ap special status

చంద్ర‌బాబు దెబ్బ‌తో వైసీపీ - జ‌న‌సేన - బీజేపీ ఉక్కిరిబిక్కిరి..?

Submitted by lakshman on Tue, 04/10/2018 - 11:16

ఏపీలో ఎన్నిక‌ల రాజ‌కీయం వేడెక్కుతుంది. హ‌స్తిన‌లో నిన్న‌మొన్న‌టి వ‌ర‌కు ప్ర‌త్యేక‌హోదా దిశ‌గా మారిన పోరాటం..ఇప్పుడు స్వ‌లాభం కోసం ఎవ‌రి పోరాటం వారు చేస్తున్నారు. వైసీపీ  ఢిల్లీలో ఆమ‌ర‌ణ నిరాహార దీక్ష చేస్తుంది. జ‌న‌సేన - లెఫ్ట్ పార్టీలు రాష్ట్రంలో ప‌ర్య‌ట‌న‌లు చేపట్టేందుకు కార్య‌చ‌ర‌ణ‌ను ప్ర‌క‌టించాయి. దీంతో అన్నీ పార్టీల నాయ‌కులు ప్ర‌త్యేక‌హోదా కోసం ఒకే తాటిపై కాకుండా ఎవ‌రికి వారే య‌మునా తీరే అన్న‌చందంగా వ్య‌వ‌హరిస్తున్నారు. 

హోదా కోసం గడ్డం తీసేసిన దర్శకుడు రాఘవేంద్ర రావు

Submitted by arun on Mon, 04/09/2018 - 11:28

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ... దర్శకుడు రాఘవేంద్రరావు తిరుమల శ్రీవారికి గడ్డం సమర్పించారు. హోదా కోసం పోరాటంలో చిత్ర పరిశ్రమ ముందే ఉంటుందని తెలిపారు. రాష్ట్ర ప్రజలు త్వరలోనే శుభవార్త వినాలంటూ స్వామి వారిని మొక్కుకున్నట్టు రాఘవేంద్రరావు తెలిపారు. 
 

మోడీకి భార్య - పిల్ల‌లుంటే ఇలా చేయ‌రు క‌దా

Submitted by lakshman on Sun, 04/08/2018 - 16:01

ప్రత్యేక హోదా కోసం అధికార, ప్రతిపక్ష పార్టీలు పోరాటం చేస్తున్నాయి. పైచేయి కోసం టీడీపీ, వైసీపీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఓ వైపు ఢిల్లీలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆమరణ దీక్ష చేస్తున్నారు. మరోవైపు టీడీపీ నేతలు ఆదివారం ప్రధాని మోడీ నివాసం వద్ద ఆందోళనకు దిగారు. వైసీపీ ఎంపీల ఆమరణ దీక్ష, మరోవైపు టీడీపీ ఎంపీల ఆందోళన.. ఇలా డిల్లీలో ఇరు పార్టీలు పైచేయి కోసం ప్రయత్నిస్తున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. 

చంద్ర‌బాబు ఓ 420..జ‌గ‌న్ కు జైలు భ‌యం

Submitted by lakshman on Sun, 04/08/2018 - 15:33

ఏపీ రాజ‌కీయం విమ‌ర్శ‌లు ప్ర‌తి విమ‌ర్శ‌ల‌తో వేడెక్కుతుంది. ఏపీకి ప్ర‌త్యేక‌హోదా కావాలంటూ ఏపీకి చెందిన టీడీపీ, వైసీపీ , జ‌న‌సేన‌, లెఫ్ట్ పార్టీలు కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నాయి. వైసీపీ నేత‌లు ఢిల్లీలో ఆమ‌ర‌ణ నిరాహార దీక్ష చేస్తున్నారు. టీడీపీ నేత‌లు పార్ల‌మెంట్ లో ఆందోళ‌న చేస్తున్నారు. ఈనేప‌థ్యంలో గుంటూరు జిల్లా తెనాలిలోని సంగం జాగర్లమూడి వద్ద మీడియాతో మాట్లాడిన జ‌గ‌న్ సీఎం చంద్ర‌బాబును టార్గెట్ చేస్తూ విమ‌ర్శ‌నాస్త్రాలు సంధించారు.  

హేమాహేమిలను కలుస్తానని చెప్పి.. హేమమాలిని క‌లుస్తారా

Submitted by lakshman on Sat, 04/07/2018 - 10:21

ఏపీ సీఎం చంద్ర‌బాబు పై వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాద‌వ్ మండిప‌డ్డారు. తమ పార్టీకి చెందిన ఎంపీలు ఎన్డీఏపై 12సార్లు అవిశ్వాస తీర్మానం పెట్టార‌ని , మ‌రి టీడీపీ ఎంపీలు పార్ల‌మెంట్ లో ఏం చేస్తున్నార‌ని ప్ర‌శ్నించారు. తాము చెప్పిన‌ట్లుగానే ఏపీకి ప్ర‌త్యేక‌హోదా కోసం అవిశ్వాస తీర్మానం ప్ర‌వేశ‌పెట్టామ‌న్న ఆయ‌న ..స‌భ‌లో అన్నాడీఎంకే నేత‌లు అడ్డుప‌డుతుంటే చంద్ర‌బాబు మాట్లాడే ప్ర‌య‌త్నం ఎందుకు చేయ‌లేద‌ని అన్నారు. 

