Loksabha

కంటతడి పెట్టిన సుమిత్రా మహాజన్

Submitted by arun on Mon, 08/13/2018 - 13:35

లోక్‌సభ మాజీ స్పీకర్ సోమ్‌నాథ్ ఛటర్జీ(89) మృతిపట్ల లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఛటర్జీ తనకు పెద్దన్న లాంటి వ్యక్తి అని చెబుతూ సుమిత్రా మహాజన్ కన్నీరు పెట్టుకున్నారు. 1989లో తాను పార్లమెంటులో అడుగుపెట్టినప్పటి నుంచి ఆయన ఎంతగానో గుర్తుండిపోయారని అన్నారు. సభలో నిబంధనలు పాటించడం దగ్గర నుంచి, ఆయన లెవనెత్తే ప్రశ్నలు వరకూ తాను నిశితంగా పరిశీలించే దానిననీ, స్పీకర్‌గా ఆయన హయాం తనకు మార్గదర్శకమైందని సుమిత్రా మహాజన్ అన్నారు. తమ ఇద్దరి భావజాలాలు వేరు అయినప్పటికీ.. తాను ఛటర్జీని అన్నగా భావించే దానిని స్పీకర్ తెలిపారు. 
 

వెనక్కు తగ్గేది లేదు...

Submitted by arun on Tue, 05/29/2018 - 12:54

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ను కలువనున్నారు. మంగళవారం సాయంత్రం 5 గంటలకు స్పీకర్‌ను కలిసి తమ రాజీనామాలను తక్షణమే ఆమోదించాలని కోరనున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కంటే పదవులు ముఖ్యం కాదని వైఎస్సార్‌సీపీ ఎంపీలు ఇప్పటికే స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా సాధన పోరాటంలో భాగంగా ఏప్రిల్‌ 6న స్పీకర్‌ ఫార్మాట్‌లో ఎంపీలు రాజీనామాలు చేశారు.

లోక్‌సభలో మళ్లీ అదే సీన్‌.. నిమిషం లోపే వాయిదా

Submitted by arun on Wed, 03/21/2018 - 11:52

లోక్‌‌సభ ప్రారంభమైన సరిగ్గా 30 సెకన్లకే లోక్‌సభ వాయిదా పడింది. లోక్‌సభలో నాల్గోసారి అవిశ్వాసంపై టీడీపీ, వైసీపీ నోటీసులిచ్చింది. సభ సజావుగా లేదంటూ ఇప్పటికే 3సార్లు అవిశ్వాసంపై స్పీకర్ చర్చ చేపట్లేదు. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన ఏపీ ఎంపీలు ఆందోళనకు దిగారు. ఇదిలా ఉంటే ఇవాళ టీఆర్ఎస్, అన్నాడీఎంకే ఎంపీల ఆందోళనలు కొనసాగించారు. పదే పదే సభ్యులకు స్పీకర్ చెప్పినప్పటికీ వారు మాత్రం మరింత ఆందోళన ఉదృతం చేయడంతో చేసేదేమీలేక సుమిత్రా మహాజన్ మధ్యాహ్నం 12గంటలకు సభ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

అవిశ్వాస నోటీసులు తిరస్కరించిన స్పీకర్‌

Submitted by arun on Mon, 03/19/2018 - 12:36

కేంద్రంపై తెదేపా, వైకాపా ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాలను లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ తిరస్కరించారు.  సభ సజావుగా సాగనందువల్లే నోటీసులు తిరస్కరిస్తున్నట్లు స్పీకర్‌ స్పష్టం చేశారు. సభ నిర్వహణ సక్రమంగా సాగకపోతే నోటీసులు స్వీకరించలేమన్నారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు లోక్‌సభ ప్రారంభం కాగానే తెరాస, అన్నాడీఎంకే సభ్యులు ఆందోళన చేయడంతో సభ 12 గంటలకు వాయిదా పడింది. గంట తర్వాత సభ ప్రారంభమయ్యాకా అదే పరిస్థితి నెలకొంది. కావేరీ బోర్డు ఏర్పాటు చేయాలని అన్నాడీఎంకే, రిజర్వేషన్ల పెంపు అంశంపై తెరాస సభ్యులు స్పీకర్‌ వెల్‌లోకి ప్రవేశించి నినాదాలు చేశారు.

