soap

షేక్‌హ్యాండ్‌తో ముప్పే

Submitted by lakshman on Sat, 09/16/2017 - 20:51

కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలేతు గౌరీచ.. అని ఊరికే అనలేదు మన పెద్దలు. సకల దేవతలు మన అరచేతిలోనే మనకు దర్శనమిస్తారు, అది ఎప్పుడంటే మనం పరిశుభ్రంగా ఉన్నప్పుడే. కానీ.. ప్రపంచంలో 95 శాతం మందికి రాని పని ఏమిటో మీకు తెలుసా ? చేతులు కడుక్కోవటం. నమ్మలేని నిత్య సత్యం ఇది. ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారికంగా తేల్చిన లెక్క ఇది. రోగాలు శరవేగంగా వ్యాపించడానికి, అంటువ్యాధులు చెలరేగడానికి కారణం కూడా చేతులు శుభ్రంగా లేకపోవడమేనట. ప్రపంచంలో 20 లక్షల మంది చిన్నారులకు వారి తల్లిదండ్రుల చేతులు పట్టుకోవడంద్వారా పలు వ్యాధులు సోకేలా చేస్తోంది.