MLC Buddha Venkanna

విజయసాయిరెడ్డికి పిచ్చికుక్క కరిచింది...బొడ్డు చుట్టూ 16 ఇంజెక్షన్లు వేయించాలి

Submitted by arun on Tue, 04/03/2018 - 15:58

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఫైరయ్యారు. విజయసాయికి పిచ్చి కుక్క కరిచిందన్న ఆయన....ఇలాంటి వ్యక్తులకు బోడ్డు చుట్టూ 16 ఇంజెక్షన్లు వేయించాలన్నారు. కందకు లేని కత్తికి ఎందుకని...ప్రధాని వీడియో గురించి బీజేపీ నేతలకు లేని వైసీపీ ఎందుకని ప్రశ్నించారు. విజయసాయి బీజేపీ కోవర్టు అయినందునే....సభాహక్కుల నోటీసు ఇచ్చాడన్నారు.
 

వార్డ్ మెంబర్ గా గెలవడం చేతకాని సోము వీర్రాజు: ఎమ్మెల్సీ బుద్దా

Submitted by arun on Mon, 02/05/2018 - 13:15

బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజుపై తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న విరుచుకుపడ్డారు. సోము వీర్రాజు కనీసం వార్డుమెంబర్‌గా కూడా గెలవలేదని, అయినా.. టీడీపీ అతన్ని ఎమ్మెల్సీని చేసిందని బుద్దా గుర్తు చేశారు. టీడీపీ అవినీతి పార్టీ అని విమర్శిస్తున్న వీర్రాజు... అవినీతి పార్టీ ఇచ్చిన ఎమ్మెల్సీ పదవి ఎందుకు తీసుకున్నారని ప్రశ్నించారు. వీర్రాజు వైసీపీకి అమ్ముడు పోయాడన్నారు. పార్టీ పేరుతో ఎంత వసూలు చేశారో మీ నేతలే చెబుతున్నారని, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని బుద్దా వెంకన్న తీవ్రంగా హెచ్చరించారు.