passes away

బ్రేకింగ్: భయ్యాజీ మహరాజ్ ఆత్మహత్య

Submitted by arun on Tue, 06/12/2018 - 15:36

ప్రముఖ ఆర్ఎస్ఎస్ నాయకుడు భయ్యాజీ మహరాజ్ ఆత్మహత్య చేసుకున్నారు. తన గన్‌తో షూట్ చేసుకున్నారు. ఇది గమనించిన ఆప్తులు ఆయనను ఆసుపత్రికి తీసుకు వెళ్ళారు. కానీ అప్పటికే ఆయన తుది శ్వాస విడిచారు. భయ్యాజీ మహరాజ్ ఆకస్మిక మరణంతో ఆయన అభిమానులు తల్లడిల్లిపోతున్నారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌కు అత్యంత ఆప్తుడైన భయ్యాజీ మహరాజ్ గత కొంత కాలంగా ఆధ్యాత్మిక జీవితాన్నిగడుపుతున్నారు. 2016 నుంచి ప్రజాజీవితానికి దూరంగా ఉంటున్నారు. మహారాష్ట్రలో ఆయనకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయన ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారో ఇంకా తెలియాల్సి ఉంది.

శ్రీదేవి మృతిలో మిస్టరీ..బాత్‌టబ్‌లో పడిందా? తోసేశారా?

Submitted by arun on Mon, 02/26/2018 - 18:54

ప్రమాదవశాత్తు బాత్‌ టబ్‌లో మునిగి శ్రీదేవి చనిపోయిందని దుబాయ్‌ వైద్యులు ఫోరెన్సిక్‌ రిపోర్ట్‌ ఇచ్చారు. అయితే ఈ నివేదికపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాత్‌ టబ్‌లో శ్రీదేవి ప్రమాదవశాత్తు మునిగిపోయిందా...లేదంటే ఎవరైనా ముంచేశారా?

ప్రమాదవశాత్తూ బాత్‌టబ్‌లో పడి చనిపోయిందని రిపోర్ట్‌
ఫోరెన్సిక్‌ నివేదికపై అనేక అనుమానాలు
కేసును పునర్విచారణ చేస్తున్నట్టు ప్రకటించిన పోలీసులు
బోనీకపూర్‌ను మూడు గంటలపాటు ప్రశ్నించిన పోలీసులు
శ్రీదేవి, బోనీకపూర్‌ల కాల్‌ డేలా పరిశీలన
శ్రీదేవి మృతి కేసు పబ్లిక్‌ ప్రాసిక్యూషన్‌కు అప్పగింత

దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు శ్రీదేవి కేసు ట్రాన్స్‌ఫర్

Submitted by arun on Mon, 02/26/2018 - 18:21

అతిలోక సుందరి శ్రీదేవి ప్రమాదవశాత్తూ బాత్‌రూమ్‌లో చనిపోయిందనేది దుబాయ్‌ ఫోరెన్సిక్‌ రిపోర్ట్‌లో తేలింది. అయితే ఇప్పటి వరకూ తను ఏ కారణంతో మరణించిందన్న సందేహం అందరిలో వ్యక్తమయ్యింది. శ్రీ‌దేవి మృత‌దేహం రాక మ‌రింత జాప్యం జ‌రిగే అవ‌కాశం క‌నిపిస్తున్న‌ది. ఈ కేసును లోతుగా ద‌ర్యాప్తు చేయ‌నున్న‌ట్లు స‌మాచారం. పోస్టుమార్ట‌మ్ ఆల‌స్యం, ఫోరెన్సిక్ రిపోర్టుపై ప‌లు అనుమానాలు త‌లెత్తిన నేప‌థ్యంలో దుబాయ్ పోలీసులు ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. శ్రీదేవి మృతి కేసును దుబాయ్ పోలీసులు ఆ దేశ పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు ట్రాన్స్‌ఫర్ చేశారు. కాసేపటి క్రితమే శ్రీదేవికి నిర్వహించిన ఫోరెన్సిక్ రిపోర్ట్‌ను రిలీజ్ చేశారు.

ప్రముఖ సినీనటి శ్రీదేవి కన్నుమూత

Submitted by arun on Sun, 02/25/2018 - 08:19

అతిలోక సుందరి శ్రీదేవి ఇక లేరు. దుబాయ్ లో బంధువుల వెడ్డింగ్ కి భర్త బోనీ కపూర్, చిన్న కూతురు ఖుషి కపూర్ తో కలిసి వెళ్లిన శ్రీదేవి.. సడెన్ గా హార్ట్ ఎటాక్ రావడంతో ఈ లోకం విడిచి వెళ్లినట్లుగా ఈ విషయాన్ని బోని కపూర్‌ సోదరుడు సంజయ్‌ కపూర్‌ ధ్రువీకరించారు. శనివారం రాత్రి పదకొండున్నర గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు తెలిపారు. శ్రీదేవి మరణించిన సమయంలో భర్త బోని కపూర్‌, కూతురు ఖుషి పక్కనే ఉన్నట్లు చెప్పారు. 1963 ఆగష్టు 13న తమిళనాడులోని శివకాశిలో శ్రీదేవి జన్మించారు. శ్రీదేవి అసలు పేరు ‘శ్రీ అమ్మా యాంగేర్‌ అయ్యపాన్‌’.

భానుప్రియ జీవితంలో ఊహించని విషాదం..

Submitted by arun on Sat, 02/03/2018 - 12:38

ఒకప్పటి అందాల నటి భానుప్రియ జీవితంలో అనుకోని విషాదం చోటు చేసుకుంది. ఆమె మాజీ భర్త ఆదర్శ్ కౌశల్ గుండెపోటుతో అమెరికాలో మృతిచెందారు. కౌశల్ మృతి వార్త విని భానుప్రియ షాక్‌కు గురైనట్లు సమాచారం. ఆ వెంటనే కుమార్తెను తీసుకుని ఆమె అమెరికా బయలుదేరి వెళ్లారు. 1998 జూన్ లో అమెరికాలోని కాలిఫోర్నియాలోని శ్రీ వెంకటేశ్వర ఆలయంలో వీరి వివాహం జర‌గ‌గా, 2005లో వీరిరివురు మ‌న‌స్ప‌ర్ధ‌ల వ‌ల‌న విడిపోయారు. భాను ప్రియ‌, ఆద‌ర్శ్ దంప‌తుల‌కి 2003లో పాప జ‌న్మించింది. ఆమెకి అభిన‌య అని పేరు పెట్టుకున్నారు. వృత్తిపరంగా ఆదర్శ్ కౌశల్ ఒక ఫోటోగ్రాఫర్. భ‌ర్త‌తో విడాకుల త‌ర్వాత కూతురుతో పాటు ఇండియాకి వ‌చ్చింది భాను ప్రియ‌.