Kolkata

టీచర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు...ఆందోళనకు దిగిన బాధిత కుటుంబంపై పోలీస్ జులుం

Submitted by arun on Tue, 10/09/2018 - 14:30

కోల్‌కత్తా లో ఓ స్కూల్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తమ కుమార్తెపై స్కూల్ టీచర్  లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపిస్తూ విద్యార్థిని తల్లిదండ్రులు స్కూల్‌పై  దాడికిపాల్పడ్డారు. బాధితురాలి కుటుంబసభ్యులతో పాటు స్థానికులు కూడా ఆందోళనకు దిగారు. స్కూల్ యాజమాన్యం పోలీసుల సాయంతో తల్లిదండ్రులను అడ్డుకున్నారు.  అయితే, పోలీసులు విచక్షణా రహితంగా లాఠీచార్జీ చేశారు. తల్లిదండ్రులను చితకబాదారు. కనికరం లేకుండా ప్రవర్తించారు. అయినా బాధితులు వెనక్కి తగ్గలేదు. బాధితురాలిపై లైంగిక వేధింపులకు పాల్పడిన టీచర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

కోల్‌కతాలో బాంబు పేలుడు కలకలం

Submitted by arun on Tue, 10/02/2018 - 15:34

కోల్‌కతా డమ్‌డమ్‌ ప్రాంతంలో బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 8 ఏళ్ల బాలుడు మృతిచెందగా 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. నగర్ బజార్ దగ్గర్లోని కాజీపర ప్రాంతంలో ఈ పేలుడు ఘటన జరిగింది. పేలుడు తీవ్రత ఎక్కువగా ఉందని పోలీసులు చెబుతున్నారు. పథకం ప్రకారమే బాంబు అమర్చి పేల్చారని పోలీసులు చెప్పారు. టైమర్ ద్వారా బాంబు పేల్చినట్లు పోలీసులు వివరించారు. ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో భయబ్రాంతులకు గురైన ప్రజలు పరుగులు పెట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. బాంబు నిర్వీర్య బృందాలు ఆ ప్రాంతాన్నంతా జల్లెడ పడుతున్నాయి.

క‌ట్నం తేలేద‌ని భార్య కిడ్నీ దొంగిలించాడు!

Submitted by arun on Thu, 02/08/2018 - 13:21

పుట్టింటి నుంచి అడిగినంత క‌ట్నం తేలేద‌ని భార్య కిడ్నీనే దొంగిలించాడు కోల్‌క‌తాకు చెందిన ఓ ప్ర‌బుద్ధుడు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్‌లో చోటుచేసుకున్నది. ఈ కేసులో బాధితురాలి భర్తతో పాటు అతని సోదరున్ని అరెస్టు చేశారు. బాధితురాలు రీటా సర్కార్‌కు రెండేళ్ల క్రితం తీవ్రమైన కడుపునొప్పి వచ్చింది. దాంతో ఆమెను హాస్పటల్‌కు తరలించారు. ఆ తర్వాత ఆమెకు అపెండిక్స్ సర్జరీ చేశారు. అయితే 2017లో మళ్లీ ఆమెకు ఉదరసంబంధమైన నొప్పి వచ్చింది. దీంతో ఆమె మళ్లీ హాస్పటల్‌కు వెళ్లింది. ఈసారి ఆమెకు స్కాన్ చేశారు. దాంట్లో ఆమె కుడి కిడ్నీ లేదని డాక్టర్లు గుర్తించారు. ఆ విషయం తెలియడంతో బాధితురాలు రీటా షాక్ అయ్యింది.