maharastra

100 మంది బతికున్న భార్యలకు పిండప్రదానం....

Submitted by arun on Mon, 10/08/2018 - 14:05

తమ కాపురాలకు శాస్త్రోక్తంగా  పిండప్రదానం చేశారు భార్యబాధితులు. పైగా బాధితులంతా ఫెమినిజంపై ఆడిపోసుకున్నారు. స్త్రీవాదం, హక్కులు, సమానత్వం అంటూ భార్యలు తమ కాపురాల్లో అగ్గిపెట్టారని ఆరోపించారు. తమ కాపురాలు చనిపోయాయని అందుకు గుర్తుగా ఈ తతంగం నిర్వహించామంటున్నారు మహారాష్ట్రలో భార్య బాధితులు.

నాసిక్‌లో వందమందికిపైగా పురుషులు తమ బతికున్న భార్యలకు పిండప్రదానం చేశారు. వారు తమకు విముక్తి కల్పిస్తారనే భావనతోనే భర్తలు ఈ కార్యక్రమం నిర్వహించారు. వేదమంత్రోచ్ఛారణల నడుమ గోదావరి నదిలో తర్పణాలు విడిచారు. ఈ తతంగమంతా వాస్తవ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కొనసాగింది.  

షాకింగ్: మహిళా కానిస్టేబుల్ కూతురిపై డీసీపీ అత్యాచారం

Submitted by arun on Thu, 06/28/2018 - 11:45

మహారాష్ట్ర ఔరంగబాద్ లో దారుణం జరిగింది. కంచే చేను మేసింది. తన దగ్గర పనిచేస్తున్న మహిళా కానిస్టేబుల్ కూతురిని డీసీపీ రేప్ చేశారు. 23 ఏళ్ల యువతికి మంచి జాబ్ ఇప్పిస్తానని నమ్మబలికి ఈ దారుణానికి పాల్పడ్డాడు.  ఆ యువతిపై అత్యాచారానికి పాల్పడటమేకాక వేధింపులతో నరకం చూపించాడు. డీసీపీ రాహుల్‌ శ్రీరామ్ పై  ఔరంగాబాద్‌ ఎండీసీ పోలీస్‌ స్టేషన్‌లో  కేసు నమోదైంది. గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన కూతురికి ఏదైనా మంచి ఉద్యోగం చూసిపెట్టమని డీసీపీ రాహుల్‌ శ్రీరామ్‌ను అభ్యర్థించింది మహిళా కానిస్టేబుల్‌. ఆ సాకుతో యువతిని ఇంటికి పిలిపించుకున్న ఆ డీసీపీ తన పాడుబుద్ధిని ప్రదర్శించాడు.

ఈ దళిత కుర్రాళ్ళు చేసిన తప్పేంటి.. రాహుల్ ప్రశ్న!

Submitted by arun on Fri, 06/15/2018 - 18:08

మహారాష్ట్రలోని జల్గావ్‌లో దళిత బాలురపై గ్రామస్తుల పైశాచిక దాడిని కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీ తీవ్రంగా ఖండించారు. బీజేపీ, ఆరెస్సెస్ పాటిస్తున్న విషపూరిత రాజకీయాలు దేశాన్ని ఎటువైపునకు తోసుకెళ్తున్నాయో గమనిస్తున్నారా.. అంటూ  రాహుల్ గాంధీ ట్విట్టర్లో ఒక పోస్ట్ పెట్టాడు. ఇద్దరు దళిత యువకుల్ని మొండిమొలపై నిలబెట్టి బెత్తంతో చితక్కొడుతున్నప్పటి వీడియో ఇది. ఈ దళిత పిల్లలు చేసిన తప్పేమిటంటే.. అగ్రవర్ణాల వారికి చెందిన ఫామ్ లోని బావిలో ఈత కొట్టడం! మానవత్వం ఆఖరి దశలో పడింది..! అంటూ కామెంట్ పెట్టాడు రాహుల్. 
 

కోల్హాపూర్ దత్తాత్రేయ ఆలయ విశిష్టత

Submitted by lakshman on Sat, 09/16/2017 - 17:58

దత్తేశ్వర ఆలయాన్ని గురించి ఈ రోజు తెలుసుకుందాం.. మహారాష్ట్ర రాష్ట్రంలోని కోల్హాపూర్‌, నర్శింగ్‌వాడి అనే గ్రామంలో పవిత్ర కృష్ణానది తీరాన ఈ ఆలయం వెలసింది. ఈ ప్రాంతం నర్సోబావాడి అనే ప్రాంతంగా కూడా మంచి పేరుపొందింది. ఈ ప్రాంతంలో దత్తాత్రేయ సుమారు 12 సంవత్సరాలు భక్తితత్వాన్ని ప్రజలకు అందించారు. అందుకే ఈ ప్రాంతాన్ని దత్తా మహారాజ్‌ తపోభూమిగా అభివర్ణిస్తారు. ఇక్కడ ఉన్న దత్తాత్రేయ పాదముద్రలను ఇక్కడకు వచ్చే భక్తులు పూజిస్తారు. పురాణాల ప్రకారం దత్తా మహారాజ్‌ ఇక్కడ ప్రత్యేక పూజలు చేసి అనంతరం ఆయన తన యాత్రను ప్రారంభించి, ఉడుంబెర్‌, గనగపూర్లను సందర్శించి చివరకు కర్డాలివన్‌కు చేరుకున్నట్టు పేర్కొంటారు.

తుల్జా భవాని ఆలయం గురించి సవివరంగా..

Submitted by lakshman on Sat, 09/16/2017 - 17:52

తుల్జా మాత దేవాలయ నిర్మాణ శైలి... హేమద్పంతి పద్ధతిలో గోచరిస్తుంది. అమ్మవారి దేవాలయాన్ని సమీపించిన మనకు అక్కడ రెండు పెద్ద మహద్వారాలు దర్శనమిస్తాయి. గుడిలో ప్రవేశించగానే మొదటగా 108 పవిత్ర తీర్థాలతో కూడిన కల్లోల తీర్థం కనబడుతుంది. నిత్యం ఈ తీర్థం ప్రవహిస్తుండటం ఇక్కడి విశేషం. గోముఖ్‌ సమీపంలో సిద్ది వినాయకుని ఆలయం దర్శనమిస్తుంది. ఆ తర్వాత సర్దార్‌ నింబాల్కర్‌ నిర్మించిన చక్కటి ఆకృతులతో తీర్చిదిద్దిన ఓ గేటును దాటుకుంటూ వస్తాం. ఈ గేటులోనికి ప్రవేశించిన మనకు రెండు ఆకృతులు కనబడతాయి. ఎడమౖవెపున మార్కేండేయ మహర్షి విగ్రహం ఉంటే కుడిౖవెపున పెద్ద నగారా గోచరిస్తుంది.