somu veeraju

సోము వీర్రాజుకు అమిత్‌ షా సీరియస్‌ వార్నింగ్‌

Submitted by arun on Thu, 02/08/2018 - 10:46

బీజేపీ నేత సోము వీర్రాజుకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా చీవాట్లు పెట్టినట్లు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలుగుదేశం పార్టీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన భాజపా ఎమ్మెల్సీ సోము వీర్రాజుపై భాజపా అధిష్ఠానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మిత్రపక్షంపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడే అధికారం నీకెవరు ఇచ్చారని భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా నిలదీశారు. మిత్రధర్మం, పొత్తులపై ఎందుకు మాట్లాడుతున్నావంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యక్తిగత అజెండాతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దని హెచ్చరించారు. మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే కఠినచర్యలకు వెనుకాడబోమని అన్నట్లు సమాచారం.