Social Service

వినికిడి లోపం ఉన్న పిల్ల‌ల‌కి స‌మంత చేయూత‌

Submitted by arun on Sat, 07/14/2018 - 12:17

సమంత ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే సమాజ సేవ కూడా చేస్తున్నారు. ప్రత్యూష ఫౌండేషన్ పేరిట స్వచ్ఛంద సంస్థను ఏర్పాటుచేసి ఎందరికో చేయూతను అందిస్తున్నారు. ప్రాణాపాయంలో ఉన్న మహిళలు, చిన్నారులను ఆదుకుంటున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రముఖ ఆస్పత్రులతో కలిసి వైద్యం చేయించుకోలేని స్థితిలో ఉన్న చిన్నారుకుల ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నారు. ప్రాణాంతక వ్యాధులతో బాధపడే మహిళలు, చిన్నారులకు వైద్య సేవలు అందించడమే ధ్యేయంగా పనిచేస్తున్నారు. దీనిలో భాగంగా తాజాగా ఫోనాక్ అనే సంస్థ ద్వారా వినికిడి లోపంతో బాధ‌ప‌డుతున్న ప‌ది మంది చిన్నారుల‌కి వినికిడి యంత్రాలు అందించారు.

పోలీసోడు కాదు పోలీస్

Submitted by arun on Tue, 02/06/2018 - 11:16

పల్లెల్లో పోలీసులంటే సహజంగానే భయం ఉంటుంది. వారు ఊళ్లొకి వచ్చారంటే ఆరోజు ఎవరో ఒకరికి మూడిందనే భావన ప్రజల్లో స్థిరపడింది. ఇప్పుడు ఆ పరిస్థితి మారుతోంది. పోలీసులంటే కాఠినత్వమే కాదు.. మానవీయతకు మారుపేరు కూడా అని రుజువు చేస్తున్నాడు జోగులాంభ గద్వాల జిల్లాకు చెందిన ఓ కానిస్టేబుల్‍. ప్రజలతో మమేకమవుతూ పల్లెల్లో సమస్యల పరిష్కారానికి కూడా కృషిచేస్తున్నాడు.