venkatesh

గురు సిన్మాలో ఎన్నో గుర్తులు

Submitted by arun on Mon, 09/24/2018 - 13:39

గురు సిన్మాలో ఎన్నో గుర్తులు,

నిజమైన ఆటగాల్లే నటులు,

జాతీయ స్థాయి బాక్సర్లు,

హీరో వెంకటేష్ మొదటి పాట. శ్రీ.కో. 

వెంకటేష్ కూతురు ప్రేమ పెళ్లి చేసుకోబోతోందా!

Submitted by arun on Sat, 09/22/2018 - 14:55

టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ ఇంట త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయి అని సమాచారం. వెంకటేష్ కుమార్తె ఆశ్రిత వివాహం త్వరలోనే జరగనుందని ఫిల్మ్ నగర్ టాక్. కుమార్తె ఆశ్రిత ప్రేమకు వెంకటేష్ పచ్చ జెండా ఊపాడట. తనకు పరిచయం ఉన్న యువకుడితో ఆర్షిత ప్రేమలో పడ్డట్లు వార్తలు వస్తున్నాయి. ఇరు కుటుంబ సభ్యులు అంగీకారం తెలపడంతో వివాహానికి ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది. కూతురు ఆశ్రిత బేకరి రంగంలో వృత్తి నిపుణురాలిగా శిక్షణ తీసుకుంది. ఆమె ఓ ప్రముఖుడి కుమారుడిని ప్రేమించిందని తెలుస్తోంది. వారిద్దరి మధ్య చదువుకునే రోజుల నుంచి స్నేహం ఉందట. అది కాస్తా ప్రేమగా అనంతరం పెళ్లిగా మారినట్టు తెలుస్తోంది.

సీనియర్ తో.. రొమాన్స్ చేస్తోంది!

Submitted by arun on Thu, 03/29/2018 - 11:38

హీరోయిన్లకు విక్టరీ వెంకటేష్ లక్కీ హాండ్. అందులో ఎలాంటి సందేహం లేదు. వెంకీతో మొదటిసారి నటిస్తున్నారంటే.. కచ్చితంగా హిట్ కొట్టి తీరాల్సిందే. డెబ్యూ హీరోయిన్లకైతే.. ఈ సెంటిమెంట్ గతంలో ఎంతగా వర్కవుట్ అయ్యిందో స్పెషల్ గా చెప్పాల్సిన పనిలేదు. అంజలా ఝవేరీ, ప్రీతీజింతా, ఆర్తి అగర్వాల్, కత్రినా కైఫ్.. ఇలా.. టాలీవుడ్ కు కొత్త అందాలను తీసుకురావడంలో.. వెంకీ స్టైలే సెపరేటు.

"ట‌చ్ చేసి చూడు"ను రిజ‌క్ట్ చేసిన టాప్ హీరో

Submitted by lakshman on Sun, 02/04/2018 - 18:04

రెండేళ్ల గ్యాప్ త‌రువాత రాజా ది గ్రేట్ తో హిట్ కొట్టిన మాసామ‌హ‌రాజ త‌నకు అచ్చొచ్చిన పోలీస్ పాత్రల‌తో అల‌రిస్తున్నాడు. అయితే విక్ర‌మ్ సిరికొండ డైర‌క్ష‌న్ లో ప‌వ‌ర్ ఫుల్ ఆఫీస‌ర్ పాత్ర‌లో  ట‌చ్ చేసి చూడు సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. 

