YSR Congress

జగన్‌, పవన్‌ ఒక్కటవుతున్నరా...సైకిల్‌కు పంక్చర్‌ పెట్టేస్తారా?

Submitted by arun on Wed, 04/25/2018 - 13:06

2019 ఎన్నికల్లో పవన్‌ కల్యాణ్ వ్యూహామేంటీ ? ఆగష్ట్‌ 15న మేనిఫెస్టోను ప్రకటిస్తానన్న జనసేనాని ఆ దిశగా అడుగులు వేస్తున్నారా ? మేనిఫెస్టో ఎలా ఉంటుంది ? ఏపీ రాజకీయాల్లో పవన్‌ కార్యాచరణపై చర్చ జరుగుతోంది.

అవిశ్వాసమే అస్త్రంగా దూసుకువెళ్తున్న వైసీపీ

Submitted by arun on Mon, 03/05/2018 - 09:39

అయితే ప్రత్యేక హోదా, లేదంటే ప్రత్యేక ప్యాకేజీ... అసలు ప్రత్యేక హోదాని కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఇవ్వదు, పోనీ ప్రత్యేక ప్యాకేజీకి అంతా కలిసి ఎందుకు పట్టుబట్టడం లేదంటూ ఏపీ ప్రభుత్వం టీడీపీపై విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే ప్రత్యేక హోదా వస్తేనే రాష్ట్రానికి భవిష్యత్ ఉంటుందని, హోదా వల్ల రాయితీలు వస్తాయని వైసీపీ నేతలు చెప్తున్నారు. మరోవైపు వైసీపీ రాజకీయ లబ్ది కోసమే ప్రత్యేక హోదా మాటెత్తుతుందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఏదెలా ఉన్నా... నేటి నుంచి జరగనున్న మలివిడత పార్లమెంట్‌ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వంపై యుద్ధానికి సిద్ధమవుతున్నారు.

టీడీపీ ఎంపీలకు తలంటిన స్పీకర్‌

Submitted by arun on Thu, 02/08/2018 - 12:26

లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రామహాజన్‌ తెలుగుదేశం సభ్యులకు తలంటింది. టీడీపీల నినాదాలు అభ్యంతరకంగా ఉన్నాయన్న స్పీకర్‌... ఇలా నినదిస్తూ ఇతర సభ్యులను ఇబ్బందులకు గురిచేయవద్దని మందలించింది. వెనక్కి వెళ్లి.. ఎవరి సీట్లో వారు కూర్చోవాలని సూచించినా... టీడీపీ సభ్యులు పట్టించుకోలేదు. సీట్లో కూర్చునేందుకు ససేమిరా అన్నారు. ఇలా అయితే చర్యలు తప్పవంటూ స్పీకర్‌ కాస్త ఘాటుగా హెచ్చరించారు. చిత్తూరు ఎంపీ శివప్రసాద్‌ తప్పెటగూళ్ల వేషధారణలో కంజరతో సభలోని వచ్చి దాన్ని వాయించేందుకు ప్రయత్నించడం గందరగోళానికి దారితీసింది. పార్లమెంటు సిబ్బంది ఆయన్ని వారించి బయటకు పంపేశారు.