TDP MPs

‘ఈ జోకర్లు పరువు తీస్తున్నారే!’

Submitted by arun on Mon, 02/12/2018 - 10:24

ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ ఈసారి టీడీపీ ఎంపీలను లక్ష్యం చేసుకున్నాడు. వివిధ అంశాలపై తనదైన శైలిలో వ్యాఖ్యలు చేసే వర్మ... పార్లమెంటులో ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా కోసం ఆందోళన చేస్తున్న టీడీపీ ఎంపీలను జోకర్లుగా అభివర్ణించాడు. టీడీపీ ఎంపీల ఫొటో ఒకటి పోస్టు చేసిన వర్మ...రెండు పోస్టులు పెట్టాడు. 

అరకు ఎంపీ కొత్తపల్లి గీత సంచలన వ్యాఖ్యలు

Submitted by arun on Fri, 02/09/2018 - 13:47

అరకు ఎంపీ కొత్తపల్లి గీత సంచలన వ్యాఖ్యలు చేశారు. హోదా కంటే ప్యాకేజీ మేలని సన్మానాలు చేసి...ఇప్పుడెందుకు మాట మార్చారని మండిపడ్డారు. టీడీపీతో కలిసున్నా ఇవ్వని ప్రత్యేక హోదా....వైసీపీ కలిస్తే ఎలా వస్తుందని ప్రశ్నించారు. జగన్‌ బీజేపీని తిట్టకుండా టీడీపీనే ఎందుకు తిడుతున్నారో చెప్పాలన్నారు. టీడీపీ, వైసీపీలకు చిత్తశుద్ది లేదని పార్లమెంట్‌లో నిరసన అంతా ఒక డ్రామా అన్నారు. చిత్తశుద్ది ఉంటే అందరూ కలసి కేంద్రంపై ఒత్తిడి చేయాలని డిమాండ్ చేశారు.

పార్లమెంట్‌లో ఆందోళన ఉదృతం చేసిన టీడీపీ ఎంపీలు

Submitted by arun on Fri, 02/09/2018 - 11:38

పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం ఎదుట టీడీపీ ఎంపీలు ఆందోళన నిర్వహించారు. నేటితో పార్లమెంటు బడ్జెట్ మొదటి విడత సమావేశాలు ముగుస్తున్నందున ఆందోళన మరింత ఉధృతం చేయాలని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు చేసిన సూచన మేరకు ఎంపీలు పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం ఎదుట ధర్నాకు దిగారు. విభజన హామీలు నెరవేర్చాలంటూ వారు డిమాండ్ చేశారు. సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. టీడీపీకి చెందిన చిత్తూరు ఎంపీ శివప్రసాద్ విచిత్ర వేషంతో ఆందోళనలో పాల్గొన్నారు.

లోక్‌సభలో ఆసక్తికర సన్నివేశం..టీడీపీ ఎంపీలతో సోనియా మంతనాలు!

Submitted by arun on Thu, 02/08/2018 - 12:39

విభజన హామీలను అమలు చేయాలంటూ లోక్‌సభలో టీడీపీ ఎంపీల ఆందోళన కొనసాగుతోంది. ఈ క్రమంలో గురువారం ఉదయం లోక్‌సభలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. మరోవైపు సభలోనే ఉన్న కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఆ పార్టీ సభాపక్ష ఉపనేత జ్యోతిరాదిత్యతో టీడీపీ ఎంపీలు కేశినేని నాని, తోట నర్సింహం, రామ్మోహన్‌నాయుడు మంతనాలు జరిపారు. ఏపీలో పరిస్థితిని సోనియాకు ఎంపీలు వివరించారు. తమకు మద్దతు ఇవ్వాలని ఈ సందర్భంగా వారిని కోరారు.
 

లోక్‌సభలో టీడీపీ ఎంపీల ప్రేక్షకపాత్ర

Submitted by arun on Wed, 02/07/2018 - 12:53

లోక్‌సభలో ప్రధాని మోడీ ప్రసంగిస్తున్న సమయంలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీలు వారి సీట్లలో సైలెంట్‌గా కూర్చొన్నారు. అంతకు ముందు ప్లకార్డులతో హడావిడి చేసిన ఎంపీలు తమ స్ట్రాటజీ ప్రకారం మౌనం వహించారు. దీంతో ప్రధాని ప్రసంగాన్ని కాంగ్రెస్, వైసీపీ , తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు అడ్డుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. గందరగోళం మధ్యే మోడీ తన ప్రసంగాన్ని కొనసాగించాల్సి వచ్చింది. 

టీడీపీ ఎంపీలకు లోక్‌సభ స్పీకర్ వార్నింగ్...