అజ్ఞాతవాసిలో యాడ్ చేసే సీన్లు ఇవే

Submitted by arun on Fri, 01/12/2018 - 16:07

ఎన్నో అంచ‌నాల మ‌ధ్య ప‌వ‌న్ క‌ల్యాణ్ - త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్ లో అజ్ఞాతవాసి విడులైంది. సినిమా విడుద‌ల‌తో భారీ అంచ‌నాలే పెట్టుకున్నారు అభిమానులు. అయితే అభిమానుల అంచ‌నాల‌కు ఆక‌ట్టుకోలేక బాక్సాఫీస్ వ‌ద్ద ఢీలా ప‌డిపోయింది. దీంతో నిర్మాత  సినిమాలో కొన్ని సీన్లు యాడ్ చేస్తే ప‌నిలో ప‌డ్డార‌ట‌. అలా చేస్తే సినిమా మ‌రికొన్ని రోజులు ఆడుతుంద‌ని భావిస్తున్నార‌ట‌. ఇదిలా ఉంటే అజ్ఞాతవాసి లో విక్ట‌రీవెంక‌టేష్ ఉన్న‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. కాకపోతే సినిమా నిడివి పెర‌గ‌డంతో ద‌ర్శ‌క‌నిర్మాత‌లో వాయిస్ ఓవ‌ర్ కే ప‌రిమితం చేశారు.

ఆగిపోయిన వెంకీ-తేజ మూవీ..విభేదాల వల్ల అటకెక్కిన సినిమా

Submitted by arun on Thu, 01/04/2018 - 13:00

నేనే రాజు నేనే మంత్రి సినిమాతో మళ్లీ బౌన్స్ బ్యాక్ అయ్యాడు దర్శకుడు తేజ. దీంతో ఈ తేజకు పెద్ద హీరోల నుంచి అవకాశాలు వచ్చాయి. వెంకటేషన్,తేజ కలిసి ఆటా నాదే వేటా అనే మూవీని కూడా స్టార్ట్ చేశారు. కేవలం మూడు నెలల్లోనే సినిమాను పూర్తి చేయాలని ప్లాన్ కూడా చేసుకున్నారు. కానీ ఎవరు ఊహించని రేంజ్లో సినిమా మధ్యలోనే ఆగిపోయింది. అన్నీ ఒకే అయ్యాక షూటింగ్ స్టార్ చేసే ముందు సినిమా ఆగిపోవడం ఇండస్టీలో కామన్. కానీ షూటింగ్ స్టార్ అయ్యాక కూడా సినిమాకు బ్రేక్ పడడం చాలా అరుదుగా జరుగుతుంటాయి. వెంకటేష్,తేజ సినిమాకు అలాంటి సీనే ఎదురైంది. అర్భాటంగా మొదలెట్టిన వెంకేటేష్, తేజ మూవీకి మధ్యలోనే అటకెక్కింది. 

'శ్రీ‌నివాస క‌ళ్యాణం'కి 30 ఏళ్లు

Submitted by nanireddy on Mon, 09/25/2017 - 06:00

నిజ‌మైన ప్రేమ‌.. ప్రేమించేవారి సంతోషాన్ని కోరుకుంటుంది. వారి కోసం ఏమైనా చేసేలా ప్రేరేపిస్తుంది. ఇలా ఆలోచించే ఓ పాత్ర చుట్టూ తిరిగే క‌థ‌తో రూపొందిన సినిమా 'శ్రీ‌నివాస క‌ళ్యాణం'. 'చిన్న‌ప్ప‌ట్నుంచి బావ శ్రీ‌నివాస్‌ని ఇష్ట‌ప‌డే స‌రోజ‌.. ప్ర‌తికూల ప‌రిస్థితుల్లో బాల్యంలోనే అత‌నికి దూర‌మైపోతుంది. తీరా పెద్ద‌య్యాక అత‌న్ని క‌లిసే స‌మ‌యంలో.. అత‌ను అప్ప‌టికే ల‌లిత అనే మ‌రో అమ్మాయితో ప్రేమ‌లో ఉన్నాడ‌ని తెలుస్తుంది. అత‌ని సంతోషం కోసం.. ప్రేమించిన అమ్మాయితోనే అత‌ని పెళ్లి జ‌రగాల‌ని త‌ను ఎవ‌రో చెప్ప‌కుండా ఉండిపోతుంది స‌రోజ‌. ల‌లిత‌కి ఈ విష‌యం తెలిసి.. శ్రీ‌నివాస్‌, స‌రోజ‌ని ఒక్క‌టి చేయాల‌నుకుంటుంది.