చంద్ర‌బాబు బ్లేమ్ గేమ్ బాగానే ఆడుతున్నారే : ప్రకాష్ జవదేకర్

Submitted by lakshman on Wed, 04/04/2018 - 20:19

ఏపీకి ప్ర‌త్యేక‌హోదా, ఎన్డీఏపై అవిశ్వాస తీర్మానం, కేంద్రం ఏపీకి చేస్తున్న సాయంపై ఏపీ సీఎం చంద్ర‌బాబు ఢిల్లీ ప‌ర్య‌ట‌న చేస్తున్నారు. ఇందులో భాగంగా ఢిల్లీలో బీజేపీయేత‌ర పార్టీల‌కు చెందిన ముఖ్య‌మంత్రుల్ని, ఎంపీల‌తో భేటీ అవుతున్నారు. కేంద్రం తీరును తూర్పార‌బ‌డుతున్నారు.  కేంద్ర ప్రభుత్వం ఏపీ రాష్ట్రానికి ఎలాంటి సహయం చేయలేదని విమర్శలు గుప్పిస్తున్నారు. ఆ విమ‌ర్శ‌ల‌పై  బీజేపీ కేంద్ర‌మంత్రి ప్ర‌కాష్ జ‌వ‌దేక‌ర్ ఘాటుగా స్పందించారు. 

ఢిల్లీలో బాబు హోదా పోరు

Submitted by arun on Tue, 04/03/2018 - 10:37

ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు ప్రత్యేక హోదా పోరును జాతీయ స్థాయిలో లేవనెత్తేందుకు సిద్ధమయ్యారు. ఏపీ భవన్‌లో పార్టీ ఎంపీలతో సమావేశమయ్యారు. పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తున్నారు. తొమ్మిది రోజులుగా అవిశ్వాసం నోటీసు ఇస్తున్నా అన్నాడీఎంకే ఎంపీల ఆందోళనను సాకుగా చూపి సభను వాయిదా వేయడంపై చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మరో మూడు రోజులే పార్లమెంట్‌ సమావేశాలు కొనసాగనున్నందున ఇవాళ, రేపులోగా అవిశ్వాస తీర్మానం చర్చకు వచ్చేలాగా చూడాలని పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు.

ఆ నేత‌ల‌కే వచ్చే ఎన్నిక‌ల్లో టికెట్లు ఖాయం

Submitted by lakshman on Tue, 04/03/2018 - 05:31

ఏపీ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఆ పార్టీ నేత‌ల‌కు ఝ‌ల‌క్ ఇచ్చారు. ప‌నితీరు బాగాలేని ప్ర‌జాప్ర‌తినిధుల‌కు వ‌చ్చే ఎన్నిక‌ల్లోటికెట్లు ఇచ్చేది లేదంటూ బాంబుపేల్చారు. ఈ సంద‌ర్భంగా వైసీపీ ఎంపీ విజ‌య్ సాయిరెడ్డికి స‌వాల్ విసిరారు. విజ‌య‌సాయిరెడ్డి చేసిన ఆరోప‌ణ‌లుకు ఆధారాలున్నాయా అని ప్ర‌శ్నించారు. వైసీపీ ఎంపీ గురించి తాము చేసిన ఆరోప‌ణ‌ల‌పై ఆధారాలు ఉన్నాయంటూ సూచించారు.  . కొన్ని రోజులుగా ఏపీ రాష్ట్రంలో టిడిపి, వైసీపీ నేతల మధ్య మాటల యుద్దం సాగుతోంది. కొన్ని సమయాల్లో ఇరు పార్టీలకు చెందిన నేతలు కొన్ని సందర్భాల్లో వ్యక్తిగత విమర్శలకు కూడ దిగుతున్నారు.

మేం రాజీనామా చేస్తాం...

Submitted by arun on Fri, 03/30/2018 - 16:32

టీడీపీ ఎంపీలు రాజీనామా చేయకపోతే కేంద్రంతో లాలూచీ పడినట్టేనన్నారు వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి. హోదా సాధన కోసం మేం రాజీనామాలు చేస్తామని, టీడీపీ ఎంపీలు కూడా రాజీనామా చేయాలని ఆయన సూచించారు. తాము అవిశ్వాస తీర్మానం పెట్టడం వల్లే అన్ని రాజకీయ పార్టీలు అవిశ్వాసం అంటున్నాయని చెప్పారు. రాజకీయాలు పక్కనపెట్టి ప్రత్యేక హోదా కోసం కలిసికట్టుగా పోరాడదామని పిలుపునిచ్చారు మిథున్‌రెడ్డి. 
 

మా బాబు బంగారం

Submitted by lakshman on Thu, 03/29/2018 - 05:11

న‌టుడు శివాజీ ఏపీ ప్ర‌జ‌ల్ని అప్ర‌మ‌త్తం చేసేందుకు ప‌లు హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. కేంద్రం ఏపీ పై ఆప‌రేష‌న్ గ‌రుడ తో టార్గెట్ చేసింద‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన విష‌యం తెలిసిందే. ఏపీ ప్ర‌జ‌ల‌కోసం ఏడాదిగా డేటాను సేక‌రించిన‌ట్లు, ఆ డేటా ఆధారంగా ప్ర‌జ‌ల్ని అప్ర‌మ‌త్త‌మ‌వ్వాల‌ని సూచించిన‌ట్లు చెప్పుకొచ్చారు.