Submitted by arun on Wed, 02/07/2018 - 12:45

ఎంత నచ్చజెపుతున్నా వినకుండా లోక్ సభలో నినాదాలు చేస్తూ పోడియం ముందు నిలబడిన తెలుగుదేశం పార్టీ ఎంపీలను ఉద్దేశించి స్పీకర్ సుమిత్రా మహాజన్ చురకలంటించారు. విభజన హామీలను అమలు చేయాలంటూ గత రెండు రోజులుగా టీడీపీ సభ్యులు పార్లమెంటు బయట, లోపల ఆందోళన నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో సభా కార్యక్రమాలకు ఆటంకం కలుగుతోంది. ఇదిలా ఉండగా బుధవారం కూడా పార్లమెంటులో టీడీపీ ఎంపీలు ఆందోళన నిర్వహించడంతో స్పీకర్ సుమిత్రా మహజన్ కోపగించుకున్నారు. చిన్నపిల్లల్లా ప్రవర్తిస్తున్నారని చురకలు వేశారు. అంతేగాక ఇలా అయితే ఇంట్లో పిల్లల్ని కూడా క్రమశిక్షణలో పెట్టుకోలేరంటూ వ్యాఖ్యానించారు.

సస్పెండ్ అయినా పర్లేదు.. ఉభయ సభల్లో నిరసన తెలపాలి : చంద్రబాబు

Submitted by arun on Wed, 02/07/2018 - 11:15

సస్పెండ్ అయినా ఫర్వాలేదు ఉభయ సభల్లో నిరసన తెలపాలని చంద్రబాబు టీడీపీ ఎంపీలకు రెండు రోజులుగా సూచిస్తున్నారు. ఈ ఉదయం టీడీపీ ఎంపీలు కేంద్రమంత్రి సుజన ఇంట్లో భేటీ అయ్యారు. పార్లమెంటులో అనుసరించే వ్యూహంపై చర్చించారు. అంతకు ముందు ఎంపీలతో టెలీ కాన్ఫరెన్స్ జరిపిన చంద్రబాబు.. బడ్జెట్‌లో ఏపీకి తీవ్ర అన్యాయం జరిగిందని, దీనిపై పోరాటం చేయాల్సిందేనని స్పష్టంగా చెప్పారు.

టీడీపీ ఎంపీలూ.. ప్లకార్డులు మాకు కాదు ప్రధానికి చూపండి!

Submitted by arun on Tue, 02/06/2018 - 17:17

బడ్జెట్‌లో ఏపీకి అన్యాయం జరిగిందంటూ లోక్‌సభలో ఆందోళన బాటపట్టిన టీడీపీ ఎంపీలు వ్యూహం మార్చారు. ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం జరగడానికి అసలు కారణం కాంగ్రెస్సేనంటూ మల్లికార్జున్‌ ఖర్గే ప్రసంగాన్ని అడ్డుకున్నారు. ఏపీకి ఈ గతి పట్టడానికి కాంగ్రెస్సే కారణమన్న టీడీపీ ఎంపీలు..... ప్రధాని మోడీ, హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, సోనియాగాంధీ ముందే గొడవకు దిగారు. కాంగ్రెస్‌కి వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించారు. లోక్‌సభ కెమెరాలో ఖర్గే కనిపించకుండా ప్లకార్డులు అడ్డుపెట్టారు.

టీడీపీ ఎంపీలను చర్చలకు పిలిచిన వెంకయ్య, జైట్లీ..వెళ్లేందుకు సభ్యుల విముఖత

Submitted by arun on Tue, 02/06/2018 - 14:55

విభజన హామీలపై చర్చించేందుకు రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు, ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీలు...టీడీపీ ఎంపీలను చర్చలకు ఆహ్వానించారు. చర్చలకు వెళ్లేందుకు టీడీపీ ఎంపీల విముఖత వ్యక్తం చేశారు. మరోవైపు లోక్‌సభలో టీడీపీ, వైసీపీ ఎంపీల ఆందోళన కొనసాగుతోంది. విభజన హామీలు నెరవేర్చాలంటూ...వెల్‌లోకి వెళ్లి ఎంపీలు ఆందోళన కొనసాగిస్తున్నారు. ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేస్తున్న ఎంపీ మాగంటి బాబుపై స్పీకర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

రాజ్‌‌నాథ్‌ను కలిసిన టీడీపీ ఎంపీలు

Submitted by arun on Mon, 02/05/2018 - 17:36

టీడీపీ ఎంపీలు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ను కలిశారు.  సాయంత్రం 4 గంటల సమయంలో ఎంపీలు రాజ్‌నాథ్‌ను కలిశారు. విభజన చట్టంలోని అంశాలపై రాజ్‌నాథ్‌తో చర్చించారు. ఏడాదిలోగా విభజన హామీలన్నీ అమలయ్యేలాగా చొరవ తీసుకోవాలని టీడీపీ ఎంపీలు రాజ్‌నాథ్‌ను కోరారు. ఈ భేటీలో కేంద్రమంత్రులు అశోకగజపతిరాజు, సుజనా చౌదరి, ఎంపీలు తోట నరసింహం, నిమ్మల కిష్టప్ప, రామ్మోహన్‌ నాయుడు పాల్గొన్నారు. కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి జరిగిన అన్యాయంపై చర్చించనున్నారు. ఎంపీలందరూ సమావేశాల్లో పాల్గొనాల్సిన అవసరం లేదని, ఐదుగురు మాత్రమే సమావేశాల్లో పాల్గొంటే సరిపోతుందని సీఎం చంద్రబాబు ఎంపీలకు సలహా ఇచ్చారు.