Kangana Ranaut

శ్రీదేవి కోసం కంగనా ఏం చేసిందో తెలుసా?

Submitted by arun on Mon, 03/05/2018 - 17:51

అతిలోక సుందరి శ్రీదేవిని ఇష్టపడని వారు.. ఆరాధించని వారు.. ఆమె చనిపోయిందంటే ఏదో కోల్పోయామని బాధ పడేవారు ఎవరు కాదు చెప్పండి? అందులో ఒకరే.. మన వెర్సటైల్ హీరోయిన్ కంగనా రనౌత్. ఆమె కూడా చిన్నపుడు శ్రీదేవిని విపరీతంగా ఆరాధించేదట. అప్పుడు ఓ ట్యూబ్ లైట్ ప్రకటనలో వచ్చే శ్రీదేవిని చూసేందు కోసం కంగనా చాలా ఆరాటపడేదట.

వివాదంలో క్రిష్‌ చిత్రం!

Submitted by arun on Tue, 02/06/2018 - 16:05

బాలీవుడ్‌లో సంచలనం సృష్టించిన పద్మావత్‌ వివాదం మరువక ముందే మరో చారిత్రక చిత్రం వివాదంలో ఇరుక్కుంది. వివాదాస్పద వ్యాఖ్యలతో ఎప్పుడు వార్తల్లో ఉండే బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్‌ లీడ్‌ రోల్‌లో టాలీవుడ్ దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తున్న సినిమా మణికర్ణిక. వీరనారి ఝాన్సీ లక్ష్మీభాయ్‌ జీవితకథ ఆధారంగా భారీ బడ్జెట్‌తో ఈ చారిత్రక చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి ‘బాహుబలి’ రచయిత విజయేంద్ర ప్రసాద్‌ కథ అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని హిందీతో పాటు దక్షిణాది భాషల్లోనూ విడుదల చేయనున్నారు. అయితే, ఈ సినిమాను రాజస్థాన్‌ సర్వ బ్రాహ్మణ్‌  మహాసభ (ఎస్‌బీఎం) వ్యతిరేకిస్తోంది.