'బిచ్చ‌గాడు' త‌రువాత‌..

Submitted by nanireddy on Fri, 09/22/2017 - 20:29

గ‌తేడాది వేస‌వికి విడుద‌లైన త‌మిళ అనువాద చిత్రం 'బిచ్చ‌గాడు' సంచ‌ల‌న విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. శ‌శి ద‌ర్శ‌క‌త్వంలో సంగీత ద‌ర్శ‌కుడు విజ‌య్ ఆంటోని హీరోగా న‌టించిన ఈ సినిమా త‌మిళంలో 'పిచ్చైక్కార‌న్' పేరుతో రూపొందింది. అక్క‌డా మంచి విజ‌యం సాధించింది. 'బిచ్చ‌గాడు' త‌రువాత విజ‌య్ ఆంటోని హీరోగా రెండు సినిమాలు వ‌చ్చాయి. మ‌రో రెండు సినిమాలు విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్నాయి. అయిన‌ప్ప‌టికీ ద‌ర్శ‌కుడు శ‌శి కొత్త చిత్రం ఇంకా సెట్స్ పైకి రాక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

ఇంత‌కీ.. ఎవ‌రా హీరో?

Submitted by nanireddy on Fri, 09/22/2017 - 12:10

'చిత్రం' వంటి ట్రెండ్ సెట్టింగ్ మూవీతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌య్యాడు తేజ‌.  'నువ్వునేను', 'జ‌యం' చిత్రాల విజ‌యాల‌తో సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు అనిపించుకున్నాడు. అయితే ఆ త‌ర‌వాత వ‌రుస ప‌రాజ‌యాలు ప‌ల‌క‌రించాయి. 15 ఏళ్ల త‌రువాత మ‌ళ్లీ 'నేనే రాజు నేనే మంత్రి'తో హిట్ కొట్టాడు తేజ‌. రానా, కాజ‌ల్ జంట‌గా న‌టించిన ఈ సినిమా ఇవాళ‌ త‌మిళంలోకి కూడా అనువాద‌మౌతోంది. 'నాన్ ఆనైయిట్టాల్' పేరుతో అక్క‌డ విడుద‌ల చేస్తున్నారు. 

న‌య‌న్‌కి రెండు సినిమాల్లోనూ..

Submitted by nanireddy on Sat, 09/16/2017 - 19:40

త‌మిళంలో లేడీ సూప‌ర్ స్టార్ గా పేరు తెచ్చుకుంది న‌య‌న‌తార‌. అక్క‌డ చేతినిండా సినిమాల‌తో బిజీగా ఉన్న న‌య‌న్‌.. తెలుగులో మాత్రం సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తోంది. గ‌తేడాది విడుద‌లైన 'బాబు బంగారం' త‌రువాత ఏడాది గ్యాప్ తీసుకున్న న‌య‌న‌తార‌.. ప్ర‌స్తుతం రెండు తెలుగు చిత్రాల‌తో బిజీగా మారింది. ఆ రెండు సినిమాలు కూడా ప్రెస్టీజియ‌స్ మూవీస్ కావ‌డం విశేషం. చిరంజీవి 151వ చిత్రం 'సైరా న‌ర‌సింహారెడ్డి'తో పాటు బాల‌కృష్ణ 102వ చిత్రంలోనూ న‌య‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. అయితే.. ఈ రెండు చిత్రాల్లోనూ న‌య‌న్ సోలో హీరోయిన్ కాదు. ఆమెతో పాటు మ‌రో ఇద్ద‌రు క‌థానాయిక‌లు కూడా ఉంటారు. పేరుకి ముగ్గురు హీరోయిన్లు ఉన్నా..