Rahul Dravid

ద్రావిడ్కి మాత్రమే దక్కింది

Submitted by arun on Wed, 09/19/2018 - 12:32

డిసెంబర్ 2011 లో, రాహుల్ ద్రావిడ్ కాన్బెర్రాలోని సర్ డోనాల్డ్ బ్రాడ్మాన్ ప్రసంగ ప్రదేశం వద్ద ఒక ప్రసంగం ఇవ్వటానికి వెళ్ళాడు, ఆ తర్వాత చక్కని ప్రసంగం ఇచ్చాడు, అయితే చాలామందికి తెలియని విషయం ఏంటంటే, అక్కడ ప్రసంగించిన అందరి వక్తల చరిత్రలో మొదటి ఆస్ట్రేలియన్ కాని క్రికెటర్ మన రాహుల్ ద్రావిడ్ కావడం ఒక పెద్ద విశేషం. ఆ ప్రత్యేకమైన గౌరవం ఆస్ట్రేలియన్ కాకున్నా కూడ ద్రావిడ్కి దక్కింది.  శ్రీ.కో.

రాహుల్ ద్రావిడ్కి ఓక"వాల్" అంకితం

Submitted by arun on Mon, 09/17/2018 - 16:25

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం ముందు 10,000 ఇటుకలతో తయారు చేసిన ఒక గోడ ఉంది,  ఇది ద్రావిడ్ 10,000 పరుగులు దాటిన జ్ఞాపకార్థం మైలురాయి నిర్మించిన గోడ. సచిన్ టెండూల్కర్ ప్రారంభించిన ఈ గోడ మీద,  ద్రావిడ్ చేసిన మొత్తం పరుగులను ప్రదర్శిస్తూ ఒక ఎలక్ట్రానిక్ మీటర్ని కుడా అమర్చారు. శ్రీ.కో
 

బీజేపీలోకి ద్రవిడ్‌..కుంబ్లే ?

Submitted by arun on Tue, 04/17/2018 - 16:32

టీమిండియా మాజీ దిగ్గజాలు అనిల్ కుంబ్లే, రాహుల్ ద్రవిడ్‌లు బీజేపీలో చేరబోతున్నారా? అవుననే అంటున్నారు బీజేపీ నేతలు. వచ్చే నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వారిద్దరినీ ఎలాగైనా పార్టీలో చేర్చుకోవడం ద్వారా లబ్ధి పొందాలని బీజేపీ భావిస్తోంది. మే నెలలో కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వీరిద్దరిని బరిలోకి దించి ప్రచారం చేయించాలని భావిస్తోంది. ఐతే, వీరిద్దరూ రాజకీయ ప్రవేశం చేసేందుకు సిద్ధంగా లేనట్లు సమాచారం.

పాక్‌ డ్రెస్సింగ్‌ రూమ్‌ వార్తలపై ద్రవిడ్‌ క్లారిటీ

Submitted by arun on Tue, 02/06/2018 - 12:26

తాను పాక్‌ ఆటగాళ్ల డ్రస్సింగ్‌ రూమ్‌కి వెళ్లినట్లు వస్తున్న వార్తలను అండర్‌-19 భారత క్రికెట్‌ జట్టు కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ కొట్టి పారేశాడు. న్యూజిలాండ్‌లో అండర్‌-19 ప్రపంచకప్‌ గెలిచిన భారత జట్టు సోమవారం ముంబయి చేరుకుంది. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాహుల్‌ ద్రవిడ్‌, జట్టు సారథి పృథ్వీ షా మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. అందులో భాగంగా ఒక విలేకరి టోర్నీలో భాగంగా పాకిస్థాన్‌తో సెమీఫైనల్‌ అనంతరం మీరు ఆ జట్టు డ్రస్సింగ్‌ రూమ్‌లోకి వెళ్లి ఆటగాళ్లు, టీమ్‌ మేనేజర్‌తో మాట్లాడినట్లు వార్తలు వస్తున్నాయి. ఎందుకు వెళ్లారు?

భారత కుర్రాళ్లకు ద్రావిడ్ హ్యాట్సాఫ్

Submitted by arun on Sat, 02/03/2018 - 15:03

భారత కుర్రాళ్లు ఐసీసీ అండర్ -19 ప్రపంచకప్ విజేతలుగా నిలవడంతో చీఫ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ పొంగిపోతున్నారు. తొలి మ్యాచ్ నుంచి ఫైనల్స్ వరకూ తమ కుర్రాళ్లు స్థాయికి తగ్గట్టుగా ఆడారని నాణ్యమైన శిక్షణ సిబ్బంది శ్రమ కూడా ఈ అసాధారణ విజయానికి కారణమని ద్రావిడ్ చెప్పారు. గత ప్రపంచకప్ లో ద్రావిడ్ కోచ్ గా రన్నరప్ స్థానం సాధించిన భారత్ ఈసారి మాత్రం ఏకంగా ప్రపంచ చాంపియన్ గా నిలవడం విశేషం.