uddhav thackeray

అమిత్‌షాకి ఊహించని షాక్

Submitted by arun on Wed, 06/06/2018 - 15:53

బీజేపీ చీఫ్ అమిత్‌షాకి మిత్రపక్షం శివసేన ఊహించని షాక్ ఇచ్చింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, శివసేన పార్టీ చీఫ్ ఉద్దవ్ ఠాక్రేను ఈ రోజు సాయంత్రం కలుసుకోనుండగా, శివసేన పార్టీ కీలక ప్రకటన చేసింది. 2019 ఎన్నికల ముందు బీజేపీతో ఎటువంటి పొత్తు ఉండదని పార్టీ పత్రిక సామ్నా సంపాదకీయంలో పేర్కొంది. ఇటీవలే జరిగిన మహారాష్ట్రలోని పాల్ఘర్ ఉప ఎన్నికలో పార్టీ పనితీరును ప్రస్తావిస్తూ... ఈ పోలింగ్ ఫలితాలు ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎవరి పోస్టర్ కూడా తమకు అవసరం లేదని స్పష్టం చేశాయని అభిప్రాయం తెలియజేసింది.

పొత్తుపై అనుకోని అతిథితో ఫోన్లో మాట్లాడిన చంద్రబాబు

Submitted by lakshman on Sun, 02/04/2018 - 17:03

ఔను వాళ్లిద్ద‌రు విడిపోతున్నారంటూ టీడీపీ -  బీజేపీ స్నేహ‌బంధంపై వార్త‌లు వినిపిస్తున్నాయి. కేంద్రం ప్ర‌వేశ పెట్టిన బిల్లులో రాష్ట్రానికి నిధులు కేటాయించ‌క‌పోవ‌డం పై టీడీపీ బీజేపీ పై మండిప‌డుతుందో . ఒకానొక సంద‌ర్భంలో డీపీఆర్ ను ఓ కార‌ణంగా చూపించిన బీజేపీ అందుకే రాష్ట్రానికి నిధులు కేటాయించ‌లేద‌ని చెప్పుకొచ్చింది. దీంతో బీజేపీ తీరును త‌ప్పు బ‌ట్టిన సీఎం చంద్ర‌బాబు ఇవాళ ఆపార్టీ మంత్రులు, ఎంపీల‌తో చ‌ర్చించారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో బీజేపీ తో పొత్తుపై నిర్ణ‌యానికి వ‌చ్చేందుకు ఈ భేటీ నిర్వ‌హించిన‌ట్లు తెలుస్తోంది.