Dressing Room

పాక్‌ డ్రెస్సింగ్‌ రూమ్‌ వార్తలపై ద్రవిడ్‌ క్లారిటీ

Submitted by arun on Tue, 02/06/2018 - 12:26

తాను పాక్‌ ఆటగాళ్ల డ్రస్సింగ్‌ రూమ్‌కి వెళ్లినట్లు వస్తున్న వార్తలను అండర్‌-19 భారత క్రికెట్‌ జట్టు కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ కొట్టి పారేశాడు. న్యూజిలాండ్‌లో అండర్‌-19 ప్రపంచకప్‌ గెలిచిన భారత జట్టు సోమవారం ముంబయి చేరుకుంది. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాహుల్‌ ద్రవిడ్‌, జట్టు సారథి పృథ్వీ షా మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. అందులో భాగంగా ఒక విలేకరి టోర్నీలో భాగంగా పాకిస్థాన్‌తో సెమీఫైనల్‌ అనంతరం మీరు ఆ జట్టు డ్రస్సింగ్‌ రూమ్‌లోకి వెళ్లి ఆటగాళ్లు, టీమ్‌ మేనేజర్‌తో మాట్లాడినట్లు వార్తలు వస్తున్నాయి. ఎందుకు వెళ్లారు?