, 03/18/2018 - 19:34

జ‌గ‌న్ - ప‌వ‌న్ - బీజేపీల పై ఏపీ మంత్రి గంటా శ్రీనివాస‌రావు విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపించారు. గుంటూరులో జ‌న‌సేన ఆవిర్భావ స‌భ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఆ స‌భ‌లో అప్ప‌టి వ‌ర‌కు టీడీపీ ఉన్న జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ఏపీ ప్ర‌భుత్వంపై మండిప‌డ్డారు. ఏపీలో అవినీతి రాజ్య‌మేలుతుంద‌ని , అధికారంలో వ‌చ్చిన నాలుగేళ్ల‌లో టీడీపీ ఎన్ని అభివృద్ధి ప‌నులు చేసిందో చూపించాల‌ని అన్నారు. అంతేకాదు రాష్ట్రంలో మ‌హిళ‌లకు ర‌క్ష‌ణ లేకుండా పోయింద‌ని సూచించారు. ఇసుక మాఫియా ఆట‌క‌ట్టించిన మ‌హిళా అధికారిణిపై దాడుల‌కు దిగడం ఎంత‌వ‌ర‌కు స‌మంజ‌సం అని ప్ర‌శ్నించారు.

అవసరమైతే పొత్తు వదులుకునేందుకు సిద్ధం: గంటా

Submitted by arun on Thu, 02/08/2018 - 16:44

రాష్ట్ర ప్రయోజనాల కోసం వీలైతే బీజేపీతో పొత్తును వదులుకుంటామని ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీపై కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఆయన ఆగ్రహం చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఎంపీల పోరాటానికి మద్దతుగా రాష్ట్రంలో నిరసనలు చేపట్టామని తెలిపారు. బంద్‌ కారణంగా ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో ముందుగానే పాఠశాలలకు సెలవు ప్రకటించామని వివరించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం అవసరమైతే భాజపాతో పొత్తు వదులుకునేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం దిగి రాకపోతే ఎంతటి పొరాటానికైనా సిద్ధమని విలేకరుల సమావేశంలో చెప్పారు.