లోక్‌‌సభలో మండే టెన్షన్..కాకపుట్టిస్తున్న అవిశ్వాస అస్త్రం

Submitted by arun on Sat, 03/17/2018 - 15:40

కేంద్రంపై ఏపీలోని అధికార , టీడీపీ, విపక్ష వైసీపీ సంధించిన అవి‌‌శ్వాస అస్త్రం దేశ రాజకీయాల్లో సెగలు రేపుతోంది. సోమవారం మరోసారి లోక్‌సభ ముందుకు అవి‌శ్వాస తీర్మానం రానుండడంతో కాకపుట్టిస్తోంది. దీంతో సోమవారం సభలో ఏం జరుగుతుందనే టెన్షన్ మొదలైంది. అవిశ్వాసాన్ని స్పీకర్ పరిగణనలోకి తీసుకుంటారా..? ఆ రోజైనా సభ ఆర్డర్‌లో ఉంటుందా..? అదే రోజు ప్రత్యేక హోదా, విభజన హామీలపై చర్చ జరుగుతుందా..? మోడీ సర్కారుపై పెట్టిన అవిశ్వాసంపై ఓటింగ్ జరుగుతుందా..? అవిశ్వాసానికి కలిసొచ్చే కొత్త పార్టీలు ఏవనే చర్చ వాడివేడిగా జరుగుతోంది. 

లోక్‌సభలో ఆసక్తికర సన్నివేశం..టీడీపీ ఎంపీలతో సోనియా మంతనాలు!

Submitted by arun on Thu, 02/08/2018 - 12:39

విభజన హామీలను అమలు చేయాలంటూ లోక్‌సభలో టీడీపీ ఎంపీల ఆందోళన కొనసాగుతోంది. ఈ క్రమంలో గురువారం ఉదయం లోక్‌సభలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. మరోవైపు సభలోనే ఉన్న కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఆ పార్టీ సభాపక్ష ఉపనేత జ్యోతిరాదిత్యతో టీడీపీ ఎంపీలు కేశినేని నాని, తోట నర్సింహం, రామ్మోహన్‌నాయుడు మంతనాలు జరిపారు. ఏపీలో పరిస్థితిని సోనియాకు ఎంపీలు వివరించారు. తమకు మద్దతు ఇవ్వాలని ఈ సందర్భంగా వారిని కోరారు.
 

కేంద్రం ఇస్తున్న నిధులు ‘బాహుబలి’ కలెక్షన్స్ కంటే తక్కువ

Submitted by arun on Thu, 02/08/2018 - 11:15

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్రం ఇస్తున్న నిధులు ‘బాహుబలి’ కలెక్షన్స్ కంటే తక్కువగా ఉన్నాయంటూ ఎద్దేవా చేశారు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్. బడ్జెట్ కేటాయింపుల్లో ఏపీకి అన్యాయం చేశారంటూ బుధవారం నాడు లోక్‌సభలో కేంద్రాన్ని నిలదీశారు గుంటూరు ఎంపీ జయదేవ్. ఎన్టీఏలో భాగస్వామ్యంగా ఉన్న టీడీపీ.. ఆంధ్రప్రదేశ్ అధికారం చేపట్టి నాలుగేళ్లు పూర్తైందని విభజన సమస్యతో ఆర్థికంగా ఏపీ నలిగిపోయిందన్నారు.

పార్లమెంట్‌లో చెలరేగిపోయిన ప్రధాని మోడీ

Submitted by arun on Wed, 02/07/2018 - 14:13

పార్లమెంట్‌లో ప్రధాని మోడీ చెలరేగిపోయారు. దేశంలో ఇన్ని సమస్యలకు కారణం కాంగ్రెస్సే అంటూ ఆ పార్టీని తూర్పారపట్టారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రసంగించిన మోడీ కాంగ్రెస్‌కు ప్రజాస్వామ్యంపై మాట్లాడే అర్హత లేదంటూ మండిపడ్డారు. తెలుగువారిని తీవ్రంగా అవమానించింది కాంగ్రెస్సే అంటూ దుయ్యాబట్టారు. ఆ అవమానాల నుంచే తెలుగువారి ఆత్మగౌరవం కోసం ఎన్టీఆర్‌ తెలుగుదేశం పార్టీకి జీవం పోశారని పార్లమెంట్‌లో ప్రస్తావించారు.