Swami Paripoornananda

నేను ఢిల్లీ నుంచి వచ్చా.. త్వరలో ఓ గొప్ప వార్త వినబోతున్నారు

Submitted by arun on Mon, 09/24/2018 - 11:29

తెలంగాణలో సీఎం అభ్యర్థిని ప్రకటించే యోచనలో ఉంది బీజేపీ. ముందుస్తు ఎన్నికల రేసులో స్పీడు పెంచుతున్న బీజేపీ.. సీఎం అభ్యర్థిని ప్రకటించే దిశగా అడుగులు వేస్తోంది. స్వామి పరిపూర్ణానంద లేక రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతను సీఎం అభ్యర్థిగా ప్రకటించేందుకు ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ నేతలతో చర్చించిన బీజేపీ అధిష్టానం చర్చించినట్టు వాదనలు వినిపిస్తున్నాయి. మరోవైపు, స్వామి పరిపూర్ణానంద ఇప్పటికే ఢిల్లీ వెళ్లివచ్చారు. దీంతో స్వామీజినే సీఎం రేసులో ముందున్నారనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఛార్మినార్ లో భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న పరిపూర్ణానంద స్వామి..

తెలంగాణ యోగి...ఎంపీగా రంగంలోకి?

Submitted by arun on Fri, 07/13/2018 - 16:31

తెలంగాణ రాజకీయాలను బిజెపి కొత్త మలుపు తిప్పు తోందా? ఉత్తరాదిన హిట్ అయిన స్వామీజీల ఫార్ములాను దక్షిణాదినా వర్కవుట్ చేయాలని ప్రయత్నిస్తోందా? శ్రీ పీఠాధిపతి పరిపూర్ణానంద ఎన్నికల రాజకీయాల్లోకి దిగుతారా?

ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నగరబహిష్కరణ

Submitted by arun on Fri, 07/13/2018 - 10:50

ప్రముఖ అధ్యాత్మికవేత్తకి "తప్పని",

నగర బహిష్కరణ, ఏమిటి తప్పుఅని,

కొన్ని వర్గాలు, లేదు చేసింది ఒప్పని,

హైద్రాబాద్ శాంతి భద్రతకి ముప్పని,

కఠినంగా ఉంటామని చెప్పెను సర్"కారు". శ్రీ కో

స్వామి పరిపూర్ణానంద బహిష్కరణలో కొత్త ట్విస్ట్

Submitted by arun on Thu, 07/12/2018 - 13:33

శ్రీ పీఠం పీఠాధిపతి స్వామి పరిపూర్ణానంద హైరదాబాద్ నగర బహిష్కరణ ఎపిసోడ్‌లో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు బయటికొస్తున్నాయి. తాజాగా పరిపూర్ణానంద స్వామి మధురపూడి ఎయిర్‌పోర్ట్ నుంచి హైదరాబాద్‌కు టికెట్ బుక్ చేసుకున్నారు. తనపై ఉన్న బహిష్కరణ హైదరాబాద్ వరకే పరిమితమని కొత్త లాజిక్ బయటకి తీశారు. ఇప్పుడు తాను సైబరాబాద్ పరిధిలో ఉండేందుకు వెళ్తున్నానని సమాచారం ఇచ్చారు. దీంతో అలర్టైన సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ పోలీసులు వెంటనే తమ తమ కమిషనరేట్ల పరిధిలో స్వామీజీపై 6 నెలల పాటు బహిష్కరణ ఉత్తర్వులు జారీ చేశారు. దీనికి సంబంధించిన నోటీసులు తీసుకొని హైదరాబాద్ నుంచి పోలీసులు కాకినాడకు బయల్దేరినట్లు తెలుస్తోంది.

స్వామి పరిపూర్ణానంద తరలింపులో కొత్త ట్విస్ట్

Submitted by arun on Wed, 07/11/2018 - 12:10

స్వామి పరిపూర్ణానంద తరలింపులో కొత్త ట్విస్ట్ నెలకొంది. కాకినాడకు వెళ్లేందుకు పరిపూర్ణానంద నిరాకరిస్తున్నారు. తెలంగాణను విడిచి వెళ్లే ప్రసక్తే లేదంటున్నారు. తనపై ఉన్న నగర బహిష్కరణ నిషేధాజ్ఞలు హైదరాబాద్ వరకే ఉన్నాయని తాను తెలంగాణలోనే ఉంటానని స్వామి పరిపూర్ణానంద పోలీసులకు తెగేసి చెప్తున్నారు. ఉన్నఫలంగా ఖమ్మం జిల్లా అశ్వరావుపేటలో పోలీసుల వాహనం దిగిపోయారు స్వామి పరిపూర్ణానంద. దీంతో.. పోలీసులకు ఏం చేయాలో తోచడం లేదు.
 

బాబు గోగినేని ఉన్మాది అయితే కత్తి మహేష్‌ దానికి పరాకాష్ట: పరిపూర్ణానంద స్వామి

Submitted by arun on Mon, 07/02/2018 - 16:12

శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యాలు చేసిన సినీ విశ్లేషకుడు కత్తి మహేష్‌పై పరిపూర్ణానంద స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవ్వరినో ఒకరిని వివాదాల్లోకి లాగి, సంచలనాలు చేస్తూ బతికే వారు ఎక్కువ అయ్యారని, అందులో బాబు గోకినేని ఉన్మాది అయితే కత్తి మహేష్‌ దానికి పరాకాష్ఠని అన్నారు. రామాయణాన్ని, మహాభారతాన్ని ఒక కథ అని వ్యాఖ్యనించడం బాధాకరమన్నారు. కత్తి మహేష్ ఎవరికో అమ్ముడుపోయి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తెున్నారని అన్నారు. హిందువు కాని వ్యక్తి పవిత్ర హిందూ గ్రంధాలపై ఎలా విమర్శలు చేస్తాడని పరిపూర్ణానంద స్వామి ప్రశ్నించారు.

తెలంగాణకు మరో యోగి... ?

Submitted by arun on Wed, 02/07/2018 - 10:44

తెలంగాణ బీజేపీలోకి మరో యోగి ఆదిత్యనాథ్ రాబోతున్నారా? ఉత్తర్ ప్రదేశ్ రాజకీయాల్లో యోగి పాత్ర విజయవంతం కావడంతో కాషాయదళం ఇక్కడ కాషాయధారిని రంగంలో దించాలని యోచిస్తుందా..? దేశవ్యాప్తంగా యోగి ఆదిత్యనాథ్ ప్రభావం కనిపిస్తుండడంతో దక్షిణాదిలో కూడా ఇదే ప్రయోగం చేయాలని పార్టీ భావిస్తోందా..? తాజా పరిణామాలు గమనిస్తే అవుననే అనిపిస్తుంది.